Thursday, March 5, 2020

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం - జేసీ దివాకర్‌రెడ్డి

స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం
Mar 05, 2020, 05:34 IST
JC Diwakar Reddy Comments On Local Body Elections - Sakshi
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

విశాఖలో చంద్రబాబును చావగొట్టనందుకు సంతోషం

తాడిపత్రి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హ్యాట్సాఫ్‌ అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే తాము పోటీలో ఉంటామన్నారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే గెలిచిన తర్వాత అభ్యర్థి మద్యం, డబ్బులు పంచారని అక్రమంగా కేసులు పెట్టి ఉన్న పదవి ఊడగొట్టి రెండేళ్లు జైలుకు పంపే కొత్త చట్టాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చారన్నారు. అందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఇలాంటి కొత్త చట్టాల ద్వారా డబ్బులు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని, తమకు డబ్బులు మిగిల్చినందుకు సీఎంకు కృతజ్ఞతలన్నారు. విశాఖపట్నంలో చంద్రబాబును అడ్డుకోవడంపై స్పందిస్తూ తమ నాయకుడిని అక్కడ చావగొట్టనందుకు సంతోషిస్తున్నామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం’

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం’
Mar 05, 2020, 19:33 IST
Ready To Conduct Local Body Polls AP Election Commissioner Ramesh Says - Sakshi
సాక్షి, విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో ‘ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ప్రక్రియ’పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్దతిలో పారదర్శకంగా జరుపుతామన్నారు. ఎన్నికలు జరపడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామని తెలిపారు.


(చదవండి : 21.. 24.. 27న స్థానిక ఎన్నికలు?)

ఎన్నికల విషయంపై శుక్రవారం జిల్లా అధికారుల, ఎస్పీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమవుతామని తెలిపారు. పార్టీల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో లక్షా ఇరవై వేల బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, మరో 40 వేల బాక్సులు తెలంగాణ నుంచి తీసుకుంటామని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని  ఎన్నికల కమిషనర్ రమేష్‌ పేర్కొన్నారు.

21.. 24.. 27న స్థానిక ఎన్నికలు?
Mar 05, 2020, 04:11 IST
CM YS Jaganmohan Reddy Comments About Panchayat Elections In Cabinet Meeting - Sakshi
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తర్వాత మున్సిపల్, చివర పంచాయతీ ఎన్నికలు

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించనున్న రాష్ట్ర ప్రభుత్వం

90 శాతం హామీలు నెరవేర్చామని అతివిశ్వాసంతో ఉండొద్దు: మంత్రివర్గ

సమావేశంలో మంత్రులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 24న మున్సిపల్, 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సూచించనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సూత్రప్రాయంగా వెల్లడించినట్లు తెలిసింది. అయితే పోలింగ్‌ తేదీలపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుందని అభిప్రాయపడినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సన్నద్ధతపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు.


ఈ విషయమై మంత్రులతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే 90 శాతం హామీలను నెరవేర్చామని అతి విశ్వాసంతో ఉండొద్దు. ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చాం.  ఇదివరకెన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం, మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేశాం. ఇన్ని పనులు చేశామని ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దు. కచ్చితంగా సింహ భాగం గెలవాలి. డబ్బు, మద్యం ఎక్కడా కనిపించకుండా ఎన్నికలు నిర్వహించాలని మరోసారి చెబుతున్నా. డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు నిర్ధారణ అయితే, ఎన్నికైన తర్వాత కూడా ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు ఖాయం’ అని స్పష్టం చేసినట్లు తెలిసింది.

