Saturday, May 30, 2020

సర్వం రద్దుల పర్వం.. ఏడాది పాలనలో పాత పథకాలన్నీ పక్కకే..

సర్వం రద్దుల పర్వం.. ఏడాది పాలనలో పాత పథకాలన్నీ పక్కకే..
ప్రజోపయోగ పథకాలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం

‘చింతలపూడి ఎత్తిపోతల’ను ఎండబెట్టారు

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


గ్రామ, వార్డు సచివాలయాలుగా మారిన ‘అన్న క్యాంటీన్లు’

భూధార్‌ స్థానంలో భూముల ‘స్వచ్ఛీకరణ’

‘పాత’రేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన

వైసీపీ సర్కారు ఏడాది పాలనపై విశ్లేషణ



విజయవాడ, ఆంద్రజ్యోతి: ఒక్క అవకాశం ఇచ్చి చూడమంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకుంది. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తామంటూ అధికారంలోకి వచ్చిననాడు ఇచ్చిన హామీ అమలు మాట ఎలా ఉన్నా.. పాత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజా ప్రయోజన పథకాలను పక్కకు నెట్టేసింది. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే చింతలపూడి ఎత్తిపోతలను కన్నెత్తి చూడడం లేదు. ‘అన్న’ క్యాంటీన్లు కష్టకాలంలో అన్నార్తులకు అక్కరకు రాకుండాపోయాయి. రక్షిత మంచినీటి పథకం రద్దయిపోయింది. భూ వివాదాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టే ‘భూధార్‌’ స్థానంలో భూముల ‘స్వచ్చీకరణ’ను తీసుకు వచ్చారు. ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా సంక్షేమ పథకాల ద్వారా ‘అది చేశాం.. ఇది చేశాం..’ అని చెబుతున్న పాలకులు గత పాలకులు ప్రవేశపెట్టిన ప్రజోపయోగ సంక్షేమ పథకాలను పక్కన పెట్టేయడం ద్వారా సాధించిందేమిటో ఆలోచించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చి, ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రద్దు చేసిన పథకాలపై ప్రత్యేక కథనం..



రాజకీయ క్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలే పరమావధి కావాలి. ప్రజా సంక్షేమం కోసమే పరితపించాలి. ఆ ప్రభుత్వం పథకాన్ని అమలు చేయటమేమిటని ఈ ప్రభుత్వం భావించి వాటిని రద్దుచేస్తే పాలన ఇంకేం ముందుకెళ్తుంది. ఏడాది పరిపాలనపై జిల్లావ్యాప్తంగా సంక్షేమ పథకాల అమల్లో ‘అది చేశాం.. ఇది చేశాం..’ అని చెబుతున్న పాలకులు వాస్తవ పరిస్థితిని మాత్రం దాస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చేశారు. మనజిల్లాలో అలాంటి పరిస్థితులు కోకొల్లలు. ప్రస్తుత ప్రభుత్వ ఏడాది పాలనలో మనజిల్లాలో రద్దయిన కీలకమైన ప్రాజెక్టులు ఇవీ..


అన్నం లేక అవస్థలు

అభాగ్యులు, కూలీలు, కార్మికుల కడుపు నింపడానికి టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 38 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వీటిలో రోజుకు 18వేల మంది పేదలు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారు. నిర్వహణ అక్షయపాత్రకు అందజేశారు. కేవలం రూ.5 ఉంటే అల్పాహారం లేదా భోజనం ఆరగించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని మూసేసింది. వీటి స్థానంలో రాజన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. వాటికి సంబంధించిన నకిలీ నమూనాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఎలాంటి క్యాంటీన్లు లేవు. ఈ రెండు జిల్లాల్లోని 38 క్యాంటీన్లలో కొన్నింటిని గ్రామ, వార్డు సచివాలయాలుగా మార్చేశారు. మరికొన్ని నిరుపయోగంగానే ఉన్నాయి. కూలీలు, కార్మికులకు కడుపు నింపుకోవడం కష్టంగా మారింది.


భూధార్‌.. చేజార్‌..

టీడీపీ అధికారంలో ఉండగా, భూ వివాదాలకు సంబంధించి భూధార్‌ వంటి ప్రయోగాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ఆధార్‌ కార్డులా ప్రతి భూ యజయానికి భూ ఆధార్‌లా  దీన్ని తీసుకొచ్చారు. మన జిల్లా పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక కాగా, జగ్గయ్యపేట మండలంలో తాత్కాలికంగా భూధార్‌ ప్రక్రియను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సర్వే సంస్థతో భూముల హద్దులను నిర్ణయించి తాత్కాలికంగా భూధార్‌లను రూపొందించారు. ఇది విజయవంతం కావటంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయటానికి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. ఇదే సందర్భంలో భూముల స్వచ్ఛీకరణ పేరుతో ఒక కార్యక్రమాన్ని తెచ్చింది. భూ వివాదాలకు పరిష్కారం లభించలేదు. స్పందన కార్యక్రమంలో రెవెన్యూకు సంబంధించి భూ వివాదాల అర్జీలే ఎక్కువ వస్తున్నాయి. దీనిని  బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.



