ముఖ్యమంత్రికి అధికారాల్లేవా?
27-04-2019 02:41:59
వివరణ ఇవ్వండి!
మీ భాష అభ్యంతరకరం
నిజంగానే అలా మాట్లాడారా!
సీఎస్‌కు ముఖ్యమంత్రి లేఖ
ఆంగ్ల పత్రిక క్లిప్పింగ్ జత
అమరావతి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ‘అధికారాలు లేని ముఖ్యమంత్రి’ అంటూ ఈసీ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. ఒక ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన ఆ వార్తా కథనాన్ని కూడా తన లేఖకు జత చేశారు. ‘‘ఒక ముఖ్యమంత్రి పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకంగా ఉంది. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించినట్లుగా ఉంది. మీరు హుందా, గౌరవాన్ని పాటించలేదు. ఈ వార్తలో ప్రచురితమైనట్లుగా ఉన్న వ్యాఖ్యలు మీరు చేశారా! దీనిపై మీ వివరణ ఏమిటి?’’ అని ఎల్వీ సుబ్రమణ్యంను ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో ప్రశ్నించారు. సీఎస్ వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని, చాలా తీవ్రమైనవని కొందరు సీనియర్ మంత్రులు, అధికారులు అభిప్రాయపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి వద్ద కూడా కొంత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్వీ వివరణ కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాశారు.
‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి నియమిస్తారు. తన విధులు, బాధ్యతల నిర్వహణలో ప్రధాన కార్యదర్శి సంబంధిత అంశాలను సీఎంకు నివేదిస్తారు. ప్రభుత్వ అధిపతి ముఖ్యమంత్రి. ఆయనకు అధికారాలు ఉన్నాయో లేవో వ్యాఖ్యానించే అధికారం ప్రధాన కార్యదర్శికి లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎంకు ఏ మేరకు అధికారాలుంటాయో భాష్యం చెప్పే పని సీఎ్‌సది కాదు. ఆ విషయంలో ఏదైనా సందిగ్ధత ఉంటే ఎన్నికల కమిషన్ తన వివరణ ఇస్తుంది తప్ప సీఎస్ కాదు’’ అని సీఎం వద్ద జరిగిన చర్చలో అభిప్రాయపడ్డారు. ఎల్వీ తన పరిధిని అతిక్రమించారన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో నేరుగా ఆయనకు దీనిపై లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రధాన కార్యదర్శిని సంజాయిషీ కోరుతున్నట్లు కాకుండా వివరణ కోరుతున్నట్లుగా రాసినట్లు సమాచారం.
‘‘ముఖ్యమంత్రికి అధికారాలు లేవని మీరు చెప్పినట్లుగా ఒక పత్రికలో వచ్చిన మీ ఇంటర్వ్యూ చూశాను. మీ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు కొన్ని నియమ నిబంధనలు, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం పనిచేస్తాయి. ఎన్నికల కోడ్ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశమంతా అమల్లో ఉంది. అన్ని చోట్లా ఒకటే కోడ్ అమల్లో ఉంటుంది తప్ప రాష్ట్రానికో రకంగా ఉండదు. మరే రాష్ట్రంలోనూ అధికారులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక్కడ మీరిలా ఎందుకు మాట్లాడారో వివరణ ఇవ్వండి’’ అని ఆ లేఖలో సీఎం కోరినట్లు చెబుతున్నారు.
రద్దు చేసినప్పుడూ సాఫీగానే...
గతంలో అసెంబ్లీని రద్దు చేసినప్పుడు కూడా తమకు ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని, ఇప్పుడే చూస్తున్నామని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘2003లో మేం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. పలు కారణాలతో వెంటనే ఎన్నికలు రాలేదు. ఆరు నెలలపాటు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం మామూలుగానే పనిచేసింది.
కొత్తగా విధాన నిర్ణయాలు తీసుకోకుండా రోజువారీ బాధ్యతలు నిర్వర్తించింది. ఇప్పుడు అసెంబ్లీ రద్దు కాలేదు. ప్రభుత్వానికి గడువూ ముగియలేదు. అయినా ముఖ్యమంత్రికి ఏ అధికారాలూ లేవన్న రీతిలో కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈ నెల రోజులూ అధికారం అనుభవించాలన్న కోరికేమీ మాకు లేదు. కానీ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఈ వేసవి కీలకమైన సమయం. వాటిని పరిగెత్తించకపోతే వర్షాకాలంలో పనులు చేయలేం. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించి వెంటపడితేనే ఆ పనులు వేగంగా జరుగుతాయి. దానికి అడ్డుపడుతున్నారనే మా బాధ’ అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.
సీఎస్‌తో ఘర్షణ వద్దు..
వాస్తవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఘర్షణ వైఖరికి వెళ్లవద్దని కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులు, మంత్రులకు సూచించారు. రెండు మూడు అంశాలపై సీఎం సమీక్షలు జరిపినప్పుడు వాటికి వెళ్లవద్దని అధికారులకు సీఎస్ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. అనవసరంగా మధ్యలో అధికారులు నలిగిపోతున్నారన్న అభిప్రాయంతో సీఎం కూడా సమీక్షలు విరమించారు. చేసి తీరతానని పట్టుదలకు వెళ్లలేదు. ఈసీ వైఖరిని తప్పుబట్టారు తప్ప సీఎస్ విషయంలో ఏ వ్యాఖ్యా చేయకుండా సంయమనం పాటించారు. ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సుబ్రమణ్యం ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. దానిపైనా ముఖ్యమంత్రి స్పందించలేదు. కానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రికి అధికారాలు లేవని సీఎస్ వ్యాఖ్యానించడం వేడి పుట్టించింది. ఆయన వివరణ కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాయడానికి అదే కారణమైంది.

No comments:
Post a Comment