1.5 కోట్లకు పైగా కుటుంబాలకు నగదు బదిలీ
స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలుంటాయనే సంకేతాలను ముఖ్యమంత్రి ఇచ్చినట్లు తెలిసింది. అధికారం చేపట్టి ఏడాది కూడా కాకుండానే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సింహ భాగం అమలు చేశామని, ప్రతి కుటుంబానికి ఎన్నికల హామీలను చేరవేశామని, అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తున్నామని పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో కోటిన్నరకు పైగా కుటుంబాలకు నగదు బదిలీ చేశామని వివరించినట్లు తెలిసింది. వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా 47 లక్షల రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చామని, అమ్మఒడి పథకం ద్వారా 42 లక్షల మందికి పైగా తల్లుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేశామని, జగనన్న వసతి దీవెన కింద 11.87 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు బదిలీ చేశామని, సంతృప్త స్థాయిలో అర్హులైన వారందరికీ పెన్షన్లు, బియ్యం కార్డులు మంజూరు చేశామని వివరించినట్లు సమాచారం. వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ వాలాలకు.. మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే ఆర్థిక సాయం అందించామని, అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏకంగా 95 శాతం పైగా కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా ఆరోగ్య భరోసా కల్పించామని, దీంతో పాటు దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఉగాది నాటికి అర్హులైన 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నామని, వాటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తున్నామని సీఎం గుర్తు చేసినట్లు తెలిసింది.

2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రావాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే పని తీరుకు నిదర్శనమని,  2019 సాధారణ ఎన్నికల కంటే కూడా మెరుగైన ఫలితాలు రావాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

అభివృద్ధి పథకాల గురించి ఇంటింటా వివరించాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత సిబ్బంది నియామకంతో పాటు గ్రామ, వార్డు వలంటీర్లతో కలిపి మొత్తం 4 లక్షలకుపైగా ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చామని సీఎం జగన్‌ గుర్తు చేసినట్లు తెలిసింది. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించాలని.. ఇందుకు అనుగుణంగా మంత్రులు కార్యాచరణతో ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఈ నెల 8లోగా మండల ఇన్‌చార్జిల నియామకాలు ముగించి, స్థానిక సంస్థల ఎన్నికలకు మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నద్ధం కావాలని సీఎం సూచించినట్లు తెలిసింది. పార్టీలో  ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరించుకోవడమే కాకుండా అందరినీ కలుపుకుని వెళ్లాలని స్పష్టం చేసినట్లు సమాచారం. 

ఓటమి భయంతో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు

కరోనా కంటే ‘నారా వైరస్‌’  భయంకరం
Mar 05, 2020, 18:23 IST
Nara virus more dangerous than Corona, says Vijaya Sai Reddy - Sakshi
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్‌తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు. మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా పడుతోంది’ అని ట్వీట్‌ చేశారు. (వణికి చచ్చేట్టున్నారు!: విజయసాయి రెడ్డి)


అలాగే ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తామసలు ఎన్నికల్లోనే పోటీ చేయమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నాడు. ఇది చంద్రబాబు చెప్పించిందే. కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి. ఏమాట ఎవరితో అనిపించాలనే స్కెచ్ వేయడంలో బాబును మించినోళ్లేవరూ లేరు’  అని మండిపడ్డారు. (చంద్రబాబుది మామూలు ‘గుండె’ కాదు)



‘రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసినా, ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికలు నిర్వహించలేదు. ఫలితంగా రూ.5 వేల కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడింది. రిజర్వేషన్లపై కోర్టుకెళ్లి బీసీలకు ద్రోహం చేయడమే కాక నిధుల రాకను కూడా అడ్డుకుంటున్నారని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.( ‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’)

ఏపీలో 5 వేల అంగన్‌వాడీ పోస్టులు ఖాళీ

ఏపీలో 5 వేల అంగన్‌వాడీ పోస్టులు ఖాళీ
Mar 05, 2020, 17:01 IST
Smriti Irani Answer To Vijaya Sai Reddy Question On Anganwadi Centers - Sakshi
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో 5 వేల అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2019 డిసెంబర్‌ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 1665 అంగన్‌వాడీ వర్కర్లు, 3347 అంగన్‌వాడి హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ  ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల ఖాళీలను జిల్లా కలెక్టర్లు భర్తీ చేయడానికి వీలుగా తగిన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్లు మంత్రి చెప్పారు. (జేసీ ట్రావెల్స్‌ రిజిస్టేషన్ల రద్దుకు చర్యలు)


కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్‌ 1 నుంచి అంగన్‌వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని నెలకు 3 వేల నుంచి 4 వేల రూపాయలకు, హెల్పర్ల గౌరవ వేతనాన్ని నెలకు 1500 నుంచి 2250 రూపాయలకు పెంచిందిని మంత్రి తెలిపారు. అలాగే పనితీరు ప్రాతిపదికన హెల్పర్లకు ప్రోత్సాహకం కింద నెలకు 250 రూపాయలు చెల్లించడం జరుగుతోందన్నారు.  ఐసీడీఎస్‌-సీఏఎస్‌ వినియోగించే అంగన్‌వాడీ వర్కర్లకు పోషణ్‌ అభియాన్‌ ప్రోత్సాహకం కింద నెలకు 500 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనానికి అదనంగా అనేక రాష్ట్రాలు తమ సొంత వనరుల నుంచి అంగన్‌వాడీలకు అదనంగా ప్రోత్సాహక నగదును చెల్లిస్తున్నాయన్నారు ఇవి కాకుండా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. (అధిక బరువుతో బాధపడుతున్నారా..)

అదే విధంగా 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ  సెలవులు, పనితీరును గుర్తిస్తూ వారికి ప్రేరణ కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం స్థాయిలో రూ.50 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం, రాష్ట్ర స్థాయిలో 10 వేల నగదు అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే అంగన్‌వాడీలకు ఏడాదికి 400 రూపాయల విలువైన చీర కలిగిన రెండు యూనిఫారాలు, 18-50 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వర్కర్లు, హెల్పర్లకు ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన పథకం కింద జీవిత బీమా, 51 నుంచి 59 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. తీవ్ర అనారోగ్య బారిన పడినట్లుగా గుర్తించిన అంగన్‌వాడీలకు 20 వేల రూపాయల వరకు చికిత్స ఖర్చులు, 9 నుంచి 12వ తరగతి చుదువుతున్న అంగన్‌వాడీల సంతానానికి స్కాలర్‌షిప్‌లు, సూపర్‌వైజర్ల నియామకంలో వారికి 50 శాతం రిజర్వేషన్‌ వంటి పలు సౌకర్యాలను అంగన్‌వాడీలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి వివరించారు.(‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’)

రాష్ట్ర రాజధానిని మార్చడం కుదరదు

రాష్ట్ర రాజధానిని మార్చడం కుదరదు
నిర్ణయాధికారం ఉందని రాజధానిని మార్చేస్తారా?

అమరావతి రైతులకు అన్యాయం జరగనివ్వం

రాజధానికి భూములివ్వడమే వారి తప్పా?.. రాజ్యాంగం, కోర్టులే కాపాడతాయి

జగన్‌ సర్కారుకు వైరస్‌ సోకింది: సుజనా... అమరావతిపై 2పుస్తకాల ఆవిష్కరణ

న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. అలాగని ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చడం కుదరదంటే కుదరదు’ అని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని కేంద్రం చెప్పిందంటే దానర్థం ఇప్పటికే స్థాపించిన అమరావతిని మార్చుకోవచ్చని కాదన్నారు.



అమరావతి కోసం రైతులు చేస్తున్న న్యాయపోరాటంపై సూర్యనారాయణ మాస్టారు ‘‘అమరావతి ఆక్రందన‘ శీర్షికతో రచించిన తెలుగు పుస్తకాన్ని, ‘స్టాప్‌ ది అన్‌డూయింగ్‌ ఆఫ్‌ అమరావతి‘ అనే శీర్షికతో రచించిన పుస్తకాన్ని సుజనా తన అధికార నివాసంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ప్రజలు అత్యధిక మెజారిటీతో అధికారమిచ్చారని రాజధానిని తమ రాజకీయ స్వార్థం కోసం మార్చేస్తారా? అలాగైతే బ్రిటి్‌షవారిపై పోరాడి సాధించుకున్న భారతదేశాన్ని.. ఇప్పుడు తమకు అత్యధిక మెజారిటీ ఉందని కేంద్రం బ్రిటి్‌షవారికి మళ్లీ అప్పగించేస్తుందా’ అని ప్రశ్నించారు.