రక్షిత మంచినీటి పథకం రద్దు

గ్రామీణ నీటి సరఫరా సంస్థ (ఆర్‌డబ్ల్యూఎస్‌) నేతృత్వంలో నూరుశాతం రక్షిత మంచినీటి సరఫరా పథకానికి గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పైలెట్‌ ప్రాజెక్టులో తొలిదశలో మనజిల్లాకు అవకాశం కల్పించారు. మొత్తం 970 గ్రామ పంచాయతీల్లో తలసరి మంచినీటి సరఫరాను 40 శాతం నుంచి 70 శాతానికి తీసుకెళ్లాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో నీటి వనరుల లభ్యత, నీటి కొరతను ఎదుర్కొనే ప్రాంతాలను గుర్తించి నీటి వనరుల సద్వినియోగానికి మౌలిక సదుపాయాలపరంగా ఏమేమి చేపట్టాలన్న దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారుచేశారు. మెగా సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనులు ప్రారంభించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జిల్లాలో పనులు జరుగుతున్న రక్షిత మంచినీటి ప్రాజెక్టును రద్దు చేసింది. దీని స్థానంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీలు, పారిశ్రామిక సంస్థల నీటి అవసరాలను తీర్చేలా డీపీఆర్‌ తయారు చేయాల్సిందిగా నిర్దేశించింది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన తరువాత రెండో ఫేజ్‌లో పెట్టారు. మొదటి ఫేజ్‌లో మన జిల్లాకు అవకాశం దక్కలేదు.



చెత్త నుంచి సంపద సున్నా

గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య సమస్యలు లేకుండా స్వచ్ఛంగా ఉంచేందుకు గత ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు కృషిచేసింది. ప్రస్తుతం ఈ పథకానికి సుస్తీ చేసింది. గత ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 980 గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసింది. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించటం కోసం గ్రీన్‌ అంబాసిడర్లను నియమించింది. చెత్త సేకరణకు రిక్షాలు, ఆటోరిక్షాలు, పుష్‌కాట్‌లు, మినీ పొక్లెయిన్ల వంటివి స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ నిధుల ద్వారా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేయించింది. జిల్లావ్యాప్తంగా 980 పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన రూ.3 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చు చేశారు. తీరా.. నిర్వహించాల్సిన సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకం అమల్లో నిర్లిప్తత ప్రదర్శించింది. గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు లేక మానివేశారు. యంత్ర సామగ్రి మూలనపడింది. వాహనాలు తుప్పుపట్టాయి. తాజాగా ప్రజల నుంచి యూజర్‌ చార్జీలు వసూలుచేసి చెత్త నిర్వహణ కేంద్రాలను నడిపించాలన్న ఆలోచన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మూలనపెట్టిన పథకాన్ని యూజర్‌ చార్జీల వసూళ్ల ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.


చింత తీరలేదు

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెట్టప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని చింతలపూడి-2 ఎత్తిపోతల పథకం ప్రారంభం కాగా, నేడు అది అనాథలా మారింది. టీడీపీ హయాంలో ఈ పథకం పనులు పరుగెత్తగా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. ఏడాది అవుతున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో రైతులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చింతలపూడి ఫేజ్‌-1 ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఫేజ్‌-2కు 2017లో అప్పటి సీఎం చంద్రబాబు రూ.3,200 కోట్లతో మొద్దులపర్వ వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పథకం పూర్తికావడానికి కృషిచేశారు. 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొంతమంది రైతులు ప్రభుత్వం తమకు ప్రకటించిన నష్టపరిహారం తక్కువగా ఉందని కోర్టుకెళ్లారు. చాట్రాయి మండలంలో సుమారు 100 ఎకరాల అసైన్డ్‌ భూములను సేకరించినా, రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం పథకం పూర్తిచేయడానికి నాబార్డు నుంచి రూ.1,931 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. ప్రభుత్వం నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తేనే పనులు ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం వినియోగంలోకి వస్తే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 మండలాల్లోని 4.80 లక్షల ఎకరాలకు 53.50 టీఎంసీల గోదావరి నీరు అందుతుంది.



