Tuesday, June 30, 2020

29 Agreements Signed During China Tour: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu

29 Agreements Signed During China Tour: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu

HomeAndhra Pradesh29 Agreements Signed During China Tour: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu
29 Agreements Signed During China Tour: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu
Andhra PradeshPress Trust of IndiaUpdated: April 18, 2015 10:51 pm IST
by TaboolaSponsored LinksSponsored
Coding Classes for kids, IIT/Harvard Mentors (CampK12)
Book Your Customised Health Insurance Plan Today (Religare Health Insurance)
29 Agreements Signed During China Tour: Andhra Pradesh Chief Minister Chandrababu Naidu
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu with Chinese Vice Premier Wang Yang.

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, who had led an official and business delegation to China to look for investments, today said that 29 agreements were signed during the six-day tour.

"29 MoUs were signed. 17 were Government-to-Business (G2B) MoUs and 12 were Business to-Business (B2B)," Mr Naidu told reporters in Hyderabad after his return from China.

"There is great enthusiasm among Chinese companies to invest in Andhra Pradesh and India. We asked them to explore the investment opportunities. We have signed some MoUs. They will come here to discuss with government as well as private entrepreneurs. They will visit the field and wherever they are feasible they will (proceed)," he said.

We are working with them in the construction of the new capital (of Andhra Pradesh), and also infrastructure and manufacturing, Mr Naidu added.

Praising China for its rapid growth, the chief minister said, "China is moving very fast with regard to industries, manufacturing and also mega projects like speed trains, super highways, mega townships, ports...they are going on mega scale. We have to learn on how to implement (this) in India.

"They have reached a saturation point. They want investment in other countries also. In that direction India offers them an opportunity," he said.

The chief minister, who visited Beijing, Chengdu and Shanghai, during the tour, said, "I met senior leadership - Vice Premier, Governors and Mayors in China. The interaction was very fruitful...There was discussion on industry to industry also."

Mr Naidu added that he would meet Prime Minister Narendra Modi and apprise him of his China trip.

Saturday, June 27, 2020

అమరావతిలో బొత్స వరుస పర్యటనలు.. రైతుల్లో విస్మయం

అమరావతిలో బొత్స వరుస పర్యటనలు.. రైతుల్లో విస్మయం

Advertisement

Powered By PLAYSTREAM
అమరావతి: రాజధాని అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ వరుస పర్యటనలు సరికొత్త ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. రైతుల్లో అనేక సందేహాలు లేవనెత్తున్నాయి. మంత్రి బొత్స గతంలో రాజధాని గ్రామాలను శ్మశానంతో పోల్చి.. ఇప్పుడు అదే రాజధాని గ్రామమైన రాయపూడిలో పర్యటించడంపై గ్రామస్తుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. చాలా రోజుల తర్వాత రాయపూడికి బొత్స రావటంతో గ్రామస్తుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. శనివారం రాజధాని గ్రామం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఇన్‌టెక్‌వెల్ పనులు, కరకట్ట రోడ్‌ను పరిశీలించారు.  బొత్స, సీఆర్డీఏ కమిషనర్ వచ్చి వెళ్లటంతో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇవాళ కూడా రాయపూడి సమీపంలో కూడా బొత్స టూర్ కొనసాగుతోంది. బొత్స ఆకస్మిక పర్యటనలపై రాజధాని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఏదో జరగబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

‘రహస్య భేటీ’ వార్తలపై స్పందించిన సుజనా

‘రహస్య భేటీ’ వార్తలపై స్పందించిన సుజనా
అమరావతి: పార్క్ హయత్ హోటల్‌లో ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌తో భేటీ వివాదంపై ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీకి లేఖ రాశారు. సీనియర్ ఐఎఎస్ అధికారి రమేశ్ కుమార్ రహస్యంగా సమావేశమైనట్టు కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసారాలు చేశారని, సదరు హోటల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా టెలికాస్ట్ చేశారన్నారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా పలువురు వైసీపీ నేతలు కూడా దీనిపై వారి స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నారు.

ఆయన లేఖలో ఏమన్నారంటే..