జగన్‌ ప్రభుత్వానికి వైరస్‌ సోకిందని.. అందుకే అక్కడ వింతపాలన సాగుతోందని ఎద్దేవాచేశారు. ‘అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టి కక్ష సాధింపులతోనే గడుపుతోంది. 9నెలల్లో తట్ట మట్టి తీయలేదు. ఒక్క ఇటుక పెట్టలేదు. ఒక్క పరిశ్రమా రాలేదు. సమీక్షతో పెట్టుబడిదారులంతా వెయ్యి కిలోమీటర్ల వేగంతో పరుగు పెడుతున్నారు. ఏపీ అంటేనే పెట్టుబడులు రావడంలేదు’ అని నిప్పులు చెరిగారు.



భూముల దుర్వినియోగం..

‘రైతులు అమరావతి కోసం ఇచ్చిన భూములను దుర్వినియోగం చేసే హక్కు ప్రభుత్వానికి లేదని సుజనా స్పష్టంచేశారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగదని సుజనా బదులిచ్చారు. ‘రాజ్యాంగం ఉంది. కోర్టులు ఉన్నాయి. వారికి కచ్చితంగా న్యాయమే జరుగుతుంది. కేంద్రం తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తుంది’ అని చెప్పారు.



ఎల్లయ్యో పుల్లయ్యో చెబితే స్పందించం

అమరావతికి బీజేపీ కట్టుబడి ఉన్నదని ఆ పార్టీ రాష్ట్రశాఖ తీర్మానించిందని, మరోపక్క బీజేపీ జాతీయ స్థాయి నేతలు కొందరు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపట్ల రైతుల్లో అనుమానాలు చెలరేగుతున్నాయని ప్రస్తావించగా.. కొందరు నేతల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దనవసరంలేద ని సుజనా అన్నారు. ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో చెప్పేవాటికి స్పందించనక్కర్లేదని చెప్పారు. అమరావతి విషయంలో బీజేపీ తొలి నుంచీ ఒకే వైఖరితో ఉందని.. కచ్చితంగా కాపాడుకుని తీరతామని స్పష్టం చేశారు.



ప్రాంతాల మధ్య చిచ్చు..

వైసీపీని 151 సీట్ల అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే.. రాష్ర్ట్ర ప్రయోజనాలు, ప్రజల బాగోగులు, అభివృద్ధిని పక్కనపెట్టి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు రేపడం ఎంతవరకు సమంజసమని సుజనా ప్రశ్నించారు. ‘అమరావతి రాజధానిని కొనసాగించాలంటూ ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేస్తున్న మహిళలను సైతం బూటుకాళ్లతో పోలీసులు తన్ని, దాడులు చేస్తున్నారు. భయభ్రాంతులను చేస్తున్నారు. రాజధాని కోసం రైతులు వేల ఎకరాల భూమిని ఇవ్వడమే తప్పా? 3నెలల్లో 52 మంది రైతులు చనిపోయినా సీఎం పట్టించుకోరా? వెనుకబడిన, కరవుపీడిత ప్రాంతంగా ఉన్న రాయలసీమ, వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో రాజకీయ కక్ష సాధించే దిశగా పాలిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
Mar 05, 2020, 21:06 IST
GVL Narsimha Rao Clearly Says Capital Is State Issue - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకే అమరావతిపై తను ప్రకటన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్‌ రావత్‌ సైతం వేసవి రాజధాని ప్రకటించారని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో జీవీఎల్‌ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌ సీఎం ప్రకటనతో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్‌డీఏ చట్టం ద్వారా రైతుల భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెట్టవద్దని హితవు పలికారు. తమ రాష్ట్ర పార్టీ కోరిన అన్ని పనులను కేంద్ర ప్రభుత్వం చేయదని చెప్పారు.


పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్‌ సూచించారని తెలిపారు. ఒక చానల్‌ తనపై తప్పుడు వార్తలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు  మళ్లీ కట్టుకథలు అల్లితే సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అమరావతిపై జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తను మాట్లాడుతున్నట్టు చెప్పారు.

ఏపీ కేబినెట్‌: కీలక నిర్ణయాలకు ఆమోదం

ఏపీ కేబినెట్‌: కీలక నిర్ణయాలకు ఆమోదం
Mar 04, 2020, 17:24 IST
Key Decisions Taken By Andhra Pradesh Cabinet - Sakshi
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఎన్‌పీఆర్‌లోని కొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, రామాయపట్నం పోర్టు నిర్మాణాలపై సమావేశంలో చర్చించారు. దీంతో పాటు ఉగాదికి సుమారు 26లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీపై సన్నద్ధత, ఓడరేవుల నిర్మాణం, బడ్జెట్‌, ఆర్థిక విధివిధానాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రివర్గ భేటీ వివరాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.




మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 43,101 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంటి పట్టాను గతంలో మాదిరి కేవలం వారసత్వంగా అనుభవించేందుకు మాత్రమే కాకుండా ఒక నిర్దేశిత ఫార్మాట్‌లో ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నాం. ఇంటి స్థలం పొందిన  లబ్ధిదారులు ఐదేళ్ల పాటు ఇళ్లు కట్టుకునేందుకు, లేదా వ్యక్తిగత అవసరాలకు బ్యాంకులో తనఖా పెట్టుకునే హక్కు కల్పిస్తూ..ఐదేళ్ల తరువాత దాన్ని విక్రయించేందుకు హక్కు కల్పిస్తున్నాం. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అందరూ తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రర్‌ హోదా ఇస్తున్నాం. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేట్‌ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. యుద్ధ ప్రాతిపాదికన లేఅవుట్లు ఏర్పాటు చేసి, గ్రావెల్‌ రోడ్లు వేసి స్థలాలు ఇవ్వబోతున్నాం.ఈ కాలనీలను 'వైఎస్సార్‌ జగనన్న కాలనీ'లుగా నామకరణం చేయబోతున్నాం. చదవండి: కోవిడ్‌పై ఆందోళన వద్దు

♦ఎన్‌పీఆర్‌ ప్రక్రియను నిలిపివేస్తున్నాం. గడిచిన మూడు మాసాల పైబడి దేశంలో ఉన్న అనేక కోట్ల మంది మైనారిటీ వర్గాల్లో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌పై భయాందోళనలో ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా మైనారిటీ వర్గాలు భయాందోళనలో ఉన్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కలను ఆసరా చేసుకొని మమ్మల్ని డిటేషన్‌ క్యాంపులో పెడతారనే ఆందోళనలో చాలా మంది ఉన్నారు. వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకొని వారికెలాంటి భయందోళన లేకుండా వారిలో భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2010లో జనాభా లెక్కల ప్రక్రియలో ఏ ప్రశ్నావళి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రక్రియకే పరిమితమవుతాం. ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాలో కూడా మార్పు చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను కూడా నిలిపివేయాలని తీర్మానం చేశాం. కేంద్రాన్ని కూడా అడుగుతూ నిలిపివేస్తున్నాం.