ఏడాదికే ప్రజలు విసుగెత్తిపోయారు: బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ

జగన్‌ ఏడాది పాలన.. సినిమాకు ట్రైలర్‌ లాంటిది. ఈ ట్రైలరును చూసి ప్రజలు విసుగెత్తిపోయారు. టీడీపీ హయాంలో అమలుచేసిన చంద్రన్న బీమా, పెళ్లి కానుక, రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి.. వంటి అనేక సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది.



పూర్తి వైఫల్యం: పాతూరి నాగభూషణం, బీజేపీ నాయకుడు

వైసీపీ ప్రభుత్వం ఏడాది కాలంలోనే అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకువచ్చారా? ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తిచేశారా? కోర్టులు చీవాట్లు పెడుతున్నా పాలకులకు బుద్ధి రావడం లేదు. ఇదే పద్ధతి కొనసాగితే ఐదేళ్లు కాదు.. మరో ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చీత్కారాలను ఎదుర్కొనక తప్పదు.




Tuesday, May 26, 2020

జడ్జీలను నరికేస్తారా?

May 27 2020 @ 03:15AMహోంఆంధ్రప్రదేశ్
జడ్జీలను నరికేస్తారా?

ముక్కలు ముక్కలు చేయాలంటారా!
గదిలో బంధించి కరోనా రోగిని వదలాలంటారా?
ఎందుకూ పనికిరాని జడ్జీలంటూ తిట్లు
అసభ్య దూషణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు
హైకోర్టుకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించారు
జడ్జీలకు అవినీతి, కులాన్నీ అంటగట్టారు
ఆ ఇంటర్వ్యూలు, సోషల్‌ మీడియా పోస్టులు
కోర్టు ప్రతిష్ఠకు భంగం, ముమ్మాటికీ ధిక్కరణే
భారీ కుట్ర ఉన్నట్లుంది: హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఎంపీ నందిగం సురేశ్‌, ఆమంచి సహా 49 మందికి ‘ధిక్కరణ’ నోటీసులు
మరో 8 మందిని గుర్తించాలని ఆదేశం


హైకోర్టు కన్నెర్ర..

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


‘‘హైకోర్టులో ఎంతమంది జడ్జీలు ఉంటే అంతమందినీ ముక్కలుగా నరకాలి. అందరినీ నరకాల్సిందే. మొత్తం జడ్జీలను ఒక గదిలో పెట్టి... అదే గదిలో కరోనా రోగిని వదలాలి’’ అని చందూ రెడ్డి అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు.

హైకోర్టు జడ్జీలు ఎందుకూ పనికిరారంటూ బూతులు తిట్టి... కావాలంటే తననూ అరెస్టు చేసి సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునని కిశోర్‌ రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.

సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన కొందరు జడ్జీలకు, హైకోర్టుకు కులం ఆపాదించారు. అవినీతి ఆరోపణలు చేశారు. మరిన్ని తప్పుడు ఉద్దేశాలను అంటగట్టారు. దూషించారు. విద్వేషం చిమ్మారు. ప్రాణహాని బెదిరింపులు చేశారు. హైకోర్టుతోపాటు హైకోర్టు న్యాయమూర్తులపట్ల ద్వేషాన్ని కనపరిచారు. ఇతరులనూ రెచ్చగొట్టారు. ఇదంతా చూస్తుంటే హైకోర్టు న్యాయమూర్తుల మీద భారీ కుట్రకు తెరలేపినట్లు అర్థమవుతోంది.

తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో నందిగం సురేశ్‌ మాటలు ‘సాక్షి’ న్యూస్‌లో ప్రత్యక్షప్రసారమయ్యాయి. ఆయన హైకోర్టుకు తప్పుడు ఉద్దేశాలను అంటగట్టారు. చంద్రబాబు నాయుడు హైకోర్టును మేనేజ్‌ చేస్తున్నారన్నారు. కోర్టు తీర్పులు చంద్రబాబు నాయుడుకు పది లేదా 30 నిమిషాల ముందే ఎలా తెలుస్తున్నాయని అన్నారు. ఆయనపై విచారణ జరపాలని, కాల్‌ లిస్ట్‌ కూడా బయటపెట్టాలని నందిగం సురేశ్‌ అన్నారు.

వీడియో/క్లిప్పింగ్‌లు/పోస్టింగ్‌లు న్యాయస్థానం గౌరవాన్ని, జడ్జీల ప్రతిష్ఠను దెబ్బతీసేవే. ఇది కోర్టు ధిక్కరణకు పాల్పడటమే!

