Thursday, June 20, 2019

నడ్డా సమక్షంలో బీజేపీలోకి నలుగురు టీడీపీ ఎంపీల చేరిక..

నడ్డా సమక్షంలో బీజేపీలోకి నలుగురు టీడీపీ ఎంపీల చేరిక..
20-06-2019 18:29:15

న్యూఢిల్లీ : టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం సాయంత్రం ఈ నలుగురు సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ అందజేశారు. అనంతరం బీజేపీ వర్కంగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈ నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమలం కండువాలు కప్పిన నడ్డా.. ఆ నలుగురు ఎంపీలను సాదరంగా ఆహ్వానించారు.

విలీనం చేయండి..! 
ఈ సందర్భంగా.. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యను కలిసిన రాజ్యసభ సభ్యులు కలిసి టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని వినతి చేశారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి, జేపీ నడ్డా పాల్గొన్నారు. టీడీపీపీని బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. 10వ షెడ్యూల్‌లోని నాలుగో పేరా ప్రకారం విలీనం చేయాలని లేఖ అందజేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంతో ప్రేరణ పొందామని.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పార్టీని విలీనం చేస్తున్నామని రాజీనామా చేసిన ఎంపీలు మీడియాకు వివరించారు. ఇక నుంచి మమ్మల్ని బీజేపీ ఎంపీలుగా గుర్తించాలని వెంకయ్యను వారు కోరారు.

స్వాగతిస్తున్నాం..
ఈ క్రమంలో బీజేపీ కీలకనేత భూపేంద్రయాదవ్‌ మాట్లాడుతూ.. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల చీలికవర్గం బీజేపీలో విలీనం చేశామన్నారు. బీజేపీకి మద్దతు తెలుపుతూ తీర్మానం లేఖలు ఇచ్చారన్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి, టీజీ వెంకటేశ్‌ను బీజేపీలోకి స్వాగతిస్తున్నామన్నారు.

ఈ నలుగురు రాకతో...
నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వం నచ్చి, అమిత్‌షా పిలుపునకు స్పందించి సుజనా, సీఎం రమేష్‌, టీజీ, గరికపాటి బీజేపీలో చేరారన్నారు. పాజిటివ్‌ రాజకీయాలపైనే బీజేపీకి విశ్వాసం ఉందన్నారు. సబ్ కా సాత్‌, సబ్‌కా వికాస్‌ మా లక్ష్యమని జేపీ నడ్డా తెలిపారు. ఏపీలో బీజేపీ ఈ నలుగురి రాకతో బలోపేతమైందని.. ఏపీలో బీజేపీ పునాదులు పటిష్ఠమవుతాయని నడ్డా పేర్కొన్నారు.

బీజేపీ గూటికి ఏపీ టీడీపీ ఎంపీలు?

బీజేపీ గూటికి ఏపీ టీడీపీ ఎంపీలు?
Jun 20, 2019, 03:53 IST
 TDP MPs Have Been In Touch With BJP Supremo Says Sources - Sakshi
పార్టీని వీడేందుకు ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సిద్ధం

అదే దారిలో లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని కూడా..

రాం మాధవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలతో సంప్రదింపులు పూర్తి

రాజ్యసభలో బలం పెంచుకునే వ్యూహంతో సరేనన్న కమలనాథులు

నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ

హస్తిన కేంద్రంగా మారుతున్న రాజకీయ సమీకరణలు

సాక్షి, ఢిల్లీ / అమరావతి: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ మెజార్టీ రాజ్యసభ సభ్యులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వారితో జట్టు కట్టనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీడీపీ ఎంపీలు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో టచ్‌లో ఉన్నారు. పార్టీని వీడి వీరంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో మట్టి కరిచిన టీడీపీపై చంద్రబాబు దాదాపుగా పట్టుకోల్పోయినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనే నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు  సమాచారం. ఢిల్లీ కేంద్రంగా ఇందుకు సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈమేరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ త్వరలో చీలిపోనుందని తెలుస్తోంది. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు  కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో చర్చలు జరుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వారితో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి ఒక్క రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని మూకుమ్మడిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దారి చూపించిన ఎంపీ కేశినేని
టీడీపీలో చీలికకు విజయవాడ ఎంపీ కేశినేని నాని దారి చూపించారని తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చెందిన వెంటనే కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అప్పటికే ఆయన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుపై విమర్శల జోరు పెంచారు. తద్వారా పార్టీలోని మెజార్టీ నేతల అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులపై ఆయన సూటిగా చేసిన విమర్శలు సరైనవేనని టీడీపీ శ్రేణులు సైతం అభిప్రాయపడ్డాయి. ఎంపీ కేశినేని నాని విమర్శలను టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. అంటే పక్కా ప్రణాళికతోనే టీడీపీ మెజార్టీ ఎంపీలు చంద్రబాబుపై తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారని తెలుస్తోంది. ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులతోపాటు కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.


