Monday, September 16, 2019

కోడెల శివప్రసాదరావు

హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాపై బాంబు దాడి జరిగింది
17-12-2015 16:06:05

డాక్టర్. కోడెల శివప్రసాదరావు.. టీడీపీలో సీనియర్ నేత.. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి స్పీకర్

ఆయన.. ఎవరూ ఊహించని రీతిలో సోమవారం(16-09-2019) ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ

వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్‌లోని ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నారు. ప్రభుత్వం తనను

కేసుల పేరుతో ఇబ్బందులు పెడుతూ మానసిక క్షోభకు గురిచేస్తోందంటూ ఆయన బాహాటంగానే

పలుమార్లు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆయన మరణ వార్త తెలిసి.. టీడీపీ నేతలు, కార్యకర్తలు,

అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... గత ఎన్నికల్లో అనూహ్యంగా

ఓటమి పాలయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు.. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న కోడెలను..

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. కోడెలకు ఎన్టీఆర్ టికెట్ ఆఫర్ ఇచ్చారు. అలా మొదటిసారి

1983లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు.. 1987లో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. ఎన్టీఆర్,

చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండే కోడెల.. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి కూడా

సేవలందిస్తూ వస్తున్నారు. 2014లో గెలిచి.. స్పీకర్‌గా ఎన్నికయిన సందర్భంలో.. 30-06-2014న.. ఏబీఎన్

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. తన

రాజకీయ, వ్యక్తిగత విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు..

ప్లేయర్‌ కావాల్సినవారు అంపైర్‌ అయ్యారు.. ఏమనిపిస్తోంది?
కొంచెం ఇబ్బందికరమే. ఆదినుంచీ నాకొచ్చినవన్నీ వృత్తికి, ప్రవృత్తికి సంబంధంలేని అవకాశాలే. డాక్టర్‌

చదివి రాజకీయాల్లోకి రావడం... పైగా హోం, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పనిచేయడం,

ఇప్పుడు స్పీకర్‌ కావడమూ అలాంటివే. అయితే, ఇక్కడా సక్సెస్‌ కావాలనే పట్టుదలతో ఉన్నా.

రెండే పార్టీలున్న చిన్న అసెంబ్లీని చూస్తే ఏమనిపిస్తోంది?
ఇప్పుడు డైరక్ట్‌ ఫైట్‌ మాత్రమే ఉంటుంది. సభ్యులు 175 మందే కాబట్టి నియంత్రణలో ఉంచడం

సులువవుతుంది. రెండు పక్షాలూ స్పీకర్‌ తమవాడనుకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ, దురదృష్టవశాత్తు

తొలిరోజే నామీద కామెంట్స్‌ వచ్చాయి.

మీరు ప్రత్యర్థులపై ఒంటికాలిమీద లేచేవారు.. ఇప్పుడు గుంభనగా ఉండాలి? చంద్రబాబు కక్ష

తీర్చుకున్నారనుకుంటున్నారా?
ఎన్టీఆర్‌, చంద్రబాబు గొప్ప నాయకులు. వారేం చేసినా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. నాకు

వ్యక్తిగతంగా ఎవరిమీదా కోపం ఉండదు. రాజకీయంగా ప్రజలకు మేలు చేయడం కోసం కొంచెం ఆవేశంగా

మాట్లాడుతుంటా.

వైఎస్‌ ఉన్నప్పుడు కేవీపీని ఆంధ్రా శశికళతో పోల్చారు కదా?
ఆంధ్రా శశికళ అన్నది ఒక పోలిక మాత్రమే. అక్కడ వాళ్లు ఒకరు ఆత్మ అయితే మరొకరు శరీరం అన్నట్లు

ఉండేవారు. ఇక్క డా వీళ్లు అలాగే ఉండేవారు. ఆ తర్వాత వైఎస్‌ నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు.

గుంటూరులో మా భూములు అభివృద్ధి చేయాలనుకున్నా. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటా

మంటూ నోటీసులు పంపారు. దానిపై కోర్టుకెళ్లాం. ఏడేళ్లు పట్టినా మాకే అనుకూలమైంది. కానీ ఏడేళ్ల

ఆదాయం కోల్పోయా.