- హైకోర్టు



అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ... సోషల్‌ మీడియా వేదికగా రకరకాలుగా, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వారిపై రాష్ట్ర హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికి తాము గుర్తించిన 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో... అధికార పార్టీ ఎంపీ నందిగం సురేశ్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కూడా ఉన్నారు. గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్‌ సుధాకర్‌ కేసుల్లో శుక్రవారం తీర్పు చెప్పిన తర్వాత... అధికార పార్టీ నేతలు నేరుగా  కోర్టులను, జడ్జిలను విమర్శించారు. ఇక... వైసీపీ అభిమానులు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోయారు. జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేసును సుమోటో (తనంతట తాను)గా విచారణ చేపట్టింది.  న్యాయస్థానం, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ‘కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ’ చర్యలకు ఆదేశించింది. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ సంచలన ఆదేశాలు వెలువరించింది.



తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తారా...

ఈనెల 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య కోర్టును, జడ్జిలను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో పలువురు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు హైకోర్టు అధికారిక ఈ-మెయిల్‌కు అందాయని ధర్మాసనం తెలిపింది. ఆంగ్ల మాధ్యమం, గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు, డాక్టర్‌ సుధాకర్‌ కేసు,  వలస కార్మికుల తరలింపు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు సంబంధించిన పిల్‌, రిట్‌ పిటిషన్ల సంఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘వాటిపై తీర్పులు చెప్పినందుకు కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు తప్పుడు ఉద్దేశాలను, కులాన్ని ఆపాదించారు. అవినీతి ఆరోపణలు చేశారు. ప్రాణహాని కలిగిస్తామనేలా బెదిరించారు. అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు’’ అని ధర్మాసనం తెలిపింది. నందిగం సురేశ్‌, ఆమంచి కృష్ణమోహన్‌, రవిచందార్రెడ్డి తదితర వ్యక్తులు ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, పోస్టింగ్‌ల ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పింది. వాస్తవాలను వక్రీకరించడంతోపాటు విద్వేషపూరితంగా, రెచ్చగొటేలా వ్యాఖ్యానించారని తెలిపింది. ‘‘చందు రెడ్డి అనే వ్యక్తి... మొత్తం జడ్జిలను ముక్కలు ముక్కలుగా నరకాలని ట్వీట్‌ చేశారు’’ అని పేర్కొంది. ‘హైకోర్టు జడ్జిలు ఎందుకూ పనికిరారు’ అంటూ కిశోర్‌ రెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో చేసిన అసభ్య, అసహ్య దూషణలను కూడా ఆదేశాల్లో ప్రస్తావించింది. ఇలాగే అనేకమంది అసభ్య పదజాలంతో సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేశారని తెలిపింది. ‘‘ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్దస్థాయి కుట్ర ఉన్నట్లు అనిపిస్తోంది. వీడియో/క్లిప్పింగ్‌లు/పోస్టింగ్‌లు న్యాయస్థానం గౌరవాన్ని, జడ్జిల ప్రతిష్ఠను దెబ్బతీసేవే. ఇది కోర్టు ధిక్కరణకు పాల్పడటమే’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తిని అవమానిస్తూ, దూషిస్తూ పలురకాల వ్యాఖ్యలు చేసినట్లు గతనెల 6, 17వ తేదీల్లో రిజిస్ట్రార్‌ జనరల్‌ నివేదికలు సమర్పించారని తెలిపింది. తాము గుర్తించిన 49 మందికి ఈ-మెయిల్‌, వాట్సప్‌ లేదా ఇతర మార్గాల్లో నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసిన మరో 8  మందిని గుర్తించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, తదుపరి విచారణ నాటికి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.



ఫుల్‌ కోర్టు భేటీ సమీక్ష...

హైకోర్టులోని వివిధ ధర్మాసనాలు ఇటీవల ఇచ్చిన తీర్పులపై కొంతమంది వివిధ మాధ్యమాల్లో న్యాయమూర్తుల పట్ల, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు రిజిస్ట్రార్‌కు భారీగా ఫిర్యాదులు అందాయి. వాటిని ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు. ఆయన సోమవారం న్యాయమూర్తులందరితో (ఫుల్‌కోర్టు) సమావేశం ఏర్పాటు చేసి... ఈ వ్యవహారంపై కూలంకషంగా చర్చించారు. ఎవరెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారన్న దానిపై ఆధారాలను పరిశీలించారు. న్యాయమూర్తులంతా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందేనని తేల్చడంతో ఫుల్‌కోర్టు వాటిపై ఒక నిర్ణయానికి వచ్చింది. అనంతరం సుమోటోగా స్వీకరించి మంగళవారం విచారణ చేపట్టింది.



