చంపేస్తాం..! బుద్దా, రాయపాటిలకు బెదిరింపు ఫోన్లు
మొన్న మాచర్లలో దాడి.. నేడు ఇలా
ప్రభుత్వం నాపై కక్ష కట్టింది
మీడియాకు బుద్దా వెంకన్న లేఖ
నాకు కాల్స్, సోషల్ మీడియాలోనూ..
హెచ్చరిక పోస్టులు : రాయపాటి
విజయవాడ, గుంటూరు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): మా నాయకుని జోలికి వస్తారా?.. ప్రేలాపనలు చేస్తారా?.. చంపేస్తాం!... అంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. గురువారం ఈ విషయాన్ని వారు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. వివిధ ఫోన్ నంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గురువారం రాత్రి మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, విజయసాయిరెడ్డిని విమర్శిస్తున్నానని.. నీ అంతు చూస్తాం.. కేసులలో ఇరికిస్తామంటూ హెచ్చరించారు. మొన్న మాచర్లలో నాపై హత్యా ప్రయత్నం జరిగింది. మళ్లీ ఇలా ఫోన్‌లో బెదిరించడాన్ని చూస్తే ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అర్ధమవుతోంది. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి చెబుతున్నా... ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలను తట్టుకోలేని వారు వ్యక్తిగతమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ప్రజలకు మేలు చేయదలచినవారు సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తారు.
నిగ్రహం కోల్పోయి ప్రజల్లో అభాసుపాలు కావద్దు. మీరు చంద్రబాబును ఏమైనా అనొచ్చు కానీ మేము చేసే విమర్శలను తట్టుకోలేరా? మీరు చేసే బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’’ అని బుద్దా వెంకన్న తన లేఖలో పేర్కొన్నారు. ట్విటర్ వేదికగానూ బుద్దా స్పందించారు. ‘420 బ్యాచ్ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయుకి వెళ్లిపోయింది. వీళ్లపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. జైల్లో ఉండాల్సిన నిందితులు బయట ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో జగన్, విజయసాయిరెడ్డిలను చూస్తే అర్థమవుతుంది. కోర్టులు, న్యాయవాదులు, జడ్జిలపై దాడికి పాల్పడే విధంగా నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్మాదంగా వ్యవహరిస్తున్న 11 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్, ఏ2 విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలి’’ అని ట్వీట్ చేశారు.
గతం మర్చిపోయారా?!
మరోవైపు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కూడా బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. రాజధానికి మద్దతుగా జేఏసీ నేతలు ఇళ్లల్లో ఉండి చేస్తున్న దీక్షలకు రాయపాటి బుధవారం మద్దతు పలికారు. రాష్ట్రంలో సమర్ధులైన అధికారులను కులం పేరుతో పక్కకు నెట్టేయడం వల్లే రాష్ట్రంలో కరోనా వేగంగా పెరుగుతోందని, కరోనా లెక్కలతో పాటు కులం పేరుతో జగన్ పక్కనబెట్టి వారి లెక్కలు కూడా తీయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఓ సామాజికవర్గం తీవ్రంగా స్పందిస్తూ పలువురు ఆయనకు ఫోన్లు చేసి బెదిరించారు. ఇంకోసారి తమ నాయకుడిపై ప్రేలాపనలు చేస్తే చంపేస్తామంటూ హెచ్చరించినట్లు రాయపాటి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా మొద్దు శ్రీను, మద్దెల చెరువు సూరి వంటి వారి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి గతాన్ని మర్చిపోయారా అంటూ హెచ్చరించారు. అనేక రకాలుగా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రాయపాటి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

No comments:
Post a Comment