రాజకీయాలన్నీ డబ్బుచుట్టూ తిరుగుతున్నాయి. ఇలాగైతేమరో పార్టీ మనుగడ సాధించగలదా?
కచ్చితంగా! యూపీలో అఖిలేశ్‌ అధికారంలో ఉన్నా మోదీ ఘనవిజయం సాధించారు కదా. మొన్న

ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చుపెట్టినవారు కూడా ఓడారు. డబ్బున్నవాళ్లు రాజకీయాల్లోకి రావడం,

సంపాదించడం మామూలైంది... ఇది సరికాదు.

పాలనలో ప్రజాప్రతినిధుల ప్రభావం ఎక్కువైంది ఇది ఎక్కడకు దారి తీస్తోంది?
తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు ఎస్సై దగ్గరకు వెళ్లి వినతి పత్రం ఇచ్చేవాళ్లం. అది సరిగా

ఉందనుకుంటే.. రూల్స్‌ ప్రకారం పనిచేసేవాడు. కానీ ఇప్పుడు అధికారులు ఎమ్మెల్యేల కారుదగ్గరకు వెళ్లి

వాళ్లు చెప్పింది చేయాల్సి వస్తోంది. అది కరెక్టు కాదు.

సభలో టీడీపీ, వైసీపీ వ్యవహారశైలి చూస్తే ఏమనిపిస్తోంది?
మీకు 1983నాటి విషయం చెప్పాలి. అప్పుడు బీఏసీలో నిర్ణయించిన అంశాలన్నింటిపైన సాయంత్రం

వరకు చర్చ నడిచేది. ఏదైనా ఒక అంశం వాయిదా పడితే ప్రభుత్వం అవమానంగా భావించేది. అలాంటిది

నేడు బడ్జెట్‌నుకూడా గిలిటెన్‌ చేసే పరిస్థితి రావటం బాధాకరం. మొన్నటి సమావేశాల్లో ప్రతిపక్షానికి ఒకటే

చెప్పాను. సభ సజావుగా సాగేలా చూసి చర్చలో పైచేయి సాధించాలిగానీ, రాజకీయంగా పైచేయి కోసం

ప్రయత్నించ రాదని... సభ సజావుగానే సాగుతుందని నమ్మకం నాకుంది.


మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి లేదు

ఎక్కువమంది స్పీకర్లు మీ జిల్లావారే... ప్రత్యేకత ఏమిటి?
స్పీకర్లే కాదు ముఖ్యమంత్రులూ ఎక్కువే. మా జిల్లా నుంచి ముగ్గురు సీఎంలుగా చేశారు. కారణం.. మాది

చాలాపెద్ద జిల్లా. రాజకీయాలే కాదు.. సినిమా, వ్యాపార, మీడియా,


వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ అవగాహన కూడా ఓ కారణం. కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా

మరో కారణం.

ఇప్పటి పరిస్థితుల్లో మంత్రి అయితే బాగుండుననిపించలేదా?
నా మనస్తత్వం తెలిసినవాళ్లెవరూ నేను రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు. అటువంటిది ఆరుసార్లు గెలవడం

మంత్రిగా పనిచేయడం జరిగాయి. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు. కానీ, రాలేదన్న అసంతృప్తి

ఏదీ లేదు.

రాజకీయాలంటే అంత అనాసక్తి ఉన్న మీరు ఎలా వచ్చారు?
ఎన్టీఆర్‌ 1983లో పార్టీ పెట్టినప్పుడు.. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసుకుంటున్న నన్ను పిలిచి పోటీచేయమన్నారు...

రానన్నాను. ఇలా రెండు మూడుసార్లు జరిగిన తర్వాత మిత్రులు బలవంతపెట్టడంతో రావాల్సి వచ్చింది.

