Tuesday, April 21, 2020

వీళ్లకు వైద్యం కావాలా? టెస్టులు కావాలా? రాజకీయం కావాలా?

కరోనా టెస్టు కిట్లకు ఒక ధర అంటూ ఏమీలేదు.
ప్రపంచ మార్కెట్‍ లో క్షణానికి ఒక రేటు వుంటోంది.
ఇది Sellers Market

ఛత్తీస్ గడ్ గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ మరో రాష్ట్రంగానీ  కరోనా టెస్టు కిట్లను సౌత్ కొరియా నుండో, చైనా నుండో కొనుగోలు చేయక తప్పదు

హైడ్రాక్సీ  క్లోరో క్విన్  మొదలు గ్లౌజులు, మాస్క్ లు, పిపిఇ ( Presonel Protection Equipment), వెంటిలేటర్స్ వరకు దొరకడమే కష్టంగా వుంది. 
ఇప్పుడు వాటిని సాధించడమే గొప్పగా వుంది.

ఏప్రిల్ 3న చైనా షాంఘై విమానాశ్రయం నుండి ఫ్రాన్స్ కు బయలు దేరడానికి సిధ్ధంగా వున్న విమానంలోని  కరోనా మెడికల్ కిట్లు అన్నింటినీ అమెరిక అక్కడి కక్కడే మూడు రెట్లు ఎక్కువ ధర  చెల్లించి ఆ విమానాన్ని హైజాక్ చేసి  తీసుకుపోయింది.
ఇదీ పరిస్థితి. 

ఇప్పుడా ధరల గురించి మాట్లాడేదీ?

వీళ్లకు వైద్యం కావాలా? టెస్టులు కావాలా? రాజకీయం కావాలా?

SD BIOSENSOR

కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో స్పందించలేదు. కరోనా వస్తున్నది అని కేంద్రం ముందుగానే చెప్పివుంటే రాష్ట్రప్రభుత్వాలు సహితం తగిన ఏర్పాట్లు చేసుకునివుండేవి.


కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరీ, చంద్రబాబు నాయుడుల దగ్గర కరోనా నివారణకు నిర్ధిష్ట సూచనలు లేవు. వాళ్లకు రాకజీయం< ముఖ్యం.

శవరాజకీయాలు లాగ ఇది జబ్బు రాజకీయాలు. 

Thursday, April 16, 2020

చంపేస్తాం..! బుద్దా, రాయపాటిలకు బెదిరింపు ఫోన్లు

చంపేస్తాం..! బుద్దా, రాయపాటిలకు బెదిరింపు ఫోన్లు 
మొన్న మాచర్లలో దాడి.. నేడు ఇలా
ప్రభుత్వం నాపై కక్ష కట్టింది
మీడియాకు బుద్దా వెంకన్న లేఖ
నాకు కాల్స్‌, సోషల్‌ మీడియాలోనూ.. 
హెచ్చరిక పోస్టులు : రాయపాటి

విజయవాడ, గుంటూరు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): మా నాయకుని జోలికి వస్తారా?.. ప్రేలాపనలు చేస్తారా?.. చంపేస్తాం!... అంటూ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. గురువారం ఈ విషయాన్ని వారు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. వివిధ ఫోన్‌ నంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గురువారం రాత్రి మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని, విజయసాయిరెడ్డిని విమర్శిస్తున్నానని.. నీ అంతు చూస్తాం.. కేసులలో ఇరికిస్తామంటూ హెచ్చరించారు. మొన్న మాచర్లలో నాపై హత్యా ప్రయత్నం జరిగింది. మళ్లీ ఇలా ఫోన్‌లో బెదిరించడాన్ని చూస్తే ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అర్ధమవుతోంది. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి చెబుతున్నా... ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలను తట్టుకోలేని వారు వ్యక్తిగతమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ప్రజలకు మేలు చేయదలచినవారు సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తారు.




