అధికార మదంతో ప్రభుత్వ టెర్రరిజం
May 28 2021
కరోనా విలయంలోనూ దాడులేనా?
కక్ష సాధింపుల గడ్డగా మార్చారు.. ప్రతి తప్పుడు కేసునూ మేమొచ్చాక సమీక్షిస్తాం
ఆ అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తాం.. తప్పులు చేయిస్తున్నవారూ రక్షించలేరు
ఇప్పుడు అతి చేస్తున్న ప్రతి వైసీపీ నేతా ఇంతకింత చెల్లించుకుంటారు
కొవిడ్ వ్యాక్సిన్లకు డబ్బివ్వరు.. రంగుల ప్రకటనలకు మాత్రం వందల కోట్లు
కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుంటున్నారు.. అయినా సంక్షేమ భజన
చంద్రబాబు ఆగ్రహం.. మహానాడు తొలి రోజు ప్రసంగం
అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ టెర్రరిజం అడుగడుగునా అధికార మదంతో తాండవమాడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని వేధింపులు, కక్ష సాధింపులకు చిరునామాగా మార్చారని మండిపడ్డారు. ‘‘కరోనా విలయంలో వేల సంఖ్యలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వారి ప్రాణాలు కాపాడే బాధ్యతను గాలికి వదిలిపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేసి కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక రైతులు అల్లాడుతుంటే పట్టదు. మాస్కులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన వైద్యుడు ఈ లోకం వదిలి వెళ్ళేవరకూ వెంటాడి వేధిస్తారు. ఇదొక పాలనా? దీనికోసమేనా ఒక్క చాన్సు కావాలని ప్రజలను వేడుకుని అధికారంలోకి వచ్చింది’ అని నిలదీశారు. గురువారం ప్రారంభమైన టీడీపీ రెండు రోజుల డిజిటల్ మహానాడులో ఆయన తొలుత ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయ వేధింపుల తీర్మానంపై కూడా మాట్లాడారు. ‘తప్పుడు కేసులతో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి వంటి టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఎంపీ రఘురామరాజును పోలీసు కస్టడీలో తీవ్రంగా కొట్టారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు.. అరెస్టులు. ఆస్పత్రిలో రోగులను పరామర్శించడానికి వెళ్తే అరెస్టులు. మీడియాపై దేశ ద్రోహం కేసులు... సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా లెక్కచేయకుండా అహంకారంతో పరిషత్ ఎన్నికలను పెడితే హైకోర్టు వాటిని రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రజస్వామ్యం హతమారిపోతోందని కోర్టులు వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
ఇంకా ఏమన్నారంటే..చూస్తూ ఊరుకోవద్దు..
పోలీసులు అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే టీడీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవద్దు. ఎదురు తిరిగి ప్రైవేటు కేసులు వేయాలి. ఈ విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఎంపీ రఘురామరాజు అలా చేయడం వల్లే పై నుంచి కిందవరకూ అందరూ ఇరుక్కుపోయారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. కరోనాతో మీ వాళ్లు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. మీతో తప్పులు చేయిస్తోంది. రేపు మిమ్మల్ని కాపాడేందుకు వాళ్లెవరూ ఉండరు. వైసీపీ నేతలకూ ఒక మాట గట్టిగా చెబుతున్నాం. గతంలో చూసీ చూడనట్లు ఊరుకున్నాం. ఇక ముందు సహించేది లేదు. అన్నీ వడ్డీతో చెల్లిస్తాం. సంక్షేమ పఽథకాల పేరుతో కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో అంతకు రెట్టింపు లాక్కుంటున్నారు. సామాన్యుల బతుకు దుర్భరం చేస్తున్నారు. ఆదాయాలు పడిపోయి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎక్కడా పనులు లేవు. అమరావతిని చంపేశారు. పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు లేవు. అప్పులపై బండి నడిపిస్తున్నారు. మూడు తరాలకు సరిపోను అప్పుల భారం మోపుతున్నారు. రైతులకు రూ.87 వేల కోట్లు ఇచ్చామని కబుర్లు చెబుతున్నారు. పంట కొనే దిక్కే లేదు. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా ఉన్నాడు? గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మేశారు. దివాలా తీసిన వ్యక్తుల మాదిరిగా ఉన్నవన్నీ అమ్ముకుని బండి నడిపిస్తున్నట్లుగా ఉంది. 14 కొత్త వైద్య కళాశాలలు పెడుతున్నామని ప్రతి రోజూ చెబుతున్నారు. పెట్టడానికి నిధులు ఎక్కడున్నాయి? ఏం చేశారో చెప్పలేక ప్రతిపక్షాన్ని బూతులు తిట్టి పోతున్నారు.
ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి
కరోనా సమయంలో పేదలకు, అవసరం ఉన్న వారికి పార్టీ నేతలు చేతనైనంత సాయం చేయాలి. చాలా కుటుంబాలు అనారోగ్యం బారిన పడి భోజనం సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. అటువంటి వారికి ఇళ్లకే భోజనం పంపండి. ఎక్కడైనా మీకు శక్తి లేకపోతే చెప్పండి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొంత డబ్బు సమకూరుస్తాం. ట్రస్ట్ ద్వారా 600 మంది వరకూ ఆన్‌లైన్‌లో వైద్య సేవలు పొందారు. ఐదు వేల మంది వరకూ సేవలు పొందేలా విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చినవారు అదే అధికారాన్ని ఉపయోగించుకుని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు. మీడియాను, న్యాయవ్యవస్థనే బెదిరించడం.. ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేయడం దారుణమని యాక్షన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికలో పేర్కొన్నారు. వృత్తిలో అత్యున్నతంగా ఉన్నవారికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవి ఇస్తారు. కానీ ప్రభుత్వంలో అప్పుడే పదవీ విరమణ చేసినవారికి ఇచ్చారు. పరిషత్ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోలేదు. చట్టవిరుద్ధంగా జారీచేసిన నోటిఫికేషన్ వల్ల రూ.120కోట్లు ఖర్చు. ఈ ముఖ్యమంత్రి ఆలోచన ఏంటో ఇలాంటి నియామకాలు, చర్యలతో అర్థం కావాలి.
ఆనందయ్యను రాచిరంపాన పెడుతున్నారు
సమాజ హితం కోరి తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని నలుగురికి అందించాలని తపించిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం రాచిరంపాన పెడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటూ ఒకరుంటే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. కరోనాపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఆనందయ్య విషయాన్ని ప్రస్తావించారు. ‘ఆయన్ను పోలీసులు తీసుకెళ్లి తమ అదుపులో ఉంచుకున్నారు. అధికార పార్టీ నేతలు ఆయనతో రహస్యంగా ఆ మందు తయారు చేయించి తమ వారికి పంచుకుంటున్నారు. ఇదేనా పాలన? ఆయన్ను ఇంటికి పంపండి. కావాలంటే అక్కడ పోలీసు కాపలా పెట్టుకోండి. ఆయన కుటుంబ సభ్యులను భయపెట్టవద్దు’ అని సూచించారు.
ఖలీల్ జిబ్రాన్ కవిత..
లెబనాన్ కవి ఖలీల్ జిబ్రాన్ కవితను చంద్రబాబు చదివి వినిపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితులకు ఇది అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ‘ఎవరి నాయకులైతే అబద్ధాలకోరులవుతారో ఆ జాతిని చూసి జాలిపడదాం. నిజం చెప్పే ధైర్యం చచ్చిన మేధావులు, జాతి విద్వేషంతో రగులుతూ పరుల గాలిని సైతం సహించని మూకలున్న దేశాన్ని చూసి జాలిపడదాం. రక్తపాతం, చిత్రహింసలతో ప్రపంచాన్ని ఏలాలనుకునే బందిపోట్లను, రౌడీలను హీరోలుగా కొలిచే జాతిని చూస్తే జాలేస్తోంది. తమ హక్కులు తెంచుకుపోతున్నా.. తమ స్వేచ్ఛ కొట్టుకుపోతున్నా కిమ్మనని దేశాన్ని, ప్రజలను చూసి జాలిపడదాం’ అని ఆ కవితలో ఉంది.