మనదారి మనం చూసుకుందాం..
ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీలో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ ఎంపీలు కుండబద్ధలు కొడుతున్నారు. విచ్చలవిడి అవినీతి, ఒంటెత్తు పోకడలతో ఐదేళ్లు నిరంకుశంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను చెప్పాలని తామెంత ప్రయత్నించినప్పటికీ ఆయన వినిపించుకోలేదని ఎంపీలు అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కేవలం తన కుమారుడు లోకేశ్‌ను భావి నేతగా తీర్చిదిద్దాలన్న స్వార్థంతో పార్టీ పుట్టి ముంచారని ధ్వజమెత్తుతున్నారు. తిరుగులేని మాస్‌ లీడర్‌గా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే వ్యూహలే లేకుండా పోయాయని పేర్కొంటున్నారు.

ఇక కోలుకోవడం అసాధ్యమే
వైఎస్‌ జగన్‌ అంతటి ప్రజాదరణ ఉన్న నేత టీడీపీలో లేనందున కనీసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుందామన్నా చంద్రబాబు వినిపించుకోలేదని ఎంపీలు విమర్శిస్తున్నారు. బీజేపీతో తెగదెంపులు, పవన్‌ కల్యాణ్‌తో లోపాయికారీ పొత్తు రాజకీయంగా టీడీపీని దెబ్బతీశాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇక కోలుకోవడం అసాధ్యమని ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. చంద్రబాబుకు వయోభారం, లోకేశ్‌ అసమర్థత టీడీపీకి ప్రతికూల అంశాలని విశ్లేషిస్తున్నారు. టీడీపీలో ఇంకా కొనసాగడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమని మెజార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నందున ఆ పార్టీలో చేరడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో చేరిక అంశంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు ఒకరిని ‘సాక్షి’ సంప్రదించగా ఆయన స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం.

రాజ్యసభ ఎంపీలతో పాటే కేశినేని నాని కూడా..?
20-06-2019 15:30:56

https://www.andhrajyothy.com/artical?SID=824520

న్యూఢిల్లీ: చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా టీడీపీలో నెలకొన్న రెండు పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరడానికి మార్గం సుగమం చేసుకోగా... వారి బాటలోనే మాజీ ఎమ్మెల్యేలు కూడా క్యూ కట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కాకినాడలో టీడీపీ కాపు నేతలంతా సమావేశమై బీజేపీలో చేరే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కనకమేడల, సీతామహాలక్ష్మీని కూడా బీజేపీలోకి చేర్చేందుకు సుజనా, సీఎం రమేష్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎంపీలతో పాటు లోక్‌సభ ఎంపీలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని ఆయన కలిసొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే నాని కమలం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బుధవారమే కుటుంబ సభ్యులతో చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు.


టీడీపీలో భారీ సంక్షోభం!
Jun 20, 2019, 14:25 IST
 Four TDP MPs Ready to Join BJP - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనేది వెల్లడి కాలేదు. (చదవండి: నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ)


Monday, June 17, 2019

Highlights from YSR Congress manifesto finds mention in AP Governor address

Highlights from YSR Congress manifesto finds mention in AP Governor addressG.V.R. Subba Rao VIJAYAWADA,  JUNE 14, 2019 13:35 IST
UPDATED: JUNE 14, 2019 13:51 IST
SHARE ARTICLE  0 PRINT A A A

 Andhra Pradesh Governor E.S.L. Narasimhan addresses a joint session of State Legislature in Amaravati on Friday.
Andhra Pradesh Governor E.S.L. Narasimhan addresses a joint session of State Legislature in Amaravati on Friday.   | Photo Credit: Special Arrangement

The government would ensure that assurances and promises made during bifurcation of the State were implemented in letter and spirit, said Governor E.S.L. Narasimhan addressing a joint session of Andhra Pradesh Legislature on Friday. The Governor in his address ,reflecting the YSR Congress election manifesto and Navaratnalu ( nine-point document), has asserted that the government has begun a journey towards good governance and corruption free administration.