నిగ్రహం కోల్పోయి ప్రజల్లో అభాసుపాలు కావద్దు. మీరు చంద్రబాబును ఏమైనా అనొచ్చు కానీ మేము చేసే విమర్శలను తట్టుకోలేరా? మీరు చేసే బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’’ అని బుద్దా వెంకన్న తన లేఖలో పేర్కొన్నారు. ట్విటర్‌ వేదికగానూ బుద్దా స్పందించారు. ‘420 బ్యాచ్‌ ఆఖరికి కోర్టులను, జడ్జిలను బెదిరించే స్థాయుకి వెళ్లిపోయింది. వీళ్లపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. జైల్లో ఉండాల్సిన నిందితులు బయట ఉంటే సమాజానికి ఎంత ప్రమాదమో జగన్‌, విజయసాయిరెడ్డిలను చూస్తే అర్థమవుతుంది. కోర్టులు, న్యాయవాదులు, జడ్జిలపై దాడికి పాల్పడే విధంగా నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్మాదంగా వ్యవహరిస్తున్న 11 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్‌, ఏ2 విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి’’ అని ట్వీట్‌ చేశారు.



గతం మర్చిపోయారా?!

మరోవైపు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కూడా బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. రాజధానికి మద్దతుగా జేఏసీ నేతలు ఇళ్లల్లో ఉండి చేస్తున్న దీక్షలకు రాయపాటి బుధవారం మద్దతు పలికారు. రాష్ట్రంలో సమర్ధులైన అధికారులను కులం పేరుతో పక్కకు నెట్టేయడం వల్లే రాష్ట్రంలో కరోనా వేగంగా పెరుగుతోందని, కరోనా లెక్కలతో పాటు కులం పేరుతో జగన్‌ పక్కనబెట్టి వారి లెక్కలు కూడా తీయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఓ సామాజికవర్గం తీవ్రంగా స్పందిస్తూ పలువురు ఆయనకు ఫోన్లు చేసి బెదిరించారు. ఇంకోసారి తమ నాయకుడిపై ప్రేలాపనలు చేస్తే చంపేస్తామంటూ హెచ్చరించినట్లు రాయపాటి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా మొద్దు శ్రీను, మద్దెల చెరువు సూరి వంటి వారి ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టి గతాన్ని మర్చిపోయారా అంటూ హెచ్చరించారు. అనేక రకాలుగా బూతులు తిడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. రాయపాటి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. 

‘ఆంగ్లమయం’ చెల్లదు! - జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌

‘ఆంగ్లమయం’ చెల్లదు! - జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌

81, 85 జీవోలు రద్దు

ప్రాథమిక దశలో మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనేలేదు. మాతృభాషలో బోధనతో భయాందోళనలు దూరం. పిల్లలు స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తీకరిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో చదవాలని నిర్బంధించడం భావ వ్యక్తీకరణ, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.

- హైకోర్టు ధర్మాసనం

ఇంగ్లీషు మీడియం జీవోలు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం
19(1)జీ అధికరణ ఉల్లంఘనే.. విద్యాహక్కు చట్టానికి కట్టుబడాల్సిందే
మాధ్యమం ఎంపిక విద్యార్థి హక్కు.. ఆ హక్కు తల్లిదండ్రులకూ ఉంది
రాష్ట్ర విద్యా చట్టం ప్రకారం మాతృభాషలోనే విద్యాబోధన
బిల్లును రాష్ట్రపతి ఆమోదించకముందే ఉత్తర్వులు సరికాదు: హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):  తెలుగు మీడియం ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనుకున్న జగన్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్లమాధ్యమం అమలు చేయాలన్న నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. తాము తీసుకొచ్చిన విద్యాహక్కు చట్ట నిబంధనలకు రాష్ట్రప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందేనని, కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న కేంద్రప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అన్ని విద్యాలయాల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టి, తెలుగు మాధ్యమంలో చదువుకోవాలని భావించే విద్యార్థుల కోసం మండలానికొక పాఠశాల ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏమాత్రం సంతృప్తి చెందలేదు.