‘‘అసలు వాస్తవమేంటంటే.. లాక్ డౌన్ తరువాత తన అధికార, వ్యాపార కార్యకలాపాలను బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్ నుంచి నిర్వహిస్తున్నాను. అక్కడే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నన్ను కలుస్తున్నారు. అవి ఎంతమాత్రం కూడా రహస్య సమావేశాలు కాదు. నా కార్యకలాపాలను, సమావేశాలను రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ నెల 13న కామినేని శ్రీనివాస్ నన్ను కలవడానికి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అదే రోజు రమేశ్ కుమార్  కూడా నన్ను కలవాలని అడిగారు.  వారిద్దరు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు విషయాలపై నాతో సమావేశమయ్యారు. అవి ఎంతమాత్రం రహస్య సమావేశాలు కాదు. కామినేని గారితో ఏపీ పార్టీ వ్యవహారాలు మాట్లాడ్డం జరిగింది. రమేశ్ కుమార్ మా కుటుంబానికి ఎంతో కాలంగా మిత్రులు. ఆయనతో ప్రత్యేకించి ఇటీవల పరిణామాలు గానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన విషయాలు కానీ చర్చించలేదు. అయితే కొన్ని మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు సీసీ ఫుటేజ్ చూపించి తాము ముగ్గురం సమావేశమయ్యామని, ఏదో గూడుపుఠాని వ్యవహారం నడిపామని, ప్రసారం చేశాయి. చాలా తెలివిగా గడుసుగా ప్రజలకు భ్రమ కల్పించే ప్రయత్నం చేసాయి. రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు, వారి నేలబారు మనస్తత్వాలను బయటపెట్టుకున్నట్టే. నలుగురు కలిసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుంది. ఈ రకమైన బురద రాజకీయాలు చేసేవారితో గుంటలోకి దిగి వారితో కలబడి కుస్తీ పట్టడం నాకు అలవాటు లేదు, అది నా స్థాయి కాదు.  నేనెప్పుడూ ఓపెన్‌గానే ఉంటాను. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. రహస్య కార్యకలాపాలు నేను చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు’’ అని కుండబద్ధలు కొట్టారు.


Thursday, June 25, 2020

Proposal for new districts going to do injustice to Srikakulam and Parvatipuram, say experts

Proposal for new districts going to do injustice to Srikakulam and Parvatipuram, say experts
K. Srinivasa RaoVIZIANAGARAM/SRIKAKULAM, JUNE 25, 2020 11:40 IST
UPDATED: JUNE 25, 2020 11:52 IST
SHARE ARTICLE 0PRINTA A A
Andhra Pradesh government’s proposal to make Parliamentary constituencies as districts has led to uproar in several parts of Srikakulam and Vizianagaram districts. Several public representatives, academicians, and representatives of non-governmental organisations joined hands to step up pressure on the government to make changes in the proposal to minimise the inconvenience to people of several Assembly constituencies.

Although the government’s intention is bring the administration to the door steps of the people with decentralisation, it is expected to cause inconvenience and lead to economic imbalances between the districts, say experts.



Currently, Etcherla and Rajam Assembly constituencies, part of Vizianagaram Parliament constituency, are major industrial hubs in Srikakulam district. They have been flourishing areas compared to remaining eight Assembly segments of Srikakulam district.

If government implements its proposal, educational institutions like Dr.B.R.Ambedkar University, GMRIT, Venkateswara Engineering College, and Sivani Group of Educational Institutions, and major pharmaceutical industries like Aurobindo Pharma, Reddy’s Laboratory and Nagarjuna Agrichem Limited, sugar factories, jute factories and many other industries will come under Vizianagaram district.

Dr.B.R.Amebdkar University former Vice Chancellor Hanumanthu Lajapathi Rai said that there would not be any progress in Srikakulam district in future with the reorganisation of districts. “The State government should announce a special financial package for Srikakulam district to develop industries and establish educational institutions in other areas when Etcherla and Rajam are included in Vizianagaram district,” said Dr.Lajapathi Rai.



Former MP of Parvatipuram D.V.G Sankara Rao urged the State government to make Parvatipuram as a separate district since Araku was almost 170 km away from Parvatipuram, which is currently part of Araku Parliamentary segment. “People of Parvatipuram in Vizianagarm district and Palakonda in Srikakulam district will be the victims of the proposal as there is no direct access and public transportation system to Araku. The government should take the opinion of all the stakeholders in this regard,” he said.