రాజకీయాల్లోకి వచ్చి గెలిచాను కానీ అప్పటికే ఆ నియోజకవర్గంతోపాటు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఓ

బలమైన వర్గాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

మీ కుటుంబ నేపథ్యమేమిటి?
మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. నాకు ఇద్దరు చెల్లెళ్లు.. ఇద్దరు తమ్ముళ్లు ఉండేవారు.

దురదృష్టవశాత్తు స్మాల్‌ పాక్స్‌తో నలుగురూ ఓ వారం వ్యవధిలో చనిపోయారు. అప్పుడు మా తాతగారింటికి

వెళ్లడం వల్ల నేను బతికాను. నా కుమారుడు కూడా ప్రమాదంలో చనిపోవడం నా జీవితంలో అత్యంత

బాధాకర విషయం.

ఆ బాధనుంచి తేరుకోవడానికి ఎంత కాలం పట్టింది?
ఇప్పటికీ తేరుకోలేదు. పని ఉన్నప్పుడు ఏమీ గుర్తురావు. ఖాళీ సమయంలో మాత్రం గుర్తొస్తుంటుంది. వాడు

చెన్నైలో చదివాడు. ఆర్థోపెడిక్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌. చాలా సర్వీస్‌ ఓరియంటెడ్‌. సింగరేణి కాలరీస్‌లో

జాబ్‌చేస్తూ తన జీతాన్ని పేదలకు ఖర్చుపెట్టేవాడు. ఓ రోజు ఇంటికి వస్తూ ప్రమాదంలో మరణించాడు.

మీ ఇంట్లో బాంబు పేలుళ్లు ఎలా జరిగాయి?
మా ఇల్లు చాలా పెద్దది. ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంటుంది. ఇల్లు కూడా 20,30 వేల చదరపు అడుగుల

వైశాల్యంగలది. నేను ఎన్నిక ప్రచారంలో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదిలిలో ఉన్నాను. పోలీసుల

తనిఖీ ఎక్కువైందని ఎవరో ఒక వ్యక్తి బాం బులు తెచ్చి మా ఇంట్లో దాచాడు. తర్వాత వాటిని తీసుకెళ్లే

ప్రయత్నంలో ఒకతను వాటిమీద కాలు వేయడంతో అవిపేలినలుగురు మరణించారు. అది నాకు చాలా

బాధ కలిగిం చింది. తర్వాత దానిపై సీబీఐ విచారణ జరిగింది.

కానీ నా ఇంట్లో అటువంటి ఘటన ఓ మచ్చగా మిగిలింది. కానీ, నేను తప్పు చేయనని ప్రజలు నమ్మారు.

అందుకే నన్ను గెలిపించారు. నరసరావుపేటలో ఫ్యాక్షన్‌ గొడవలున్న గ్రామాలు చాలా ఉన్నాయి. ఒకసారి

హోం మంత్రిగా ఉన్నపుడు రొంపిచర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాను. అప్పుడే నామీద బాంబు దాడి

జరిగింది. అంతమంది పోలీసు లున్నా ఎవరూ అడ్డుకోలేకపోయారు. అప్పుడు పరిస్థితులు అంత

దారుణంగా ఉండేవి. కానీ 1994 తర్వాత చాలా మారింది.

హోం మంత్రిగా వంగవీటి రంగా హత్య సమయంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డారుకదా?
1989 డిసెంబర్‌లో ఆ హత్య జరిగింది. ఆ హత్య జరగడమే చాలా ఘోరం. ఆ తర్వాత జరిగిన హింస

మరింత దారుణం. ఎంతోమందిపై దాడి చేశారు. ఇళ్లు తగలబెట్టారు. ఓ డాక్టర్‌ను హత్య చేశారు. దాంతో

హోంమంత్రిగా ఆఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాను.

బియ్యం సేకరించి అమ్మారన్న ఆరోపణ కూడా వచ్చిందికదా?
తూర్పుగోదావరిలో తుఫాను వచ్చినప్పుడు బాధితులకోసం బియ్యం సేకరించాం. వాటిని ఆర్డీవోకు

అందజేద్దామనుకొని తూకం వేస్తుంటే నేను అమ్ముకోవడానికే చేస్తున్నానని ఆరోపించారు. ఇంతా చేసి అవి

90 క్వింటాళ్ల బియ్యం.