ఆంగ్ల మాధ్యమం అమలుతో రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందంటూ కొంతమంది పిటిషనర్లు చేసిన వాదనను సైతం తోసిపుచ్చింది. ఇంగ్లీషు మీడియంలోనే విద్యాభ్యాసం చేయాలంటూ విద్యార్థుల్ని నిర్బంధించలేరని తేల్చి చెప్పింది. అలా చేయడమంటే విద్యాహక్కు చట్ట నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించడమేనని విస్పష్టంగా ప్రకటించింది. ప్రభుత్వం జారీచేసిన 81, 85 నంబరు జీవోలు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ జీవోలు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసేందుకు అనువుగా రాష్ట్రప్రభుత్వం గత నవంబరులో తీసుకొచ్చిన ఈ జీవోలను కొట్టివేసింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు బాలల హక్కుల్ని హరించేలా ఉన్నాయని.. వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ తూర్పు గోదావరి జిల్లా రావిపాడుకు చెందిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్‌ రాంభొట్ల, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఇరువైపుల వాదనలు ఆలకించి.. గత ఫిబ్రవరి 14వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. 92 పేజీల తీర్పును బుధవారం వెల్లడించింది.

మహనీయుల అభిప్రాయాలు..

మాతృభాషపై స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, బాలగంగాధర్‌ తిలక్‌, గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, నెల్సన్‌ మండేలా తదితరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ‘సమాచారం, ఆలోచనలు, జ్ఞాన మార్పిడికి మాతృభాష ఉత్తమ మాధ్యమం. మాతృభాషలో భావనను సులభంగా గ్రహించడంతో పాటు వ్యక్తీకరించవచ్చు. మాతృభాషలో బోధన.. జ్ఞానసముపార్జనకు సత్ఫలితాలను ఇస్తుంది. మాతృభాషలో పిల్లవాడు సులభంగా గ్రహించగలడు. మాతృభాషలో కాకుండా ఇతర భాషలో విద్యాబోధన పాపం. ఇది వారి మానసిక వికాసంపైనా ప్రభావం చూపుతుంది’ అంటూ ప్రఖ్యాత వ్యక్తులు చెప్పిన మాటలను ఽగుర్తు చేసింది. భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) ప్రకారం వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని.. ఆ మేరకు బోధనా మాధ్యమంగా మాతృభాష.. లేదా మరెందులోనైనా ఎంపిక చేసుకునే హక్కుందని పేర్కొంది. అదే విధంగా విద్యార్థికి ప్రాథమిక విద్యాభ్యాసంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కుందని తేల్చిచెప్పింది. అంతేగాక వృత్తిని, వ్యాపారాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగం కల్పిస్తోందని, అయితే ప్రభుత్వ జీవోలతో అన్ని పాఠశాలల యాజమాన్యాలు మాధ్యమాన్ని ఆంగ్లంలోకి మార్చాలనడం అధికరణ 19(1)జీని ఉల్లంఘించడమేనని పేర్కొంది. విద్యా సంస్థల ఏర్పాటు హక్కు, దానిని నిర్వహించుకునే హక్కును భాష, మతం పేరుతో తీసేయడానికి ఏమాత్రం వీల్లేదని పేర్కొంది. సిలబస్‌, మాధ్యమాన్ని నిర్ణయించే అధికారం ఏపీ విద్యా చట్టం-1982 ప్రకారం ఎన్‌సీఈఆర్‌టీకే ఉంటుందని తెలిపింది. అందులోని సెక్షన్‌ 7 (3) (4) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా విద్యను మాతృభాషలోనే అందించాల్సిందేనని పేర్కొంది. ప్రాథమిక దశలో పాఠశాల బోధనా మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ‘ఏపీ విద్యాహక్కు చట్ట నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.

ఒకటి నుంచి 6వ తరగతి వరకు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని మార్చడానికి జీవో జారీ చేసింది. అయితే జీవో జారీ చేశాక 2019 డిసెంబరు 16వ తేదీన 1982 చట్టానికి సవరణ ప్రతిపాదించారు. ఆ సవరణకు రాష్ట్రపతి నుంచి ఇప్పటి వరకూ ఆమోదం రాలేదు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపకముందే జీవో జారీ చేయడం సరికాదు. అందువల్ల ఆ సవరణ.. చట్టంలో భాగం కాదు. ఏదైనా నిబంధన సవరణకు సంబంధించి రాష్ట్రపతి అనుమతి వచ్చే వరకు మునుపటి చట్టమే అమలులో ఉంటుంది. ఆ మేరకు విద్యాహక్కు చట్టం ప్రకారం బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలి’ అని తెలిపింది.

రాష్ట్రాలు కట్టుబడాల్సిందే..