Parvatipuram Zilla Sadhana Samiti leaders G.V. Ramana Rao, Vangala Dali Naidu said that the association would approach the court since the proposal would defeat the concept of decentralisation and make life miserable to more than 4 lakh people of the area. “The government should continue Parvatipuram in Vizianagaram district if it cannot make it as a separate district. We are also willing to be part of neighbouring Srikakulam district instead of proposed Araku district,” said Mr. Dalinaidu, spokesperson of the Samithi.

Wednesday, June 17, 2020

ఎన్‌ఆర్‌సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం

ఎన్‌ఆర్‌సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం
Jun 17, 2020, 16:44 IST
Andhra Pradesh Assembly Passes Resolution On NRC - Sakshi
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌)ని అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

భోజన విరామం తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌పీఆర్‌–2020 (నేషనల్‌ పాపులేషన్‌ ఆఫ్‌ రిజిస్టర్‌)లో కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళనలు పెరిగాయని అన్నారు. అందువల్ల 2010 నాటి ఫార్మట్‌ ప్రకారమే ఎన్‌పీఆర్‌ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆ మేరకు ఎన్‌పీఆర్‌–2020లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయాలని స్పష్టం చేశారు.

మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావం తొలగించి, వారిలో మనోధైర్యం నింపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అంజాద్‌బాషా కొనియాడారు. అందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని గతంలో సీఎం అన్నారని ఆయన ప్రస్తావించారు.

అభ్యంతరకర అంశాలు
గతంలో కూడా 2010, 2015లో ఎన్‌పీఆర్‌ నిర్వహించారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. అయితే ఇప్పుడు 2020లో నిర్వహిస్తున్న ఫార్మట్‌లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వివరాలు, వారు పుట్టినతేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు, ఇంకా మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అంజాద్‌బాషా అన్నారు. అందుకే మార్చి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశామని అంజాద్‌బాషా తెలిపారు. దాని ఆధారంగా ఇప్పుడు సభలో మరో తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. 

Monday, June 8, 2020

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలి

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలి 

అమరావతి: ఏపీలో కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలని కాంగ్రెస్ నేత నారాయణరావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకపై తీసుకొచ్చిన నూతన విధానంవల్ల నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. ఇసుక పాలసీవల్ల పడుతున్నఇబ్బందులను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా.. పట్టించుకోకపోవడం  చాలా బాధాకరమని అన్నారు.

చివరికి సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, జగ్గిరెడ్డి, ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటివాళ్లు మాట్లాడుతూ.. ఒక లారీ ఇసుక తెప్పించుకోలేకపోతున్నామని, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ విధానమే బాగోలేదని వాళ్లు విమర్శలు చేశారన్నారు. అధికారపక్షం నేతలే ఇలా మాట్లాడుతుంటే.. రాష్ట్రంలో ఇసుక పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన అన్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన లక్షలాదిమంది కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మేల్కొని ఇసుక పాలసీని మార్చాలని నారాయణరావు సూచించారు.


ఏపీలో ఇసుక కొరత: లాక్‌డౌన్ సడలించినా నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు
శంకర్.వి
బీబీసీ కోసం
3 జూన్ 2020
దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Facebook దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Messenger దీనిని క్రింది వాటితో షేర్ చేయండి Twitter దీనిని క్రింది వాటితో షేర్ చేయండి ఇమెయిల్ షేర్ చేయండి
Image copyrightFACEBOOK/YSRCPOFFICIAL
కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు మొదలు కావడంతో అన్నిరంగాలలో కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా పనులను ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణరంగం మాత్రం కదలడం లేదు.

ఇసుక దొరక్క పోవడమే దీనికి ప్రధాన కారణమని చాలామంది చెబుతున్నారు. ఒకపక్క విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కానీ ప్రభుత్వం మాత్రం ఇసుక అందుబాటులోనే ఉందని, కొరతకు అవకాశమే లేదని ప్రకటనలు చేస్తోంది.

ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
ఆంధ్రప్రదేశ్‌లో కొన్నేళ్లుగా ఇసుక మాఫియా ఇష్టారాజ్యం సాగుతోందన్న ఆరోపణలున్నాయి. నదుల్లో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు జరపడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ జోక్యంతో ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది.