♦రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం, భావనపాడు  పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది అందరికి తెలిసిందే. దానిలో భాగంగా రామాయపట్నం పోర్టుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో, దాని అడ్డంకులు తొలగించడంలో భాగంగా కృష్ణపట్నం పోర్టుకు ఉన్న విస్తృత నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపాం. పీపీపీ విధానంలో భోగాపురం పోర్టు నిర్మాణం కోసం టెండర్ల పక్రియలో అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన జీఎంఆర్‌ కంపెనీకి గతంలో ఇచ్చిన టెండర్‌ కండిషన్లలోనే వారికి ఇస్తామన్న 2,703 ఎకరాల్లో 2,200 ఎకరాలకు కుదిస్తూ మిగతా 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకునేలా మార్పు చేశాం. ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం. చదవండి: సామాన్యుడి సొంతింటి కల ఆయన ధ్యేయం

♦రాబోయే తొలకరిని దృష్టిలో పెట్టుకొని రైతుకు కావాల్సిన విత్తనాలను సేకరించి రైతు అవసరాల కోసం అందుబాటులో ఉంచేందుకు ఏపీ స్టేట్‌ సీడ్‌ కార్పొరేషన్‌కు రూ.500 కోట్ల నిధులు బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు ఆమోదం తెలిపాం. 

♦విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో పురోగతిలో ఉన్న 800 మెగా వాట్ల విద్యుత్‌ కేంద్రం, అలాగే కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను పూర్తి చేసేందుకు ఏపీ జెన్‌కో రూ.1000 కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపాం. ప్రభుత్వం నుంచి వీటిని బ్యాంకు గ్యారెంటీ ఇస్తున్నాం.
♦ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గత ప్రభుత్వంలో టీడీపీ అనే రాజకీయ పార్టీకి కేటాయించిన రెండు ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను కొనసాగిస్తూ.. ఆ భూమిని రద్దు చేస్తున్నాం.

♦కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సుండిపెంట గ్రామ పంచాయతీ ఏర్పాటుకు పంచాయతీ రాజ్‌ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తూ..అక్కడ నాలుగు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు, 44 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
♦అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, భూ ఆక్రమణలపై ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో లోకాయుక్తా, సీబీ సీఐడీ ద్వారా విచారణ చేయిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చాం. ఇప్పటికే సిట్‌ ఏర్పాటు చేశాం. అందులో జరిగిన అన్ని అక్రమాలను ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ ప్రక్రియ పూర్తి చేసి చార్జ్‌సిట్‌ దాఖలు చేసేందుకు ప్రత్యేక ప్రక్రియ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఎన్నార్సి, సిఏఏ పై జగన్ వైఖరి ఏంటి..?

ఎన్నార్సి, సిఏఏ పై జగన్ వైఖరి ఏంటి..?
March 5, 2020

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్పిఆర్ కి వ్యతిరేకంగా అడుగులు వేసింది. అభ్యంతరకర ప్రశ్నలు ఉన్న నేపధ్యంలో దానిని రాష్ట్రంలో అమలు చేయకుండా మైనార్టీ ల మనోభావాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కేబినేట్ తీర్మానం కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిని బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించి ఆ తర్వాత కేంద్రానికి పంపిస్తుంది. ఇప్పుడు దీనిపై ముస్లిం మైనార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేతలకు పాలాభిషేకం కూడా చేసారు.


మరి పౌరసత్వ సవరణ చట్టం విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ముస్లిం, బడుగు, బలహీన వర్గాల భద్రతకు టీడీపీ ఎనలేని ప్రాథాన్యత ఇస్తుంది. గడిచిన 9 నెలల్లోనే మైనార్టీల్లో అభ్రతాభావం పెరిగింది. జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై దేశవ్యాప్తంగా మైనార్టీలు ఆందోళనలో ఉన్నారు. వీటి అమలుపై రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు.