‘కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్ట నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందే. విద్యాహక్కు చట్టంలో కనీసం 8వ తరగతి వరకైనా మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని ఉంది. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించి ఆంగ్ల మాధ్యమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టడం విద్యాహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడమే. సిలబస్‌, మాధ్యమ బోధన గురించి నిర్ణయించాల్సింది అకడమిక్‌ అథారిటీ. ఆ అథారిటీతో సంబంధం లేని పాఠశాల విద్యా కమిషనర్‌ ప్రతిపాదన ఆధారంగా ఆంగ్ల మాధ్యమం ఎలా అమలు చేస్తారు? జాతీయ విద్యావిధానం, విద్యాహక్కు నిబంధనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వ జీవోల చట్టబద్ధతను తేల్చాల్సి ఉంది. తెలుగు అధికారభాషగా ఉన్న రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేకుండా చేయడం సరి కాదు’ అన్న కేంద్రప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ‘1982 చట్ట నిబంధనలు మార్చడానికి వీల్లేదని, ఆ ఆధికారం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకే వారు ఆ చట్టంలోని సెక్షన్‌ 7 (3)(4), సెక్షన్‌ 99లకు సవరణ ప్రతిపాదించారు. అన్నీ తెలిసే ఉద్దేశపూర్వకంగా తెలుగు మాధ్యమాన్ని ఆంగ్లంలోకి మారుస్తూ 2019 నవంబరు 20వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందువల్ల తెలుగు నుంచి ఆంగ్లమాధ్యమానికి మార్పును.. చట్టప్రకారం గుర్తించడం కుదరదు. క్లాజ్‌ 3 మేరకు తమ పిల్లల విద్యా విధానాన్ని ఎన్నుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది. పిల్లలకు మాతృభాషలో బోధన.. భయం, ఆందోళన లేకుండా చేస్తుంది. వారు స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించగలరు.



ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సిందేనని నిర్బంధించడం.. మాట్లాడే స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం తీసివేయలేదు’ అని స్పష్టం చేసింది. పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల అభ్యర్థనల మేరకే ఆంగ్లమాధ్యమాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోందని, అయితే తల్లిదండ్రుల సంఘం తీర్మానంపైనో, తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకో ఆధారపడి బోధనా మాధ్యమం మార్పు ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్‌బాబు, అనూప్‌ కౌశిక్‌,  వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కృష్ణమోహన్‌ వాదనలు వినిపించారు.



ప్రభుత్వం ఏం చెప్పిందంటే?..

‘నిబంధనల మేరకే ఆంగ్లమాధ్యమంపై జీవోలు జారీ చేశాం. అయినా, మాతృభాషకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మైనారిటీ భాషలైన తమిళం, కన్నడం, ఉర్దూ, ఒరియాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లింగ్విస్టిక్‌ మైనారిటీ పాఠశాలల్లో ఆయా మాధ్యమాలు యథాతథంగా కొనసాగుతాయి. తెలుగు మాధ్యమంలో చదువుకోవాలని భావించే విద్యార్థులకోసం కనీసం మండలానికొక పాఠశాల ఏర్పాటు చేస్తాం. సదరు పాఠశాల సమీపంలో లేనట్లయితే విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్లివచ్చేందుకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం. ప్రాథమిక దశలో బోధనా మాధ్యమం మాతృభాషలోనే తప్పనిసరిగా ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోందన్న పిటిషనర్‌ వాదన వాస్తవ విరుద్ధం. ఆచరణ సాధ్యం మేరకు మాతృభాషలో అని మాత్రమే పేర్కొన్నారు. పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీల నుంచి సుమారు 48 వేల తీర్మానాలు రాగా.. అందులో 97 శాతం ఆంగ్లమాధ్యమం కావాలని అభ్యర్థనలు ఉన్నాయి. రాష్ట్ర విద్యాచట్టంలో సవరణ చేస్తూ బిల్లు పంపించాం. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు.

