ఎల్వీఎస్ నిందితుడే!
27-04-2019 02:34:01
ఆయనపై కేసు కొట్టివేత చెల్లదు
ఎమ్మార్ కుట్రలో ఆయన భాగస్వామి
లీజు, మినహాయింపులు, భూమి ధరలో
ప్రభుత్వానికి నష్టం చేసేలా నిర్ణయాలు
విస్పష్ట డాక్యుమెంట్ ఆధారాలున్నాయి
విచారణకు కేంద్రం అనుమతీ ఉంది
ఆ తర్వాతే క్వాష్ పిటిషన్ వేశారు
ఆయనకు విముక్తి కల్పించడం చెల్లదు
హైకోర్టు ఆదేశాలపై వెంటనే స్టే ఇవ్వాలి
సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నుంచి ఎల్వీని తప్పిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపి వేయాలని కోరింది. ఈ కుట్రలో ఎల్వీ సుబ్రమణ్యం భాగస్వామి అని నిరూపించేందుకు స్పష్టమైన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలున్నాయని తెలిపింది. ఆయన చర్యలతో ఏపీఐఐసీపై తీవ్ర ఆర్థికభారం పడిందని సీబీఐ పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం-1998 కింద ఆయనను విచారించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని, ఎమ్మార్ కుట్రలో ఆయన పాత్రను నిరూపించే స్పష్టమైన ఆధారాలను కోర్టులో సమర్పించిన తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని వివరించింది. ఈ కేసు నుంచి ఎల్వీని తప్పించడం న్యాయ విరుద్ధమని సీబీఐ తెలిపింది.
ఏమిటీ ఈ కేసు
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నప్పుడు... 2003 సెప్టెంబరు నుంచి 2005 మే దాకా ఎల్వీ సుబ్రమణ్యం పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కంపెనీతోపాటు మరి కొన్ని సంస్థలతో కలిసి ఏపీఐఐసీ దీన్ని చేపట్టేలా విధివిధానాలు రూపొందించారు. ఇదో భారీ హౌసింగ్ ప్రాజెక్టు. ప్లాట్లు, విల్లాలు, గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం వంటివి ఎన్నో ఇందులో భాగం. దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు అవసరమైన ప్రైవేటు భూమి సేకరణ ధర ఖరారు నుంచి ఒప్పందాలు, లీజు ఫీజుల నిర్ణయం, వాటాల ఖరారు, ఇతర నిబంధనల అమల్లో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపింది.
ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులో ఏపీఐఐసీని దగా చేశారని... ప్రైవేటు భాగస్వాములకు కోట్లరూపాయలు లాభం వచ్చేలా వ్యవహరించారని, ఇదంతా రహస్య నేరపూరిత కుట్ర మేరకు జరిగిందని సీబీఐ నిర్ధారించింది. 2011 ఆగస్టు 10న సీబీఐ కేసు నమోదు చేసిది.. ఇందులో ఎల్వీని 11వ నిందితుడిగా (ఏ-11) చేర్చింది. 2011 ఫిబ్రవరి ఒకటి నుంచి వరసగా చార్జిషీట్లు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం-1988 కింద ఎల్వీని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. అయితే, ఎల్వీ 2017లో హైకోర్టును ఆశ్రయించారు. తనపై సీఐబీ నమోదు చేసిన కేసునుంచి విముక్తి కల్పించాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గత ఏడాది జనవరి 4న ఎల్వీకి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ ప్రస్తావించిన అంశాలు...
1) ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎల్వీ సుబ్రమణ్యం ఉండగా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ముందుకొచ్చింది. దీని అమలుకు సంబంధించిన విధివిధానాలు, ఒప్పందాలు ఎలా ఉండాలో ఏపీఐఐసీయే సూచించింది. దీనిని సర్కారు ఆమోదించింది. ఎమ్మార్‌తోపాటు, మరో రెండు ప్రైవేటు కంపెనీలతో ఏపీఐఐసీ జతకలిసి దీన్ని చేపట్టేలా రూపొందించారు. ఇందుకోసం భూమిని సేకరించాల్సి వచ్చింది. ఎకరాకు రూ.29 లక్షల నంచి రూ.40 లక్షల మేర ధర ఉండాలని ఏపీఐఐసీ మేనేజర్ సిఫారసు చేశారు. అయితే, దీన్ని ఎల్వీ పట్టించుకోలేదు. ఎమ్మార్ ప్రాపర్టీ్‌సకు అనుకూలంగా, ముందుగా ఖరారు చేసిన ధర అంటే ఎకరాకు రూ.29 లక్షలు ఉండాలన్న దానికి కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపించారు. దీని వల్ల ప్రభుత్వం వైపు నుంచి భరించే వ్యయం పెరగడంతోపాటు, ప్రాజెక్టు ధర విపరీతంగా పెరిగిపోయింది. అలాగే, ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కూడా తగ్గింది. వాస్తవానికి, ఏపీఐఐసీకి చెందిన ధరల నిర్ణాయక కమిటీ ఎకరా భూమికి రూ.35 లక్షలు ఉండాలని ముందుగానే నిర్ణయించింది. దీన్ని అధికారులు కూడా ఆ తర్వాత అంగీకరించారు. కాబట్టి, ఇది నేరపూరిత కుట్రలో భాగమే అవుతుంది.
2) లీజు అద్దెల విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా ముందుకుసాగారు. 235 ఎకరాలను గోల్ఫ్‌కోర్సు ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. వార్షిక స్థూల ఆదాయంపై మొదటి 33 సంవత్సరాలకు రెండు శాతం, ఆ తర్వాత 33 సంవత్సరాలకు 3 శాతం లీజు అద్దె వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి విరుద్దంగా, మొత్తంగానే 2 శాతం లీజు అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ఏపీఐఐసీకి న్యాయబద్ధంగా రావాల్సిన లీజు అద్దె తగ్గిపోయింది.
3) ఇజ్జత్‌నగర్‌లోని 15 ఎకరాల లీజు భూమిలో కన్వెన్షన్ సెంటర్, బిజినెస్ హోటల్ నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ భూమికి కూడా 33 సంవత్సరాల అనంతరం లీజు అద్దె ఫీజును 2 నుంచి 3 శాతానికి పెంచాలని సిఫారసు చేయలేదు. ఇది నేరపూరిత కుట్రకు సహకరించడమే అవుతుంది.
4) 2005లో జారీ చేసిన జీఓ 14 ద్వారా ఈ ప్రాజెక్టు భూమికి.. భూ వినియోగ మార్పిడి ఫీజు (కన్వర్షన్ ఫీజు)ను మినహాయించారని నివేదించారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తామని మాత్రమే చెప్పింది. మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకోలేదు.
5) ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకోసం నానక్‌రామ్‌గూడ లో సేకరించాల్సిన భూమిలోనే 11.26 ఎకరాలను తప్పించారు. ఇందుకు ఎల్వీ సహకరించారు. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్లాట్లు, విల్లాల విక్రయం, ఒప్పందాల అమలులో నిబంధనల ఉల్లంఘన జరిగింది.
సుప్రీంకు సీబీఐ...
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నుంచి ఎల్వీని తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ తర్వాత సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ‘‘ఏ కారణాలతో ఎల్వీని ఈ కేసు నుంచి తప్పించారు? ఎమ్మార్ కుట్రలో ఎల్వీ పాత్రను నిర్ధారించే డాక్యుమెంటరీ, ఇతర ఆధారాలను కేసును విచారిస్తున్న కోర్టుకు నివేదించాం. ఇంకా, అవినీతి నిరోధక చట్టం కింద విచారించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నాం. ఈ కేసు కోర్టు పరిశీలనలో ఉంది. ఇంతలో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆయనకు కేసు నుంచి విముక్తి కల్పించింది. ఇది న్యాయ విరుద్ధం. ఆయన పాత్రను నిరూపించే స్పష్టమైన ఆధారాలు కోర్టు పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి, ఈ కేసు నుంచి ఆయనకు విముక్తి కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలి’’ అని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. కుట్రలో ఎల్వీ పాత్రను నిర్ధారించే ఫోరెన్సిక్ ఆధారాలున్నాయని పేర్కొంది.

No comments:
Post a Comment