చర్యలకు ఏజీ అంగీకారం

సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల్లోని వీడియోలు, పోస్టులు, వారి వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు మరకలు అంటించేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలను గర్హిస్తున్నట్లు స్పష్టం చేశారు. వాటిని కోర్టు ధిక్కరణగా పరిగణించేందుకు తాను లిఖితపూర్వక ఆమోదం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులపై కొంతమంది చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం సరి కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎ్‌సజీ) హరినాథ్‌ కూడా వాదనలు వినిపించారు. వారి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 16వ తేదీకి వాయిదా వేసింది.

Thursday, May 7, 2020

3 గంటల్లోనే అదుపులోకి .. డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌

3 గంటల్లోనే అదుపులోకి .. డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌
May 08, 2020, 04:28 IST
DGP Gautam Sawang Speaks About Gas Leakage Accident - Sakshi
సమాచారం అందిన పది నిమిషాల్లో ప్రమాద స్థలికి పోలీసులు

మీడియా సమావేశంలో డీజీపీ సవాంగ్‌

సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టిందని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ ఘటనపై  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్యాప్తునకు ఆదేశించారని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్‌ జగన్‌తో అత్యవసర సమావేశం అనంతరం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెల్లవారు జామున 3.30 గంటలకు గ్యాస్‌ లీక్‌ కాగా మూడు గంటల్లోనే పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకువచ్చిందీ ఈ సందర్భంగా ఆయన వివరించారు. 
► విషవాయువు వెలువడిన విషయాన్ని స్థానికులు తెల్లవారుజామున డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రక్షక్‌ మొబైల్‌ పోలీసులు కేవలం పది నిముషాల్లోనే ఘటన స్థలానికి వెళ్లారు.  విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా 4.30 గంటల ప్రాంతంలో స్వయంగా వెళ్లి పరిశీలించి సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీసులను తరలించి సహాయక చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు మంగళగిరి పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించాం. 
► ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని తలుపులు పగలగొట్టి ఆస్పత్రులకు తరలించి రక్షించాం. మూడు గంటల్లోనే గ్యాస్‌ లీకేజీని అదుపులోకి తెచ్చాం.  కొందరు పోలీసులు కళ్లు తిరుగుతున్నా, వికారం వచ్చినా ఇబ్బందిపడుతూనే ప్రజల ప్రాణాలను కాపాడారు.
► నేషనల్‌ డిజాస్టార్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), స్టేట్‌ డిజాస్టార్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడాయి. విజయవాడ నుంచి కూడా ఫోరెన్సిక్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లను పంపించాం. 
► ఉదయం 3.30గంటలకు ప్రమాదం జరిగితే తక్షణం స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రతిపాదిక చర్యలు చేపట్టింది.  సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించి ఉదయం 6.30 గంటలకు మామూలు పరిస్థితిని తీసుకుని రాగలిగింది.

అండగా ఉంటా.. రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం

అండగా ఉంటా.. రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం
May 08, 2020, 03:20 IST
YS Jagan Mohan Reddy Assured For Victims Of Gas Leakage In Visakhapatnam - Sakshi
మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్, సీఎస్‌ నీలం సాహ్ని

మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ అభయం

కుటుంబంలో ఒకరికి ఎల్‌జీ కంపెనీలో ఉద్యోగం

బాధిత ఐదు గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సాయం

కుటుంబంలో ఒకరికి ఎల్‌జీ కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు

వెంటిలేటర్‌పై వైద్యం పొందుతున్న వారికి రూ.10 లక్షల సహాయం

రెండు మూడు రోజులు వైద్యం అవసరమైన వారికి రూ.లక్ష

ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు

బాధిత గ్రామాల్లో 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల సాయం

పశువులు కోల్పోయిన వారికి వంద శాతం నష్ట పరిహారం

గ్రామాలకు వెళ్లలేని వారికి షెల్టర్లు, భోజనం ఏర్పాట్లు

గ్యాస్‌ లీకేజీ ఘటనపై లోతైన దర్యాప్తునకు కమిటీ

కమిటీ నివేదిక ఆధారంగా కంపెనీపై చర్యలుతరలించాల్సి వస్తే నిర్మొహమాటంగా తరలింపు

ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా కచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. 

చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటిస్తున్నాను. కంపెనీ పునఃప్రారంభమైన తర్వాత, లేదంటే వేరొక చోటుకు తరలించిన తర్వాతైనా సరే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌కు అప్పగించాను.