Wednesday, April 15, 2020

’ఆంగ్ల మాధ్యమం’పై ఆద్యంతం సర్కారు తీరు

ఎవరేమన్నా డోన్ట్‌కేర్‌!
నా మాటే వేదం.. కాదంటే ఎదురుదాడే!
’ఆంగ్ల మాధ్యమం’పై ఆద్యంతం సర్కారు తీరు

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో నా మాటే వేదం.. మరో మాటకు తావులేదు.. అది సర్వోన్నత న్యాయస్థానం తీర్పయినా.. విద్యా హక్కు చట్టం తాలూకు సిపారసు అయినా.. డోన్ట్‌ కేర్‌! కాదంటే ఎదురు దాడేనన్నట్లుగా ముఖ్యమంత్రి వై.ఎ్‌స.జగన్‌ ప్రభుత్వ ధోరణి ఉందని.. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్కారుకు చెంపపెట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక విద్య బోధన మాతృభాషలోనే జరగాలి. 8వ తరగతి వరకు పిల్లలకు స్థానిక మాతృభాషలోనే బోధించాలని జాతీయ నూతన విద్యా విధానం కూడా చెబుతోంది. 1968, 1986 సంవత్సరాల్లో రూపొందించిన విధానాల్లోనూ ఇదే విషయం చెప్పారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమం.. అంటే రెండూ ఉండాలని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయల ఎమ్మెల్సీలు సూచించారు.



ADVERTISEMENT

Learn More
POWERED BY PLAYSTREAM


ఇప్పటి వరకు తెలుగులో చదివిన విద్యార్థులను ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మారిస్తే విద్యా ప్రమాణాలు పడిపోతాయని, పేద పిల్లలు బడి మానేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, శాస్త్ర వేత్తలు సైతం మాధ్యమాన్ని పిల్లలే ఎంచుకునే  అవకాశం ఉండాలని సూచించారు. కానీ ఇవేమీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సరి కదా .. ఎదురు దాడే చేసింది. మీ పిల్లలు ఏ మీడియంలో చదివారంటూ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఇలా అందరిపైనా స్వయంగా జగన్‌ ఎదురుదాడి చేయడం గమనార్హం. అసెంబ్లీలోనూ ఇదే వైఖరి. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ చదువులు అవసరం లేదా అని కూడా ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమానికి టీడీపీ వ్యతిరేకమని కూడా ఆరోపించారు. బిల్లు పెట్టి శాసనసభలో ఆమోదించుకున్నారు.



శాసనమండలిలో చుక్కెదురైనా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాతృ భాషాభిమానులు, సంస్థలు నిరసనలు తెలిపినా.. వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి కనీసం వారితో చర్చలు కూడా నిర్వహించలేదు. పైగా ఆంగ్ల మాధ్యమమే కావాలంటూ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలతో బలవంతంగా తీర్మానాలు చేయించి ప్రభుత్వానికి పంపించేలా చేశారు. ఆయా తీర్మానాలను జిల్లాల వారీగా పెట్టెల్లో జమ చేసి హైకోర్టుకు చూపించారు. ఒకేసారి అన్ని పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ఎలా ప్రవేశ పెడతారంటూ హైకోర్టు ప్రశ్నించడంతో.. ప్రతి మండలంలోనూ ఒక పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.



కోట్ల రూపాయల వ్యయం

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఉత్తర్వులు .. తమ ఆదేశాలకు లోబడి ఉంటాయని 2019 డిసెంబరు 20న హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంగ్ల మాధ్యమం అమల్లో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ, ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యపుస్తకాల ముద్రణ తదితర చర్యలకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేగాక ఆ సొమ్మును వారి నుంచే రాబడతామని కూడా తేల్చిచెప్పింది. ప్రభుత్వం వద్ద డబ్బులేని పరిస్థితిలో సొమ్ము వృధా చేయడమెందుకని కూడా నిలదీసింది. ఈ విషయమై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌లకు నోటీసులు జారీచేసింది.

