ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది?: చంద్రబాబు
అమరావతి: ఎమ్మెల్సీ అశోక్‌బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన అశోక్‌బాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అశోక్‌బాబు ఎక్కడా దాక్కోలేదు. తప్పు చేస్తే ధైర్యంగా ఆఫీస్‌కు వచ్చి అరెస్ట్ చేయవచ్చు. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడో తిప్పారు. ఉన్మాది సీఎం చెప్తే.. పోలీసుల విచక్షణ ఏమైంది? ఎప్పటికైనా మిమ్మల్ని జగన్‌రెడ్డి బలిపశువులను చేస్తారు. ప్రజా సమస్యలపై పోరాడడం తప్పా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ముగ్గురు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షాన టీడీపీ పోరాడుతుంది. ఇకపై ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగనివ్వం’’ అని పేర్కొన్నారు.
https://www.andhrajyothy.com/telugunews/chandrababu-comments-mrgs-andhrapradesh-1922021202355431