ఖబడ్దార్.. దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తే సహించం
7/10/2019 4:37:31 AM
పొలిటికల్ టెర్రరిజం మంచిది కాదు
ధర్మవరం ఎమ్మెల్యే అరాచకాలు మితిమీరాయి
ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుంది
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ధర్మవరం, జూలై 9 : రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నుంచి ఎటువంటి ఆపద ఎదురైనా వారిని కాపాడుకునే బాధ్యత నాదేనని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మంగళవారం వైసీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన కుటుంబాలకు భరోసా కల్పించి ఆర్థిక సాయం అందించడంలో భాగంగా చంద్రబాబు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించగా, గాయపడిన మరో ఆరుగురికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబీకుల పిల్లలను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా చదివిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మవరం పట్టణానికి చేరుకుని మృతి చెందిన చేనేత కార్మికుడు చంద్రశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసి, వారి పిల్లలను కూడా చదివిస్తానని హామీ ఇచ్చారు. కాగా ధర్మవరంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాల్సి ఉంది. భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు, చేనేత కార్మికులు తరలిరావడంతో కల్యాణమండపం పట్టలేదు. దీంతో బహిరంగ సభగా మార్చాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు మితిమీరిపోతున్నాయన్నారు. ప్రజలను చంపే అధికారం ఎవరికీ లేదన్నారు. వైసీపీ నాయకుల దాడుల్లో నష్టపోయిన తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనదేనన్నారు. ధర్మవరం ఎమ్మెల్యేతో పాటు కొందరు వైసీపీ నాయకులకు ఖబడ్దార్, జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దాడులు మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. 2009లో ఇక్కడ ఒకాయనను నియోజకవర్గ ఇన్‌చార్జిగా చేసి 2014లో మీరందరూ ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే... ఇప్పుడు నాకే నీతులు చెప్పి మిమ్మల్ని నట్టేట ముం చి వెళ్లిపోయారన్నారు. ఎవరు వెళ్లినా ఎన్టీఆర్ పెట్టిన పార్టీ శాశ్వతమన్నారు. ధర్మవరంలో కార్యకర్తల నాడి చూడాలని మీటింగ్ పెడితే బహిరంగ సభగా మార్చాల్సి వచ్చిందన్నారు. ఇంత రాత్రి పూట కూడా వేలాదిగా తరలివచ్చి తనకు మద్దతు పలకడం మరచిపోలేనిదన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృ ష్టిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో దారి పొడవునా వందలాది మంది ఆశీర్వదిస్తూ మా ఓట్లు మీకే వేశాం.. అవి ఎక్కడికెళ్లా యో అడగడానికి వచ్చామని ప్రజలు పేర్కొంటున్నారన్నారు.
ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం
ధర్మవరంలో ప్రతిపక్షమే లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. ఆక్రమణలు ఏవైనా ఉంటే మొదట మీవారి ఆక్రమణలు తొలగించిన తర్వాత మా వారివి తొలగిస్తే ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారన్నారు. అలా కాకుండా ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకుని వారిని బలహీనపరచడం కోసం ధర్మవరం వైసీపీ నాయకులు సొంత స్థలంలో ఉన్న నిర్మాణాలు సైతం తొలగించడం మంచిది కాదన్నారు. ధర్మవరానికి చెందిన దేవరకొండ రామకృష్ణ, నాగరాజు, మరికొందరు గృహాలను కూల్చివేయడంతో పాటు చీనీ చెట్లను నరికి వేయడాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఉమామహేశ్వరరావు, పరిటాల శ్రీరామ్, మాజీ మేయర్ స్వరూప, సబిత, చిగిచెర్ల ఓబిరెడ్డి, కమతం కాటమయ్య, గరుగు వెంగప్ప, సనత్, అత్తార్ రహీంబాషా, మాజీ జడ్పీటీసీలు విశాలాక్షి, మేకల రామాంజనేయులు ఉన్నారు.

No comments:
Post a Comment