సాక్షి, విశాఖపట్నం: విపత్తుతో విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు ఒక మంచి మనసున్న వ్యక్తిగా అన్ని విధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఎవరూ ఊహించని విధంగా నష్టపరిహారం ప్రకటించారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం సమీపంలోనున్న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో గురువారం తెల్లవారుజామున గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసి.. మధ్యాహ్నం విశాఖకు చేరుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆంధ్రా వైద్య కళాశాలలో అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రమాద బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఘటన దురదృష్టకరం
► గురువారం తెల్లవారుజామున జరిగిన గ్యాస్‌ లీకేజీ ఘటన దురదృష్టకరం. స్టైరీన్‌ అనే ఒక హైడ్రోకార్బన్‌ ముడి సరుకును ఎక్కువ రోజులు నిల్వ చేయడం ఇందుకు కారణమైంది. ఈ గ్యాస్‌ లీక్‌ కావడం వల్ల ఐదు గ్రామాలు ప్రభావానికి గురి కావడం బాధాకరమైన అంశం.
► ఎల్‌జీ అనే ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్న కంపెనీలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇంకా బాధాకరం. దీనిపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని వేస్తున్నాం. పర్యావరణం, అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి, జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీసు కమిషనర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
► ఈ దుర్ఘటనకు కారణాలేమిటి? ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలి? అనే అంశాలపై అధ్యయనం చేసి, ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కంపెనీపై తదుపరి చర్యలు ఉంటాయి. చదవండి: విశాఖ విషాదం

వెంటిలేటర్‌ సాయంతో వైద్యం పొందుతున్న వారికి రూ.10 లక్షలు.. రెండు మూడు రోజుల పాటు చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష.. ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం.

గ్యాస్‌ లీక్‌ వల్ల ఆయా గ్రామాల ప్రజలపై నేరుగా కాకపోయినా, పరోక్షంగా కొద్ది రోజుల పాటు స్ట్రెస్‌ ఉంటుంది. వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరినగర్, పద్మనాభనగర్‌ గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. అన్ని రకాలుగా ప్రభుత్వం తోడు, నీడగా ఉంటుంది. ఈ గ్రామాల్లో 15,000 మంది వరకు నివాసం ఉంటారని తెలిసింది. ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తాం

కేజీహెచ్‌లో బాధితులను పరామర్శిస్తున్న సీఎం

వైద్యానికి ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు
► బాధితులెవ్వరూ ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యానికి అయ్యే ఖర్చు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేటప్పుడు పరిహారం మొత్తాన్ని ఇచ్చి, సంతోషంగా ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాం.
► బాధిత గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు పెట్టాలని ఆదేశిస్తున్నాను. గ్రామాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలి. మంచి భోజనం పెట్టించాలి.

అలారం ఎందుకు మోగలేదు?
► గ్యాస్‌ లీక్‌ అయినప్పుడు అందరినీ అప్రమత్తం చేసే అలారం ఎందుకు మోగలేదు? ఇది నన్నెంతో కలతకు గురి చేస్తోంది.
► ఈ విషయం, మిగతా విషయాలపై కమిటీ నివేదిక వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటాం. వేరొక చోటుకు తరలించాల్సిన అవసరం ఉందని కమిటీ చెబితే.. నిర్మొహమాటంగా ఈ పరిశ్రమను తరలించేలా చూస్తాం.

ప్రభావిత గ్రామాల్లో కొంత మంది రైతులకు చెందిన పశువులు చనిపోయాయి. వారికి నూరు శాతం నష్ట పరిహారం ఇవ్వడమే కాకుండా అదనంగా రూ.20 వేలు సాయం చేస్తాం.

అధికారులకు అభినందనలు
► గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన తెల్లవారుజామున జరిగిన వెంటనే 4.30 గంటలకే పోలీసులు.. డీసీపీ, 5 గంటలకే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఘటన స్థలికి వెళ్లారు. బాధితులకు సహాయం అందించే విషయంలో బాగా స్పందించారు.
► వెనువెంటనే అంబులెన్స్‌లు తరలించి, దాదాపు 348 మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఆ సమయంలో స్పృహలో లేని వారు సైతం ఆసుపత్రుల్లో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అందించిన చికిత్సతో వెంటిలేటర్‌ అవసరం లేకుండా శ్వాస తీసుకునేంతగా కోలుకున్నారు. ఇందుకు కృషి చేసిన వారందరికీ అభినందనలు. చదవండి: యుద్ధ ప్రాతిపదికన స్పందించాం

విషవాయువు బాధితులను ఆదుకోండి టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

విషవాయువు బాధితులను ఆదుకోండి
టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

అధికారులకు సాయపడాలని సూచన

సహాయ చర్యలపై కేంద్ర మంత్రి పీయూష్కు లేఖ



అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం హుటాహుటిన స్పందించారు. విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి దుర్ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖలోని టీడీపీ నేతలకు ఫోన్‌ చేసి బాధితులకు సహాయ చర్యలపై వారిని అప్రమత్తం చేశారు. దుర్ఘటన స్థలానికి వెంటనే వెళ్లి బాధితులను తరలించడంలో అధికారులకు సహాయపడాలని.. బాధితులను కలిసి ఊరడించాలని సూచించారు. స్ధానిక టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తెల్లవారుజామునే బాధిత ప్రాంతానికి వెళ్లి సహాయ చర్యల్లో నిమగ్నం కావడంతో చంద్రబాబు ఆయన్ను అభినందించారు. ఉదయమంతా ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండి పరిస్ధితిని పర్యవేక్షించారు. తర్వాత విశాఖ జిల్లా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.