కేంద్రం ఎన్పిఆర్ విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయి గాని పౌరసత్వ సవరణ చట్టం విషయంలో మాత్రం ఏ మాట చెప్పడం లేదు. అమలు చేస్తామని ధీమా గా చెప్తుంది. ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని అంటుంది. కెసిఆర్ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో సీరియస్ గా ఉన్నారు. దీని మీద కూడా జగన్ తీర్మానం చేస్తే అప్పుడే ముస్లింల మనోభావాలను గౌరవించినట్లు అవుతుంది అని పలువురు కామెంట్ లు చేస్తున్నారు. ఇప్పటికే మైనార్టీలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో కూడా తీర్మానం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.


ఆ ఒక్క విషయంలో జగన్ కి చంద్రబాబు మద్దతు

Varalakshmi Srinivas- Flash News Reporter Last Updated Time: 2020-03-05 08:03:53  IST
 My Profile
Mail
 Subscribe
ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య నిప్పు౦-ఉప్పులా వాతావరణం ఉంది.అధికార పార్టీ వైసీపీ టీడీపీని లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ మీద ప్రజలలో ఉన్న కనీసమైన గౌరవం కూడా లేకుండా చేయాలని ప్రణాలికలు వేసుకొని రాజకీయ దాడులు చేస్తుంది.

YCP And TDP Gives Once Statement On NPR Bill In Assembly-Janasena Npr Assembly Ycp Tdp
మరో వైపు టీడీపీ కూడా తన అనుకూల మీడియాని ఉపయోగించుకొని అధికార పార్టీ పరిపాలనలో పూర్తిగా వైఫల్యం అయ్యిందని ప్రచారం చేస్తుంది.అమరావతిని బూచిగా చూపిస్తుంది.అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒకప్పుడు చంద్రబాబు తరహాలో ప్రతిసారి మీడియా ముందుకి వచ్చి ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం లేదు.ముందుగా తన పరిపాలన బాద్యతలు చూసుకుంటూ ప్రజా సంక్షేమం అభివృద్ధి మీద దృష్టి పెడుతూ వెళ్తున్నాడు.

అయితే తన పార్టీ నాయకుల ద్వారా మాత్రం టీడీపీ మీద విమర్శలతో దాడులు చేయిస్తున్నారు.



అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ, సిఏఏ, ఎన్పీఆర్ అంశం ఆందోళనకి కారణం అవుతుంది.

ఒక వర్గం ప్రజలు ఈ బిల్లులని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.ఇక ఏపీలో కూడా ముస్లిం, మైనార్టీ సంఘాల వారు ఎనార్సీ, ఎన్పీఆర్ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ని ఇప్పటికే కోరారు.

దీనిపై జగన్ కూడా వారికి హామీ ఇచ్చారు.ఎన్పీఆర్ లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, అంత వరకు ఏపీలో దానిని అమలు చేయకుండా బిల్లు పాస్ చేస్తామని చెప్పారు.

ఎన్నార్సీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఇప్పుడు ముస్లిం సంఘాల వారు ప్రతిపక్ష నేత చంద్రబాబుని కూడా కలిసి ఎన్పీఆర్ కి వ్యతిరేకంగా ప్రవేశపెట్టే బిల్లుకి అసెంబ్లీలో మద్దతు ఇవ్వాలని కోరారు.



బాబు కూడా దీనిని పరిశీలించి కచ్చితంగా అధికార పార్టీ బిల్లు ప్రవేశపెడితే తాము కూడా అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పారు.మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఈ ఎన్పీఆర్ బిల్లు విషయంలో మొదటి సారి ఒకే మాట వినిపించడానికి సిద్ధమయ్యాయి అని రాజకీయ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు.

అయితే జనసేన మాత్రం బీజేపీతో కలిసి వెళ్ళడం వలన వీటిని బహిరంగంగా కూడా మద్దతు ప్రకటించే అవకాశం లేదని తెలుస్తుంది.


జాతీయం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఆర్థికం
అవీ..ఇవీ
Thursday 5 March 2020
సిఏఏ వ్యతిరేకించిన మంత్రులపై జగన్ చర్యలు తీసుకోవాలి


పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తున్న మంత్రులపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ  సభలలో వైసిపి సభ్యులు సమర్దించారని, ఈ సందర్భంగా జరిగిన చర్చలలో పాల్గొన్నరని ఆయన గుర్తు చేశారు.