ప్రాథమికంగా చూస్తే ప్రభుత్వ ఉత్తర్వులు విద్యా హక్కు చట్టానికి , సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. విచారణ పూర్తి కాకుండానే ఎస్‌సీఈఆర్‌టీ కేంద్రంగా 1-6 తరగతుల పాఠ్యపుస్తకాలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే రూపకల్పన చేశారు. ముద్రణకు అంతా సిద్ధం చేశారు.ఇందుకోసం రూ.లక్షల్లో ఖర్చు చేశారు. కోర్టు సూచనల్ని బేఖాతర్‌ చేశారు.  ఉపాధ్యాయులకు శిక్షణ వద్దని చెప్పినా పట్టించుకోలేదు. అయితే టీచర్లకు శిక్షణ పేరును ‘లెర్నింగ్‌ ఎన్‌హేన్సింగ్‌ ప్రోగ్రామ్‌’ అని మార్చారు. ప్రతి జిల్లాకు 20-25 మందికి, ప్రతి మండలానికి నలుగురు ఉపాధ్యాయులకు తొలుత ఆంగ్ల మాధ్యమంలో మూడు బ్యాచ్‌ల వారీగా చేసి శిక్షణ ఇచ్చారు. మాడ్యూల్స్‌, వర్క్‌ షీట్‌లను తయారుచేసి అందజేశారు. సుమారు 80 వేల మంది టీచర్లకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. శిక్షణ ఇచ్చిన వారికి, శిక్షణ తీసుకున్న వారికి కలిపి దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

Tuesday, April 7, 2020

25 lakh poor in A.P. to get house sites on April 14 under

25 lakh poor in A.P. to get house sites on April 14 under Navaratnalu-Pedalandariki Illu programme
V. RaghavendraVIJAYAWADA, APRIL 01, 2020 11:24 IST
UPDATED: APRIL 01, 2020 12:04 IST
SHARE ARTICLE 1PRINTA A A
Y.S. Jagan Mohan Reddy
Y.S. Jagan Mohan Reddy  

Tying up with HUDCO and others for loans; necessary approvals under PMAY
The government has issued modified guidelines for the distribution of 25 lakh house sites to the poor in urban and rural areas under Navaratnalu - Pedalandariki Illu (houses for all the poor) programme as per the directions of the High Court, on Tuesday.

It is in the process of tying up with HUDCO and other organisations for securing loans apart from getting necessary approvals under Pradhan Mantri Awas Yojana (PMAY).

Just at ₹1
According to G.O. MS No.99 issued by Principal Secretary (Revenue) V. Usharani, the house sites will be allotted at a concessional rate of ₹1 to the beneficiaries with white ration cards. A sum of ₹ 20 (₹10 towards the cost of stamp paper, and ₹10 for lamination charges) will be collected from them.


The beneficiaries have to use the sites for no purpose other than constructing houses and the title deeds will be in the form of conveyance deeds containing security features like photographs, thumb impressions, signatures of parties along with their details in addition to watermarks and emblems etc. on the stamp papers.


Site sale barred, 5-year lock in
Sale of vacant house sites is prohibited but the beneficiaries after construction of houses and occupying them for minimum five years can transfer in case of any necessity subject to conditions imposed by banks and financial institutions which extended credit for constructing the houses.

As per the original schedule, the government was to distribute the house sites on Ugadi (March 25) but it was postponed due to the local body elections and the outbreak of COVID-19. April 14 is the revised date for giving away the sites.

Wednesday, April 1, 2020

అందుకే ఢిల్లీ వెళ్లా : అంజాద్‌ బాషా

అందుకే ఢిల్లీ వెళ్లా : అంజాద్‌ బాషా
Apr 01, 2020, 12:35 IST
Amjad Basha Fires On Yellow Media - Sakshi
సాక్షి, అమరావతి : గత నెల మార్చి 2న ముస్లింలకు సంబంధించిన 4 శాతం రిజర్వేషన్ల కేసు విషయమై తాను ఢిల్లీ వెళ్లానని, మార్చి 5 నుంచి 26 వరకు కడపలోనే ఉన్నానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. తాను మర్కజ్ జమాత్లో జరిగిన ఇస్తమాకు వెళ్లినట్లు ఎల్లోమీడియా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకు తెరలేపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తెలుసుకోకుండా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని, తనపై దుష్ప్రచారం చేసిన ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

ఢిల్లీ సభలకు వెళ్లలేదని నిరూపిస్తే ఛానల్‌ను మూసేస్తారా? అని సవాల్‌ విసిరారు. తప్పుడు ప్రచారం చేసిన ఎల్లోమీడియాపై.. వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి ఫిర్యాదు చేశానని చెప్పారు. కాగా, గత నెలలో ఢిల్లీలోని నిజామొద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన ప్రార్థనలు కరోనా వైరస్‌ వ్యాధి సోకడానికి కారణమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంనుంచి ఈ ప్రార్థనలకు దాదాపు 700పైగా మంది హాజరయ్యారు. సామాజిక దూరం పాటించకపోవటమే వైరస్‌ వ్యాప్తికి కారణమని తెలుస్తోంది.