చంద్రబాబు సాధ్యం చేయగలరు

జిల్లాలో మీరు అందరి కంటే సీనియర్‌ నేత. కానీ మీ నాయకత్వాన్ని వారు అంగీకరించకపోవడానికి

కారణమేమిటి?
నేను నియంతలా వ్యవహరిస్తున్నానని వాళ్లనుకోవచ్చు .. వాళ్లకోసం ఎంతో కృషి చేసినా నాతో సరిగా

ఉండడం లేదని నేననుకోవచ్చు.


 ఇద్దరి వాదనా కరక్టే.. ఎదిగేవాడికి.. ఎదిగిన వాడిని చూస్తే అసూయగా ఉంటుంది. ఎదగడానికి వారు

ప్రయత్నాలు చేయవచ్చు. కానీ ఎదుటివాళ్ల మీద బురద చల్లకూడదు. స్వతాహాగా నాది అలక స్వభావం.

నేను వాళ్లతో ఉన్న విధంగా వాళ్లు నాతో ఉండరేమిటి అని నాకు కోపం వస్తుంది. చంద్రబాబుతో కూడా ఇదే

సమస్య. ఆయన ఏ విషయాన్ని మాటల్లో వ్యక్త పరచరు. కానీ మాటల్లో చెబితే బాగుంటుంది కదా అని

నేననుకుంటా.

మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్లిపోదాం అని

వ్యాఖ్యానించారు. ఎందుకు? అద్దెంట్లో ఉంటున్న భావన ఉందా?
కచ్చితంగా! రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అసెంబ్లీ, సెక్రటేరియట్‌ ఇక్కడ ఉండి పనిచేస్తే అది

ప్రవాసంగా ఉన్నట్టే. అందుకనే అక్కడకు వెంటనే వెళ్లాల్సిన అవసరం ఉంది. వసతులు లేకపోయినా

అక్కడకు వెళ్లి కష్టపడితే అది మిగిలినవాళ్లకు ఆదర్శంగా ఉంటుంది. ఇంకా ఇక్కడే ఉంటే సమస్యలు

తలెత్తుతాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను చెప్పిన స్థాయిలో అభివృద్ధి చేయడం సాధ్యమేనా?
అది కష్టమే.. అయినా చంద్రబాబు సాధ్యం చేయగలరు. 1995లో పరిస్థితినే చూస్తే.. జీతాలు లేని

పరిస్థితులున్నాయి. అలాంటి పరిస్థితుల్లోంచి మిగులు బడ్జెట్‌లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు కూడా

ఆయన ఒక్కడే చేయగలడు.

మీ వారసుడెవరైనా వస్తారా?
నా కుమారుడు ఉన్నాడు. అయితే వారసుడిలా ఫీలవద్దని వాడికి నేనెప్పుడూ చెబుతుంటానసేవ

చేయగలనన్న నమ్మకం ప్రజల్లో కలిపించాలి. వారికి సహాయపడగలమని చూపించాలి. అప్పుడే

రాజకీయంగా రాణిస్తాం. అంతేకానీ కేవలం వారసుడిగా వచ్చినంత మాత్రాన రాజకీయంలో ఏమీ చేయలేం.

కాకపోతే మిగిలినవారికంటే కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది.

ఇప్పుడు చాలామంది గెలిచిన మొదటి సారే మంత్రులైపోవాలనుకుంటున్నారు కదా?
ఇదివరకు అటువంటిది ఊహకు కూడా వచ్చేది కాదు. నేను మొదటిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచాను.

87లో ఒకసారి ఎన్టీఆర్‌ పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నారు. అయినా సరే నాకు వద్దన్నాను. డాక్టర్‌ వృత్తికి

ఇబ్బందవుతుందని చెప్పాను. మళ్లా తర్వాత రెండోసారి పిలిచి అడిగారు. పార్టీని బలోపేతం చేయాలంటే

తప్పదన్నారు. దాంతో అప్పుడు తీసుకోవాల్సివచ్చింది.