తాము అధికారంలోకి వస్తే ఇసుక సమస్య పరిష్కరిస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్‌ ప్రకటించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఇసుక పెద్దసమస్యగా మారింది.

కొరత కారణంగా పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడంతో ఇదో వివాదమైంది.

కృష్ణా, గోదావరి నదుల్లో చాలా రోజులపాటు వరదలు కొనసాగడం కొరతకు కారణమని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈసారి వేసవి వచ్చేసరికి ఒకపక్క లాక్‌డౌన్‌, మరోపక్క బల్క్‌ బుకింగ్‌లు నిర్మాణ రంగానికి తలనొప్పిగా మారాయి.

ఏమిటీ బల్క్‌ బుకింగ్‌ విధానం?
ఇసుక తవ్వకాలలో పారదర్శకత కోసమంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన బల్క్ బుకింగ్‌ విధానం కొత్త కష్టాలు తీసుకొస్తోందన్న ఆరోపణలున్నాయి.

గతంలో ఇసుక కావాలంటే ర్యాంపులకు వెళ్లి డబ్బు చెల్లించి కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాన్ని ఆన్‌లైన్‌కు మార్చారు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటే, ఆధార్‌ కార్డు, ఇంటికి సంబంధించిన పర్మిషన్‌ కాపీలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12గంటలకు కొద్ది నిమిషాలకు ముందు ఈ బుకింగ్స్‌ను ఓపెన్‌ చేస్తారు. కాసేపట్లోనే బుక్సింగ్‌ అయిపోతున్నాయి. ''పారదర్శకత పేరుతో ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రజలకు కొత్త కష్టాలు తీసుకొస్తోంది'' అని బిల్డింగ్ అండ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కంచుమర్తి కాటమ రాజు బీబీసీతో అన్నారు.

బల్క్‌బుకింగ్స్‌ పేరుతో కొందరు వ్యాపారులు అక్రమంగా ఇసుకను కొనుగోలు చేస్తున్నారని, దాన్ని తిరిగి బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. '' తూర్పుగోదావరి జిల్లాలోని ముగ్గళ్ల ర్యాంప్‌ నుంచి కాకినాడకి ఐదుటన్నుల లారీ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే రూ.15,500కి వస్తుంది. దానిని బయట రూ. 30వేలకు అమ్ముతున్నారు. అంటే రెట్టింపు ధర. అయినా సామాన్యులకు ఇసుక దొరకడం లేదు'' అన్నారు కాటమ రాజు.

సర్కారు తీరుపై విమర్శలు
ఆన్‌లైన్‌ బుకింగ్‌లతో ఇసుక మోసాలు అరికడతామంటున్న ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఏపీలో ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటు నిర్మాణరంగంలో ఉన్నవారు కూడా ప్రస్తుత విధానంలో స్పష్టత లేదంటున్నారు.

''ఇసుక అమ్మకం విధానంలో ప్రభుత్వం చెబుతున్నదానికి ఆచరణకు తేడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే, లాక్‌డౌన్‌ సడలించారు కాబట్టి...అన్ని ర్యాంపుల్లో తవ్వకాలకు అనుమతి ఇవ్వాలి'' అని గుంటూరు జిల్లాకు చెందిన బిల్డర్‌ రమేశ్‌ కుమార్ బీబీసీతో అన్నారు.

''కొరతను తీర్చకపోతే నిర్మాణ రంగం పుంజుకోదు. అత్యవసరమై బ్లాక్‌మార్కెట్‌లో కొన్నా, జరిమానాలు విధించి మళ్లీ సామాన్యుడినే ఇబ్బంది పెడుతున్నారు'' అని రమేశ్‌కుమార్‌ అన్నారు.

బల్క్‌లో ఇసుకను పెద్ద మొత్తంలో తరలించుకుపోయేందుకు వీలుగా నిబంధనలు ఉన్నాయని అంబాజీపేటకు చెందిన కె.ఎస్‌.ప్రసాద్ బీబీసీతో అన్నారు.

''మా ఇంటి నిర్మాణంలో చిన్నచిన్న మార్పుల కోసం రెండు ట్రాక్టర్ల ఇసుక కావాలని పది రోజులుగా ప్రయత్నం చేస్తున్నా. కోనసీమలోని చాలా ఇసుక ర్యాంపులను మూసేశారు. ఎందుకు తెరవలేదన్నది ఎవరికీ తెలియదు'' అని ప్రసాద్ వాపోయారు.