‘ఇంకా 85 మంది ఆచూకీ తెలియాలి’
Mar 31, 2020, 19:09 IST
711 Persons From AP Attended At Nizamuddin Dargah's Prayers, Amjad Basha - Sakshi
సాక్షి, వైఎస్సార్‌ జిల్లా:  ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్ లో ఇస్తమా జరగ్గా, ఏపీ నుంచి 711 మంది ఆ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా రెండు వేల మంది ప్రార్థనల్లో పాల్గొనగా, ఏపీ నుంచి ఏడు వందలకు పైగా అక్కడకు వెళ్లారన్నారు. ఆ ప్రార్థనల్లో సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే అక్కడికి వెళ్లిన వారికి కరోనా వైరస్‌ సోకిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అనేక మంది ప్రార్థనల్లో పాల్గొన్నారన్నారు. దాదాపు అందరికీ రక్త పరీక్షలు జరిపి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచామన్నారు. కాగా, వీరిలో ఇంకా 85 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. (‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’)

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రార్థనకు వెళ్లిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, వారు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే అధికారులు నేరుగా వచ్చి పరీక్షలు చేస్తారన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ప్రజలందరి ఆరోగ్యం కోసం మీరంతా బయటకు రావాలన్నారు. దేవుడి దయవల్ల కరోనా వైరస్‌ వల్ల మన రాష్ట్రంలో ఎవరూ మరణించలేదని,  జిల్లా వ్యాప్తంగా 138 మంది శ్యాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపగా, 65 మందికి నెగిటివ్‌ రావడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరులో ఏడుగురు స్వచ్ఛందంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చారన్నారు. తెలంగాణా లో 77 మంది పాజిటివ్ కేసులు నమోదు కాగా 6 మంది మరణించిన విషయాన్ని అంజాద్‌ బాషా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా ద్వారా సమాచారం ఢిల్లీ వెళ్లిన వారికి అందేలా చూడాలన్నారు. (సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్‌)

25 lakh poor in A.P. to get house sites on April 14 under

25 lakh poor in A.P. to get house sites on April 14 under Navaratnalu-Pedalandariki Illu programme
V. RaghavendraVIJAYAWADA, APRIL 01, 2020 11:24 IST
UPDATED: APRIL 01, 2020 12:04 IST
SHARE ARTICLE 1PRINTA A A
Y.S. Jagan Mohan Reddy
Y.S. Jagan Mohan Reddy  

Tying up with HUDCO and others for loans; necessary approvals under PMAY
The government has issued modified guidelines for the distribution of 25 lakh house sites to the poor in urban and rural areas under Navaratnalu - Pedalandariki Illu (houses for all the poor) programme as per the directions of the High Court, on Tuesday.

It is in the process of tying up with HUDCO and other organisations for securing loans apart from getting necessary approvals under Pradhan Mantri Awas Yojana (PMAY).

Just at ₹1
According to G.O. MS No.99 issued by Principal Secretary (Revenue) V. Usharani, the house sites will be allotted at a concessional rate of ₹1 to the beneficiaries with white ration cards. A sum of ₹ 20 (₹10 towards the cost of stamp paper, and ₹10 for lamination charges) will be collected from them.


The beneficiaries have to use the sites for no purpose other than constructing houses and the title deeds will be in the form of conveyance deeds containing security features like photographs, thumb impressions, signatures of parties along with their details in addition to watermarks and emblems etc. on the stamp papers.


Site sale barred, 5-year lock in
Sale of vacant house sites is prohibited but the beneficiaries after construction of houses and occupying them for minimum five years can transfer in case of any necessity subject to conditions imposed by banks and financial institutions which extended credit for constructing the houses.

As per the original schedule, the government was to distribute the house sites on Ugadi (March 25) but it was postponed due to the local body elections and the outbreak of COVID-19. April 14 is the revised date for giving away the sites.