మీకు ఎదురైన చేదు అనుభవాలు?
బియ్యం ఘటన ఒకటి.. ఇంట్లో బాంబులు పేలడం ఒకటి ఆ రెండు అంశాలు చాలా బాధపడ్డాను.

రాజకీయాలు.. వైద్యం... ఏది బెటరంటారు?
వైద్య వృత్తిలో ఉన్నప్పుడు అందరూ నావాళ్లే అన్న భావన ఎంతో బలంగా ఉండేది. కానీ రాజకీయాల్లో

ఎవరూ నావాళ్లు కాదేమోననే భావన. అందువల్ల రాజకీయాలతో పోలిస్తే వైద్య వృత్తి బెటర్‌.

స్పీకర్‌ పదవి తీసుకున్న వాళ్లు తర్వాత రాజకీయాల్లో రాణించిన వారెవరూ లేరు మీకేమనిపిస్తోంది.?
ఎస్సైన్‌మెంట్‌ తీసుకునేటప్పుడు భయమనిపించింది. కానీ, దీంట్లోకూడా రాణించాలనినిపించింది.

రామకృష్ణుడు వంటివాళ్లు ఉన్నారు. మరో విషయమేమిటంటే స్పీకర్‌ పదవిని రిటైర్‌మెంట్‌కు దగ్గరగా

ఉన్నవాళ్లకే ఇస్తారు... అనుకోవచ్చుకదా. ఇప్పటికే 30 ఏళ్లు రాజకీయ జీవితం చూశాను. ఇక్కడ నుంచి

వచ్చేది ఇక నాకు బోనస్‌ వంటిదే.

మీమీద చాలా సార్లు దాడులు జరిగినట్టున్నాయి?
అవును ఒకసారి కోటప్పకొండనుంచి వస్తుంటే మందుపాతర పేల్చారు. అలా తర్వాత నాలుగైదు సార్లు

దాడులుచేశారు. ఒకసారి యాసిడ్‌ బాంబు దాడి జరిగింది. అప్పుడే చిన్న గాయమైంది.

మీ జీవిత లక్ష్యం
నేను కోరుకున్న దానికంటే ఎక్కువే లభించింది. అందువల్ల ఇది కావాలనే కోరిక ఏమీలేదు. కాబట్టి

నలుగురికీ సేవ చేసుకుంటూ హ్యాపీ లైఫ్‌ గడపాలని కోరుకుంటున్నా.



సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!
Sep 16, 2019, 13:14 IST
Kodela Siva Prasada Rao Played Key Role in Andhra Pradesh Politics - Sakshi
ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం

ఎన్టీఆర్‌, చం‍ద్రబాబు హయాంలో మంత్రిగా సేవలు

మంచి డాక్టర్‌గా పేరుతెచ్చుకున్న కోడెల

ఎన్టీఆర్‌ పిలుపుమేరకు రాజకీయ ఆరంగేట్రం

గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెలది సుదీర్ఘ చరిత్ర

సాక్షి, హైదరాబాద్‌: నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు కోడెల శివప్రసాదరావు

జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి.. పలుసార్లు మంత్రిగా,

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా సేవలు అందించిన ఆయన.. ఆత్మహత్య చేసుకొని తనువు చాలించారు.

వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోడెల ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు

జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన.. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఐదుసార్లు

నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి ఎదురైనా.. 

2014లో సత్తెనపల్లి నియోజకవర్గానికి మారి.. మరోసారి గెలుపొందారు. ఎన్టీ రామారావు,

చంద్రబాబునాయుడు మంత్రివర్గాల్లో పలు శాఖలు నిర్వహించిన ఆయన.. నవ్యాంధ్ర తొలి

శాసనసభాపతిగా ఎన్నికై.. ఐదేళ్లు సేవలు అందించారు. ఆయన జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే..


గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు

జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. దిగువ మధ్యతరగతి కుటుంబంలో

జన్మించిన ఆయన.. విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివాడు. చిన్నతనంలోనే తోబుట్టువులు

అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదం నుంచే డాక్టర్ కావాలని

నిర్ణయించుకున్న ఆయన.. తాత ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించారు. కర్నూలు వైద్య కళాశాలలో చేరి..

రెండున్నరేళ్ళ తర్వాత తిరిగి గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వారణాసిలో ఎం.ఎస్

చదివారు. నరసరావుపేటలో హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టిన ఆయన.. అనతికాలంలోనే మంచి

డాక్టర్‌గా స్థానికంగా పేరు తెచ్చుకున్నారు. అలా పల్నాడులో అంచెలంచెలుగా ఎదిగి.. ప్రముఖ సర్జన్‌గా

కీర్తిగడించిన డాక్టర్ కోడెలను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించారు. ఆయన పిలుపుమేరకు

1983లో టీడీపీలో చేరిన కోడెల మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం

సాధించి.. అసెం‍బ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లోనూ నర్సరావుపేట

నుంచి ఆయన వరుస విజయాలు సాధించారు.  2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఆయన

ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం

నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి పోటీచేసిన కోడెల మరోసారి విజయం సాధించారు. అనంతరం

నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి.. ఐదేళ్లపాటు సేవలు అందించారు.  కోడెలకు భార్య

శశికళ, ముగ్గురు పిల్లలు (విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ) ఉన్నారు. 

కోడెల శివప్రసాదరావు కన్నుమూత
Sep 16, 2019, 12:46 IST
TDP Leader Kodela Siva Prasada Rao Passed Away In Hyderabad - Sakshi
సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సోమవారం

కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన

బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు

తెలిసింది. ఆయన 1947, మే 2న గుంటూరులోని కండ్లకుంట గ్రామంలో జన్మించారు. కోడెలకు భార్య,

ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్‌ విజయలక్ష్మీ ఉన్నారు.


కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం

గమనార్హం. కొడుకు శివరాంతో గొడవ కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారనే కథనాలు

వెలువడుతున్నాయి. వృత్తిరిత్యా డాక్టర్‌ అయిన కోడెల 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  గత టీడీపీ

ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన కోడెల.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి

అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. కోడెల ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, ఎన్టీఆర్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా, హోంమంత్రిగా

సేవలందించారు.
(చదవండి : సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!)

కేసీఆర్‌ సంతాపం..
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారన్న

వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ

సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు.

ఉపరాష్ట్రపతి విచారం..
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన

ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు

మృతి విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి

తెలియజేస్తున్నాను’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?
Sep 16, 2019, 13:56 IST
BanjaraHills Police Enquiry on Kodela Siva prasada Rao Death - Sakshi
విచారణ జరుపుతున్న బంజారాహిల్స్‌ పోలీసులు

కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు

ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక

మృతి పట్ల బంజారాహిల్స్ పోలీసులు  విచారణ జరుపుతున్నారు. ఆయన మృతిపై కారణాలను ఆరా

తీస్తున్నారు. ఈ మేరకు కోడెల కుటుంబసభ్యుల నుంచి స్టేట్‌మెంట్‌ పోలీసులు రికార్డు చేసినట్టు

తెలుస్తోంది.


కోడెల అస్వస్థతకు గురికావడంతో ఆదివారం రాత్రి 11.15 గంటలకు ఆయనను డ్రైవర్, గన్‌మెన్

బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందించారు.

అర్ధరాత్రి 12.15 గంటలకు  చికిత్స పొందుతూ కోడెల మృతి చెందారు. కోడెల మృతిపై పలు

అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలది ఆత్మహత్య నా? అనారోగ్యం కారణంగా మృతిచెందారా? అన్న

కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరికొద్దిసేపటిలో కోడెల భౌతికకాయానికి వైద్యులు పోస్ట్

మార్టం నిర్వహించనున్నారు. బసవతారకం ఆస్పత్రి నుంచి కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి

తరలించి.. అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.