ఈ చట్టంపై క్షేత్ర స్థాయిలో ప్రజలను రెచ్చగొడుతున్నాయని కన్నా విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ప్రతిపక్షాలు ఉన్నాయని ఆరోపించారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో  ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులో రథం తగలబెట్టి, దేవాలయాలను కూల్చివేసిన ఘటనలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

భారతదేశంలో ఎన్‌ఆర్‌సీ లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నోసార్లు స్పష్టం చేశారని ఆయన తెలిపారు. అట్లాగే, రిజర్వేషన్ల అంశంపై మార్పు చేయడం జరగదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని గుర్తు చేశారు.  రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో పడ్డాయని మండిపడ్డారు.

ఎన్‌ఆర్‌సీ లేదని చెబుతున్నా అసదుద్దీన్‌ ఒవైసీ గుంటూరులో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఓవైసీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని దయ్యబట్టారు.

ఇక ఈ కార్యక్రమాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పాల్గొంటున్నారని నిలదీశారు. సీఏఏ వల్ల భారతదేశంలో ఏ ఒక్క ముస్లింలకు అన్యాయం జరగదని కన్నా స్పష్టం చేశారు.




పౌరసత్వం’పై జగన్‌ డ్రామాలు
మైనార్టీల హక్కులకు అండగా టీడీపీ

ముస్లిం సంఘాల నేతల భేటీలో చంద్రబాబు

అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘‘ముస్లిం, బడుగు, బలహీన వర్గాల భద్రతకు టీడీపీ ఎనలేని ప్రాథాన్యత ఇస్తుంది. గడిచిన 9 నెలల్లోనే మైనార్టీల్లో అభ్రతాభావం పెరిగింది. జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై దేశవ్యాప్తంగా మైనార్టీలు ఆందోళనలో ఉన్నారు. వీటి అమలుపై రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబుతో ముస్లిం సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. ఎన్‌పీఆర్‌పై ప్రజల్లో ఆందోళనల దృష్ట్యా ఆ ప్రక్రియను ప్రస్తుతానికి అబయన్స్‌లో పెడుతున్నామంటూ కేబినెట్‌లో ఆమోదించడమూ జగన్నాటమేనని అన్నారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే దీనిపై జీవో 102ను ఆగస్టు16న విడుదల చేసే వారే కాదని, దీనిని నమ్మడానికి ముస్లింలు సిద్ధంగా లేరని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్లకోసం జగన్‌ నాటకం ఆడుతున్నారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. టీడీపీ తెచ్చిన ముస్లిం సంక్షేమ పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భేటీలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ వ్యతిరేక కూటమి ఏపీ శాఖ, జమాతె ఇస్లామి హింద్‌, ముస్లిం హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

♦ఎన్‌పీఆర్‌ ప్రక్రియను నిలిపివేస్తున్నాం. గడిచిన మూడు మాసాల పైబడి దేశంలో ఉన్న అనేక కోట్ల మంది మైనారిటీ వర్గాల్లో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌పై భయాందోళనలో ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా మైనారిటీ వర్గాలు భయాందోళనలో ఉన్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కలను ఆసరా చేసుకొని మమ్మల్ని డిటేషన్‌ క్యాంపులో పెడతారనే ఆందోళనలో చాలా మంది ఉన్నారు. వారి ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకొని వారికెలాంటి భయందోళన లేకుండా వారిలో భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2010లో జనాభా లెక్కల ప్రక్రియలో ఏ ప్రశ్నావళి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రక్రియకే పరిమితమవుతాం. ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాలో కూడా మార్పు చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను కూడా నిలిపివేయాలని తీర్మానం చేశాం. కేంద్రాన్ని కూడా అడుగుతూ నిలిపివేస్తున్నాం.