The Governor touched upon various key issues, including Polavaram project. But, strikingly, there was no mention of Capital city Amaravati. Polavaram, life line of Andhra Pradesh, and other projects would be completed in a definite time frame. A third party enquiry by irrigation and technical experts was also envisaged to set right deficiencies and irregularities if any, the Governor said, adding “my government, should it find it necessary, will not hesitate to go for reverse tendering after due diligence.”

The government has plans to set up a permanent BC Commission with statutory powers. The government also provide 50% reservations in all political appointments like directors, chairmen, trust board etc..,he said.


Referring to State finances, the Governor said, the misutilisation of resources both human and physical further compounded the State's misery. “My government has inherited a near empty treasury calling for a stricter accountable and efficient spending of the public money and all attendant resources. My government, however, is confident that it can overcome the problems and ensure a satisfying public service delivery to the citizens of the state,” he added.

గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్ 14 June 2019

గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్..

https://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/gavarnar+prasangam+hailaits-newsid-119770180

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు గురించి తన ప్రసంగంలో వివరించారు. 15 పేజీలలో గవర్నర్ ప్రసంగం ఉండగా.. గత పది రోజులుగా ప్రకటించిన పథకాల తోపాటు.. భవిష్యత్తులో అమలు చేయబోయే ప్రణాళికలను వివరించారు గవర్నర్.

గవర్నర్‌ ప్రసంగంలో హైలైట్స్:

* నవరత్నాల అమలే ప్రాధాన్యం

* ఆరోగ్యశ్రీలో ఇప్పుడున్న 1095 వ్యాధులకు అదనంగా మరో 936 వ్యాధులకు చికిత్స

* వెయ్యి రూపాయల కంటే ఎక్కువ వ్యయం అయ్యే వ్యాధులకు ఆరోగ్యశ్రీ

* ప్రభుత్వం సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. నూతన విధానాలు ప్రవేశపెట్టి సుపరిపాలన.

* విభజనచట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి.

* అవినీతి రహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం.

* పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు.

* ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం.

* ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌.

* రైతు కోసం రైతు కమిషన్.

* ఏపీ విభజన సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా.

* ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతాంశాలు.

* ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగింపు.

* జుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ప్రయత్నాలు.

* గ్రామ సేవలకు రూ. 5వేల వేతనం.

* నవరత్నాల పేరుతో సంక్షేమ అజెండా.

* దశల వారీ మద్య నిషేధం.

* వైఎస్సార్ రైతు భరోసా ద్వారా చేయూత.

* వివిధ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు నాలుగేళల్లో ఏడాదికి రూ. 18, 750లు ఆర్ధిక సాయం.

* కాపు సంక్షేమం కోసం ఐదేళ్లల్లో రూ. 10 వేల కోట్లు.

* ఐదేళ్లల్లో 25 లక్షల గృహాలు.

* ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి వైయస్సార్ రైతు భరోసా.. రూ. ఒక్కో రైతుకు రూ.12,500.

* పథకాలు అమలులో సంతృప్త మార్గం.

* కుల, మత, రాజకీయ సంబంధం లేకుండా అర్హులైన అందరికీ పథకాలు.

* ఫిర్యాదు చేసిన 72 గంటల్లో సమస్యల పరిష్కారం, సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్.

Friday, June 7, 2019

కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు
Jun 07, 2019, 11:00 IST
 AP Cabinet Expanded with Induction Of 25 Ministers, says YS Jagan - Sakshi
https://www.sakshi.com/news/politics/ap-cabinet-expanded-induction-25-ministers-says-ys-jagan-1195910

25 మందితో పూర్తి స్థాయి కేబినెట్‌ ఏర్పాటు: వైఎస్‌ జగన్‌
అవివీతికి తావులేని పాలన అందిద్దాం ..

సాక్షి, తాడేపల్లి: మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మొత‍్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది. మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలి. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి అడిగా. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి.  ప్రతి కాంట్రాక్ట్‌ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుంది. ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది. జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయి. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేడతాం. రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలి. నామినేషన్‌ పద్థతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తాం.’ అని తెలిపారు.

Tuesday, June 4, 2019

పది రోజుల్లోనే ఇన్ని దాడులా?