అధికారంతో మిడిసిపాటు
May 28 2021
అన్నీ రాసి పెట్టుకుంటున్నాం.. వడ్డీతో బదులు తీరుస్తాం
మాకూ ఒక రోజు వస్తుందని గుర్తుంచుకోండి
వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక
జనార్దన్‌రెడ్డి అరెస్టుపై ఆన్‌లైన్‌లో నిరసన దీక్ష
తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేటు కేసులు
స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు
టీడీపీ అధినేత ఆగ్రహం
ఈ రోజు ఎవరెవరు ఏం చేశారో అన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. రాసి ఉంచుకుంటున్నాం. అణిచివేతను, కక్ష సాధింపును అనుభవించిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త దానికి బదులు తీర్చుకుంటారని గుర్తుంచుకోండి.
రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు ఉండకూడదని టీడీపీ శ్రమించి పనిచేసి వాటిని రూపుమాపింది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వేధింపు రాజకీయాలు మొదలయ్యాయి.
- చంద్రబాబు
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): అధికారం చేతిలో ఉందని వైసీపీ నేతలు మిడిసిపడుతున్నారని.. వారి ప్రతి అరాచకానికీ వడ్డీతో బదులు తీరుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం టీడీపీ నిర్వహించిన ఆన్‌లైన్ నిరసన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘అధికారం అండతో ప్రభుత్వ టెర్రరిజాన్ని ప్రదర్శిస్తున్నారు. నాయకులను అణచివేస్తే టీడీపీ ఉండదని భ్ర మిస్తున్నారు. ఎంత అణిచివేస్తే అంత బలంగా పోరాడే శక్తి టీడీపీ శ్రేణులకు ఉంది. గడియారం తిరుగుతూనే ఉంటుంది. ఒక రోజు మాకూ వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘మనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసు వేసే హక్కు మనకు ఉంది. ఎంతవరకై నా వెళ్లి పోరాడదాం. స్టేషన్లో పోలీసులు కొట్టినా ఊరుకోవలసిన అవసరం లేదు. నిర్భయంగా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయండి. అక్కడ న్యాయం జరగకపోతే ఇం కా పైకి వెళ్దాం. ఎంపీ రఘురామరాజును పోలీసు కస్టడీలో కొట్టించారు. ఆర్మీ ఆస్పత్రిలో నిజాలు బయటకు వచ్చి ముఖ్యమంత్రి బోనులో నిలబడ్డారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతివారూ పోరాడాలి. పోలీసుల్లో కొందరు మరీ అతిగా పోతున్నారు. వారందరినీ గుర్తు పెట్టుకుంటు న్నాం. ప్రభుత్వం మారితే మీ పరిస్థితేం టో ఆలోచించుకోండి. మీకు జీతాలు ఇస్తోంది ప్రజలు తప్ప వైసీపీ నేతలు కాదు. మరీ ఎక్కువ చేస్తే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.
ఇంత చెత్త సీఎంను చూడలేదు..
కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడే పనిని వదిలిపెట్టి రాజకీయ కక్ష సాధింపులపై జగన్‌రెడ్డి దృష్టి పెట్టి పనిచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ తన రాజకీయ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసిందని, కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ‘కరోనా వచ్చిన పేదలు, మధ్య తరగతి ప్రజలు చికిత్స కోసం అల్లాడుతున్నారు. డబ్బులు లేకపోతే ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదు. పడకలు దొరకవు... ఆక్సిజన్ దొరకదు. ఇవేవీ ఈ సీఎంకు పట్టవు. ఉన్మాద పాలనకు కేరాఫ్ అడ్ర్‌సగా మారింది’ అని విమర్శించారు. కేసులు, అరెస్టులకు భయపడవద్దని...భయపడి ఇంట్లో దాక్కుంటే ఇంకా మీద పడతారని, అందరూ కలిసి తిరగబడితేనే వెనక్కి తగ్గుతారని పార్టీ శ్రేణులకు సూచించారు. బీసీ జనార్దన్‌రెడ్డి ఏనాడూ ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోలేదని, సొంత డబ్బులతో నియోజకవర్గం అభివృద్ధికి పనిచేశారని గుర్తుచేశారు.
No comments:
Post a Comment