సందర్శనకు అనుమతి కోసం కేంద్రానికి లేఖ

విశాఖ దుర్ఘటన అసాధారణమైంది కావడంతో ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల పరామర్శ కోసం అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన విశాఖ వెళ్లాలంటే ప్రత్యేక విమానంలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఆయన అద్దెకు తీసుకోదలచిన విమానం ముంబైలో ఉంది. ఆ విమానం హైదరాబాద్‌ వచ్చి.. అక్కడి నుంచి విశాఖ వెళ్లి.. తిరిగి హైదరాబాద్‌ మీదుగా ముంబై చేరుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీంతో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రాకు ఆయన లేఖ రాశారు.



కానీ గురువారం సాయంత్రం వరకూ దీనిపై కేంద్రం స్పందించలేదు. ప్రస్తుతం విశాఖలో సహాయ చర్యలు కొనసాగుతున్నందున శుక్రవారం లేదా శనివారం ఆయనకు అనుమతి ఇవ్వొచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, స్టైరిన్‌ ఘటనకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సూచనలతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ‘ఈ సంఘటనలో మరణాలు తక్కువగా ఉన్నా గ్యాస్‌ లీకేజితో అస్వస్ధతకు గురైన వారు రెండు వేల మంది వరకూ ఉన్నారు. గ్యాస్‌ లీకేజీ బాధితులకు వైద్య సేవలు అందించడానికి విశాఖలో ప్రత్యేక వైద్య నిపుణులు లేరు.



అందువల్ల జాతీయ స్థాయిలో నిపుణులను గుర్తించి.. అలాగే విదేశాల నుంచి కూడా కొందరిని సమకూర్చుకుని వైద్య బృందాన్ని విశాఖకు పంపాలని నా వినతి. కరోనా బాధితులకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ రావడానికి.. వ్యాధి నిరోధక శక్తి క్షీణించడానికి ఈ గ్యాస్‌ వల్ల ఆస్కారం ఏర్పడుతుంది. ప్రభుత్వం అందించే వైద్య సహాయం కరోనా వైరస్‌, స్టైరిన్‌ గ్యాస్‌ రెంటినీ దృష్టిలో ఉంచుకుని ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ను వెంటనే మూసివేసి సమగ్ర విచారణకు విచారణ కమిటీని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ పాలిమర్‌ యూనిట్‌ను జనావాసాలకు దూరంగా ఉన్న విశాఖ ప్రత్యేక ఆర్ధిక మండలికి తరలించాలని సూచించారు.

Wednesday, May 6, 2020

మద్యం మాటున మాయలు

మద్యం మాటున మాయలు
విక్రయాల్లో చేతివాటం..

ఖరీదైన బ్రాండ్లు పక్కదారి..

ADVERTISEMENT

Learn More
POWERED BY PLAYSTREAM


కొందరు సివిల్‌, ఎక్సైజ్‌ అధికారుల కొనుగోలు..

రెడ్‌జోన్లలోని వైన్‌షాపుల్లో మద్యం మాయం..

మొదటి రోజు రూ.3 కోట్ల వ్యాపారం..

కొన్ని షాపుల్లో బీర్లతోనే సరిపెట్టిన వైనం..

రెండోరోజూ తగ్గని క్యూ..


అనంతపురం(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో మద్యం అమ్మకాల మాటున మాయలు ఎన్నెన్నో. కొందరు సివిల్‌, ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది దర్పాన్ని ప్రదర్శించారు. మద్యం విక్రయాల్లో వారి చేతివాటం జోరుగా సాగింది. దీంతో ఖరీదైన బ్రాండ్లు పక్కదారి పట్టాయి. ఎవరికీ అనుమానం రాకుండా లెక్కల్లో మాత్రం వాటిని కొనుగోలు చేసినట్లు చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మందుబాబులు మాత్రం ఉన్న వాటితోనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వైన్‌ లేదనీ, బీర్లు మాత్రమే ఉన్నాయంటూ మందుబాబులకు కట్టబెట్టారు. రెడ్‌జోన్లలో మూసేసిన దుకాణాల్లోని మద్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే ముసుగులో మార్గమధ్యలోనే మాయం చేసి, వాటికి బిల్లులు సృష్టించినట్లు సమాచారం. ఈనెల 4న మద్యం షాపుల ముందు పెద్దఎత్తున మందుబాబులు బారులు తీరారు.