పది రోజుల్లోనే ఇన్ని దాడులా?
05-06-2019 03:28:57

టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు బాధాకరం
రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రభుత్వ నిర్ణయాలపై కొంత కాలం వేచి చూద్దాం
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ
ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన
అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తమ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో మంగళవారం మధ్యాహ్నం పార్టీ నేతలు సమావేశమై వర్తమాన రాజకీయ అంశాలు, ఎన్నికల తర్వాతి పరిణామాలపై చర్చించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫలితాలు వెలువడ్డాక పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. గత 37 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక ఎన్నికలను చూసింది. ఒకసారి మేం గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలిచింది. కానీ ఎప్పుడూ ఎన్నికలు కాగానే ఇలా దాడులు, దౌర్జన్యాలు జరగలేదు. గత పది రోజుల్లోనే అనేక చోట్ల ఇవి జరగడం బాధాకరం. శిలా ఫలకాలు ధ్వంసం చేయడం, జెండా దిమ్మలు, స్వాగత ద్వారాలు పగలగొట్టడం సరైంది కాదు. తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని టీడీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడ ఎలాంటి దాడులు, దౌర్జన్యాలు జరిగినా వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తెలపాలని శ్రేణులకు సూచించింది. అన్ని విధాలా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపింది. పార్టీ కార్యకర్తలు కూడా సంయమనంతో వ్యవహరించాలని, రెచ్చగొట్టాలని చూసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సంస్థాగతంగా బలోపేతం చేసి పార్టీకి కొత్త రూపు ఇవ్వడంపై సమావేశంలో చర్చించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యవర్గాల ఏర్పాటుపై కొంత చర్చ జరిగింది.

అప్పుడే తొందరొద్దు..
మంత్రివర్గం ఏర్పాటై ప్రభుత్వ నిర్ణయాలు అధికారికంగా వెల్లడైన తర్వాత ఆయా అంశాలపై అవసరమైన పక్షంలో స్పందించాలని, ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని టీడీపీ సమావేశం నిశ్చయించింది. ఎన్నికల ఫలితాలపై కొంత ఆత్మ పరిశీలన జరిగింది. ‘పట్టిసీమ ప్రాజెక్టు అవసరం కాదేమోనని నేనూ అపోహ పడ్డాను. కానీ దానివల్లే కృష్ణా డెల్టాలో పన్నెండు లక్షల ఎకరాలకు ఇప్పుడు సాగునీరు అందుతోంది. అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చాం. ఇలా మంచి ఫలితం చూపించిన చోట కూడా మనం ఓడిపోయాం. దీనికి కారణమేంటో అన్ని స్థాయుల్లో సమీక్షించుకోవడం అవసరం’ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజలకు మొక్కాలని, రాజధాని జిల్లాలతో పోలిస్తే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నా ఆ జిల్లాలో నాలుగు సీట్లు గెలిపించారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. సోషల్‌ ఇంజనీరింగ్‌లో కొంత విఫలమైనట్లు అనిపిస్తోందని, సంప్రదాయకంగా టీడీపీకి వెన్నెముకగా నిలిచే బీసీలు, దళితుల్లో మాదిగలు ఈసారి కొంత దూరం అయ్యారని.. ఆ లోపం సవరించుకోవాలని నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్‌ అన్నారు. ‘కొత్త ప్రభుత్వం వచ్చీ రాగానే అనేక అంశాల్లో టీడీపీ పాలనపై వ్యతిరేక ప్రచారం నడుపుతోంది. మనపై అనుమాన బీజాలు నాటే ప్రయత్నం జరుగుతోంది.

ఆయా అంశాలపై మనం ఎప్పటికప్పుడు స్పందించి వాస్తవాలు చెప్పకపోతే అవే నిజమని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలనే ఆలోచన మంచిదే. కానీ మనపై జరుగుతున్న చెడు ప్రచారాన్ని అడ్డుకోవడం రాజకీయంగా మన విధి’ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అవసరమైనప్పుడు స్పందిద్దామని, ఇప్పుడే అంత తొందర అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

షెడ్యూల్‌ సంస్థల విభజన సంగతేంటి?
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ జరిగిన నిర్ణయంపై కొంత చర్చ జరిగింది. రాజ్యాంగంలోని 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, వాటి ఆస్తుల విభజన రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉండిపోవడం వల్ల వాటితో పాటు కలిపి భవనాల అప్పగింతపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నామని అప్పట్లో మంత్రులుగా ఉన్నవారు వివరించారు. ఇప్పుడు కేవలం ఆంధ్ర భవనాల అప్పగింతపై మాత్రమే నిర్ణయం జరిగిందని వార్తలు వస్తున్నాయని, ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలని నిర్ణయించారు.

రేపు విదేశాలకు చంద్రబాబు
కుటుంబంతో కలిసి చంద్రబాబు గురువారం విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. గురువారం రాత్రి అక్కడి నుంచి బయల్దేరతారు. ఈ నెల 13న తిరిగి వస్తారు.