Vijayawada: ఓఆర్‌ఆర్‌కు రాజముద్ర
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:44 AM
రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే
ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
189.9 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌కు ఓకే
ఐదు జిల్లాల పరిధిలోని 23 మండలాలు.. 121 గ్రామాల మీదుగా సాగనున్న నిర్మాణం
త్వరలోనే భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల
విజయవాడ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రాజధాని అమరావతిని దేశంలోని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ఓఆర్‌ఆర్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని ప్రాంత పరిధితోపాటు, బయట కూడా కలిపి మొత్తం ఐదు జిల్లాల పరిధిలో 189.9 కిలోమీటర్ల నిడివిలో భూసేకరణకు గజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అవి ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌కు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్తు) అప్రూవల్ కమిటీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భూ సేకరణకు వీలుగా రాజపత్రాన్ని వెలువరించింది. దాని ప్రకారం త్వరలోనే జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) అధికారులు తమ డివిజన్ల ప్రాతిపదికన భూసేకరణ నోటిఫికేషన్లను వెలువరించటానికి ఐదు జిల్లాల యంత్రాంగాలను నిర్దేశించనుంది. కొద్ది రోజుల వ్యవ ధిలోనే జిల్లాల వారీగా భూముల సేకరణకు ఆయా జిల్లాల కలెక్టర్లు భూసేకరణ నోటిఫికేషన్లను వెలువరించనున్నారు. కృష్ణా జిల్లాలో 4 మండలాల పరిధిలో 24 గ్రామా లు, ఏలూరు జిల్లాలో ఒక మండలం పరిధిలో 11 గ్రామాలు, ఎన్టీఆర్ జిల్లాలో 5 మండలాల పరిధిలో 28 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 11 మండలాల పరిధిలో 46 గ్రామాలు, పల్నాడు జిల్లాలో రెండు మండలాల పరిధిలో 12 గ్రామాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ వెళుతుంది. అవుటర్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెట్టనుంది.
అమరావతికి దేశంలోని అనేక జాతీయ రహదారులు అనుసంధానం అవుతాయి. అనేక ఆర్థిక కారిడార్ల రహదారులు అనుసంధానం కావటంతో భవిష్యత్తులో అమరావతి అభివృద్ధికి దోహదపడనుంది. ఓఆర్‌ఆర్‌లో కృష్ణానదిపై 2 బ్రిడ్జిలు, 34 చోట్ల హై ఓల్టేజీ క్రాసింగ్, టన్నెల్స్ 3, ఆర్‌ఓబీలు 7, అండర్‌పా్‌సలు 78, చిన్న వంతెనలు 51, పెద్ద వంతెనలు 14, ఇంటర్ చేంజ్‌లు 9 వస్తాయి. గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఆరువరుసల యాక్సెస్ కంట్రోల్ హైవేను నిర్మిస్తారు. భవిష్యత్తులో 8 వరుసలుగా దీనిని నిర్మిస్తారు. ప్రస్తుతం రోడ్డు వెడల్పు 70 మీటర్లుగా ఉంటుంది.
ఎన్టీఆర్ జిల్లాలో
కంచికచర్ల మండలం పరిధిలో కంచికచర్ల, పెరకలపాడు, గొట్టుముక్కల, మున్నలూరు, మోగులూరు, కునికినపాడు గ్రామాలు, వీరులపాడు మండలం పరిధిలో పొన్నవరం, జగన్నాఽథపురం, జుజ్జూరు, చెన్నారావుపాలెం, తిమ్మాపురం, గూడెం మాధవరం, అల్లూరు, నరసింహారావు పాలెం, జీ కొండూరు మండలం పరిధిలో జీ కొండూరు, కుంటుముక్కల, దుగ్గిరాలపాడు, పేత్రంపాడు, గంగినేనిపాలెం, నందిగామ, కోడూరు, మైలవరం మండలంలో మైలవరం, పొందుగల, గణపవరం గ్రామాల్లో భూ సేకరణకు గజిట్ వెలువడింది.
ఏలూరు జిల్లాలో
ఆగిరిపల్లి మండలంలో బొద్దనపల్లి, గరికపాటివారి కండ్రిక, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లె, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెం, సగ్గూరు, క్రిష్ణవరం, సూరవరం, కలటూరు గ్రామాలు.
కృష్ణా జిల్లాలో
బాపులపాడు మండలంలో బండారుగూడెం, అంపాపురం, ఉంగుటూరు మండలంలో సగ్గూరు ఆమని, బల్లిపర్రు, బూతుమిల్లిపాడు, ఉంగుటూరు మండలంలో పెద అవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, వేలినూతల, తరిగొప్పల, వేంపాడు, బొకినాల, మానికొండ, కంకిపాడు మండలంలో మారేడుమాక, కోలవెన్ను, ప్రొద్దుటూరు, కొణతనపాడు, దావులూరు, చలివేంద్రపాలెం, నెప్పల్లి, కుందేరు, తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు, చిన్నపులిపాక, బొడ్డపాడు, నార్త్ వల్లూరు, సౌత్ వల్లూరు.
గుంటూరు జిల్లాలో
మంగళగిరి మండలంలో కాజ, చినకాకాని, తాడికొండ మండలంలో పాములపాడు, వరగని, మందపాడు, మంగ ళగిరిపాడు, డోకిపర్రు, విసదల, పేరేచర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు, పెదకాకాని మండలంలో నంబూరు, దేవరాయభోత్లపాలెం, అనుమర్లపూడి, దుగ్గిరాల మండలంలో చిలువూరు, కంటమరాజు కొండూరు, ఈమని, చింతలపూడి, పెనుమూలి, కొల్లిపర్ర మండలంలో వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అథోట, తెనాలి మండలంలో కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు,కతేవరం, సంగం జాగర్లమూడి, చేబ్రోలు మండలంలో గొడవర్రు, నారాకోడూరు, వేజెండ్ల, సుద్దపల్లి, శేకూరు, వట్టిచెరుకూరు మండలంలో కొర్నెపాడు, అనంతవరప్పాడు, చామళ్లమూడి, కుర్నూతల, గుంటూరు తూర్పు మండలంలో ఏటుకూరు, గుంటూరు, బుడంపాడు, గుంటూరు వెస్ట్ మండలంలో పోతూరు, అంకిరెడ్డిపాలెం.
పల్నాడు జిల్లాలో
అమరావతి మండలంలో లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు, పెదకూరపాడు మండలంలో ముస్సాపురం, పాటిబండ్ల, జలాలపురం, కంభంపాడు, తాళ్లూరు, లింగంగుంట్ల, కాసిపాడు, బలుసుపాడు .