Sunday, September 15, 2019

నిషేధంపై నిలదీత

నిషేధంపై నిలదీత
16-09-2019 03:05:15
  • ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహ జ్వాలఫోర్త్‌ ఎస్టేట్‌ను అణిచేయడంపై తీవ్ర నిరసన
  • నిషేధించిన చానళ్ల పునరుద్ధరణకు డిమాండ్‌
  • నిరంకుశత్వంపై ఉద్యమం తప్పదని హెచ్చరిక
  • జర్నలిస్టు, ప్రజా సంఘాల ఆందోళన
  • స్వచ్ఛందంగా కదిలిన ప్రజలు.. టీవీలు పగలగొట్టిన
  • పశ్చిమ వాసులు.. నిలిపివేతపై ట్రాయ్‌కు ఫిర్యాదుల వెల్లువ
  • ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహ జ్వాల.. ఫోర్త్‌ ఎస్టేట్‌ను అణిచేయడంపై తీవ్ర నిరసన
  • అనంతపురం, శ్రీకాకుళంలలో భారీ ర్యాలీ
(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌)
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-5 ప్రసారాల నిషేధం రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పుట్టిస్తోంది. ఆయా చానళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని ప్రజలే నిలదీస్తున్నారు. తమ డబ్బును వెచ్చించి పెట్టుకున్న కేబుల్‌ కనెక్షన్లపై ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నల శరాలను సంధిస్తున్నారు. జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆదివారం చేపట్టిన భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియాపై ప్రభుత్వ వైఖరి సరికాదని నినదించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్‌ చేశారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడు తూ.. సీఎం జగన్‌ ఇప్పటికైనా ప్రజాస్వా మ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపాలని హితవుపలికారు. ‘‘ఇప్పటికైనా మారండి.
 
లేకుంటే ఈ నిరసనలు ప్రజా ఉద్యమాలుగా మారడం ఖాయం’’ అని నేతలు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రజల హక్కులను కాపాడాలని గతంలో గగ్గోలు పెట్టిన వారే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హక్కులను కాలరాస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వమే పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేస్తోందని జర్నలిస్టు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఏబీఎన్‌, టీవీ-5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ.. నల్లబ్యాడ్జీలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ప్రెస్‌క్లబ్‌ నుంచి టవర్‌క్లాక్‌, సప్తగిరి సర్కిల్‌ మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
 
ర్యాలీ పొడవునా.. ‘మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా..? సిగ్గు...సిగ్గు’-‘ముఖ్యమంత్రి డౌన్‌.. డౌన్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏబీఎన్‌, టీవీ-5 ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌, సీపీఎం నేత నాగేంద్ర, కాంగ్రెస్‌ నేత శంకర్‌, బీజేపీ నాయకుడు జంగటి అమర్‌నాథ్‌, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కమిటీ చైర్మన్‌ బీసీఆర్‌ దాస్‌, రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గిడి మల్లయ్య, ‘చంద్ర-దండు’ వ్యవస్థాపకుడు ప్రకాశ్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర నేతలు ఆదెన్న, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, మా జీ మేయర్‌ స్వరూప, ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పాల్గొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్నా.. ప్రభుత్వం భయపడుతోందనేందుకు ఇంతకంటే నిదర్శనం లేదన్నారు.
 
శ్రీకాకుళంలో..
‘మీడియాపై నిషేధాజ్ఞలా? చానెళ్ల గొంతునొక్కడమన్నది అప్రజాస్వామికం’ అంటూ శ్రీకాకుళంలో జర్నలిస్టులు నినదించారు. ఆదివారం శ్రీకాకుళంలో ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి ప్రజాసంఘాలు మద్దతుగా నిలిచాయి. నల్లబ్యాడ్జీలను ధరించి ఏడురోడ్ల జంక్షన్‌లో మానవహారాన్ని చేపట్టి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశాయి. ‘మీడియాకు స్వేచ్ఛ ఇవ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదాలతో హోరెత్తించారు. నాయకులు మాట్లాడుతూ మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. మీడియాపై ప్రభుత్వ వైఖరి మారకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తే, అవి చూసి తప్పులను సరిచేసుకోవాల్సిందిపోయి.. మీడియాపై ఆంక్షలు విధించడం సబబు కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహమూర్తి పాల్గొన్నారు.
 