మద్యం విక్రయాలపై విపక్షాలు, మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మద్యం దుకాణాలు తెరవాలా.. వద్దా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. దానిని కొందరు సివిల్‌, ఎక్సైజ్‌ అధికారులు తమకు అనుకూలంగా మలచుకున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలు సాయంత్రం 7 గంటలకు బంద్‌ అవుతాయన్న నేపథ్యంలో అంతకుముందే వైన్‌షాపుల్లో పనిచేసే ఉద్యోగులు, సంబంధిత శాఖాధికారుల కుమ్మక్కుతో వారికి కావాల్సిన సరుకును కొనుగోలు చేసి, ఆన్‌లైన్‌లో లెక్కలు ఎక్కించేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.



సివిల్‌, ఎక్సైజ్‌ హవా

మద్యం అమ్మకాల్లో కొందరు పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల హవా కొనసాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలు క్వార్టర్‌ బాటిల్‌ కొనుగోలుకు గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. అయినా మద్యం దొరుకుతుందో.. లేదో తెలియదు. అధికారులు మాత్రం దర్జాగా మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్లమాడ సర్కిల్‌లో పనిచేసే ఓ ఎస్‌ఐ లాక్‌డౌన్‌ నేపథ్యంలో కదిరి పట్టణంలో విధులు నిర్వర్తిస్తూ.. తొలిరోజు దాదాపు రూ.50 వేల విలువ చేసే మద్యాన్ని కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, కూడేరులోనూ కొందరు ఎక్సైజ్‌ సిబ్బంది వైన్‌షాపుల్లో పనిచేసే ఉద్యోగులతో కుమ్మక్కై రూ.లక్ష విలువైన మద్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతపురం, హిందూపురం పట్టణాలు రెడ్‌జోన్‌ పరిధిలో ఉండటంతో ఆ దుకాణాల్లోని మద్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే ముసుగులో మధ్యలోనే కాస్ట్‌లీ బ్రాండ్లను 25 శాతం అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు ప్రచారం సాగుతోంది.



రెండో రోజూ అదే క్యూ

మద్యం కోసం మందుబాబులు ఎగబడ్డారు. పోలీసుల లాఠీలకూ బెదరలేదు. మొదటిరోజు దాదాపు రూ.3 కోట్ల వ్యాపారం సాగింది. రెండోరోజు మంగళవారం కూడా మందుబాబులు కిక్కు కోసం ఉదయం 11 గంటల నుంచే వైన్‌షాపుల వద్ద క్యూ కట్టారు. ఎండలోనే పడిగాపులు కాశారు. పెంచిన ధరతో మధ్యాహ్నం 3 గంటల నుంచి వైన్‌షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో రెడ్‌జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో 4 గంటలకు మద్యం దుకాణాలన్నీ తెరిచారు. కొన్నిప్రాంతాల్లో భౌతికదూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొన్నిచోట్ల మందుబాబులు లేక షాపులు వెలవెలబోయాయి. చిలమత్తూరు మండలంలో 5 గంటలైనా వైన్‌షాపు తెరవలేదు. పెంచిన ధరలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయలేదని అమ్మకాలు ఆపేశారు.

పెనుకొండలో 4 గంటల నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ కూపన్‌ సిస్టమ్‌ పెట్టడంతో  భౌతికదూరం అమలైంది. గోరంట్లలోని రెండు మద్యం షాపుల్లో స్టాకు లేక ఆ ప్రాంత ప్రజలు పాలసముద్రానికి పరుగులు తీశారు. కళ్యాణదుర్గం, మడకశిరలోనూ ఇదే పరిస్థితి. అనంతపురం రూరల్‌, కూడేరు, గార్లదిన్నెలలో వైన్‌షాపుల్లో స్టాకు తక్కువగా ఉండటం, బీర్లు మాత్రమే లభించటంతో జనం తక్కువగా కనిపించారు. బుక్కరాయసముద్రంలో మాత్రం మొదటిరోజు పరిస్థితే పునరావృతమైంది. ఇక్కడ మహిళలు వైన్‌షాపులు తెరవకూడదని నిరసన వ్యక్తం చేశారు. సివిల్‌, ఎక్సెజ్‌ పోలీసులు మద్యం విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. తాడిపత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెనుకొండలో మహిళలు సైతం మద్యం కొనుగోలు చేశారు.