టీవీలు పగలగొట్టి..
ఏబీఎన్‌, టీవీ5 చానళ్లను నిలిపివేయడం ప్రజా వ్యతిరేక చర్య అని పశ్చిమ గోదావరిజిల్లాలోని విస్సాకోడేరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్‌ చానల్‌ నిలిచిపోవడంపై ఆగ్రహాంతో ఊగిపోయారు. కేబుల్‌ ఆపరేటర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఉన్న టీవీలను బయటకు తీసుకువచ్చి జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. అనంతరం రహదారిపైనే టీవీలను పగలకొట్టి నిరసన తెలిపారు. ఇప్పటికైనా చానల్‌ను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గ్రామానికి చెందిన బి.సూర్యనారాయణ, ఆరేపల్లి నాగరాజు, బొర్రా కోటేశ్వరరావు, బొక్కా శ్రీనివాసరావు, సింగంపల్లి బాబూరావు తదితరులు నిరసనలో పాల్గొన్నారు. భీమవరంలో రైతు కార్యాచరణ సమితి తాజా పరిస్థితులపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. నిజాలను నిర్భయంగా వెల్లడించే ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి పట్ల ఈ రకంగా వ్యవహరించడం తగదని రైతు సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ.. మీడియాపై ఒత్తిళ్లు ఏమాత్రం సహేతుకం కాదన్నారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని సీపీఐ ఆరోపించింది.
 
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
రాష్ట్రంలో ఏబీఎన్‌, టీవీ-5 చానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మీడియా పీకనొక్కే ప్రయత్నాలు గతంలో కేసీఆర్‌ తెలంగాణలో చేశారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం చేస్తోంది. ఈ చర్య ప్రజాస్వామిక విలువలకు, విధానాలకు తీరని హాని. ప్రభుత్వం వెంటనే చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలి.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
 
నిలిపివేతపై ఉద్యమిస్తాం
ఏబీఎన్‌, టీవీ5 చానళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రసారాలను నిలిపివేయడమే దీనికి ఉదాహరణ. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియా గొంతునొక్కే చర్యలు తగవు. వెంటనే వీటి ప్రసారాలను పునరుద్ధరించాలి. లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతాం. మీడియాకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కేబుల్‌ ఆపరేటర్లను స్వయానా మంత్రులే బెదిరించడం సిగ్గుచేటు. సీఎం జగన్‌ నియంతలా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు.
టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి
 
ఇది అప్రజాస్వామికం
వైసీపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌. ప్రభుత్వానికి, మీడియాకి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని చర్చించుకోవాలే తప్ప మీడియా గొంతు నొక్కడం, నిషేధించడం మంచి పద్ధతి కాదు. ఏబీఎన్‌, టీవీ5 చానళ్లను నిలిపి వేయడం సరికాదు. మీడియా, ప్రభుత్వం కలిసి ప్రజాస్వామ్య హక్కులను, భావ స్వేచ్ఛను కాపాడాలే తప్ప ప్రభుత్వం మీడియాను అడ్డుకోవడం సరైన విధానం అనిపించుకోదు. ఇప్పటికైనా వాటిని పునరుద్ధరించాలి.
బీజేపీ నేత రావెల కిషోర్‌బాబు
ADVERTISEMENT

కన్నాను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం!

కన్నాను ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం!
16-09-2019 08:50:27

గుంటూరు: గురజాలలో కన్నా లక్ష్మీనారాయణ సభకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు నోటీసు ఇచ్చేందుకు గురజాల సీఐ ప్రయత్నించారు. కానీ కన్నా నోటీస్ తీసుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుతం
గురజాలలో 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని.. అక్కడకు రావద్దని సీఐ నచ్చజెప్పేందుకు యత్నించినా.. కన్నా వినిపించుకోకుండా బయలు దేరారు. ఈ నేపథ్యంలో దారి మధ్యలో కన్నాను ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.