''చాలాచోట్ల మధ్యలోనే పక్కదారి పడుతోంది. అధికారిక స్టాక్‌ పాయింట్లకు, ర్యాంపుల నుంచి తరలిస్తున్న ఇసుక నిల్వలకు పొంతన లేదు'' అని ఆయన ఆరోపించారు.

ఇటు భవన నిర్మాణ కార్మికులు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ''నిర్మాణ పనులు మొదలైత కూలికి పోదామని ఎదురుచూస్తున్నా. మూడు నెలలుగా పనుల్లేవు. ఇసుక లేక ఎక్కడా పనులు జరగట్లేదు. మాకు కూలి దొరకడం లేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడకు చెందిన భవన కార్మికుడు ఉమామహేశ్వరరావు. ''చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లకు కూడా పనులు దొరకడం లేదు. ప్రభుత్వం ఆలోచించాలి'' అన్నారాయన.

అధికార పార్టీ నేతలదీ అదే వేదన.
సామాన్యులు, విపక్షాలు, భవననిర్మాణ కార్మికులే కాదు అధికార పార్టీ నేతలు కూడా ప్రస్తుత ఇసుక విధానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

'' జగన్ ఎన్ని మంచి పనులు చేసినా ఇసుక కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది'' అని అన్నారు విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.

గుంటూరు జిల్లా జెడ్పీ సమావేశంలో వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ''రీచ్‌లో ఎత్తిన ఇసుక, యార్డు దాకా రావడం లేదు'' అని తీవ్రవ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఏమంటోంది ?
ఇసుక సమస్యపై వెల్లువెత్తుతున్న నిరసనలకు ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

''ఇసుక బుకింగ్‌లో అక్రమాలు గుర్తించాం. బుకింగ్‌ విధానాన్ని సరళతరం చేస్తాం'' అన్నారాయన. ''సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుక బుకింగ్‌ ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నాం.

ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 70 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ చేయాలని నిర్ణయించాము. కొరత రాకుండా చూస్తాం'' అని వివరించారు రామచంద్రారెడ్డి.

Tuesday, June 2, 2020

నిమ్మగడ్డ కేసు: హైకోర్టులో స్టే పిటిషన్ ఉపసంహరించుకున్న జగన్ సర్కార్

నిమ్మగడ్డ కేసు: హైకోర్టులో స్టే పిటిషన్ ఉపసంహరించుకున్న జగన్ సర్కార్

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టులో వేసిన స్టే పిటిషన్‌ను జగన్ సర్కార్ ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాల్సిందేనంటూ మే 29న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ను తొలగిస్తూ తెచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుతం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారంటూ నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం శనివారం మీడియాతో మాట్లాడుతూ... సుప్రీం కోర్టుకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేసినట్లు గుర్తు చేశారు. అప్పటి వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరామన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుందన్నారు. ఓ అడ్వకేట్ జనరల్ మీడియాతో మాట్లాడటం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Jun 2 2020 @ 02:20AMహోంఆంధ్రప్రదేశ్తెరపైకి ‘మూడో కృష్ణుడు’!
రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త కమిషనర్‌!!

హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇస్తేనే!!
నిమ్మగడ్డకు మళ్లీ కుర్చీ దక్కకూడదు
మరో ఆర్డినెన్స్‌ జారీకి సర్కారు కసరత్తు!
హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇస్తేనే!!

అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కమిషనర్‌గా పునర్నియమించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్న జగన్‌ ప్రభుత్వం.. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తుందని ఆశిస్తోంది. అదే జరిగితే కొత్త కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రమేశ్‌కుమార్‌ మళ్లీ కమిషనర్‌ కుర్చీలో కూర్చోకుండా అడ్డుకునేందుకే ఈ వ్యూహం రచిస్తున్నట్లు తెలిసింది. నిజానికి హైకోర్టు తీర్పునకు అనుగుణంగా కమిషనర్‌గా తాను తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు రమేశ్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

కానీ ప్రభుత్వం వ్యతిరేకించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి దానిని ఉపసంహరించారు. దీంతో రమేశ్‌కుమార్‌ కమిషనర్‌గా ఉన్నట్లా. లేనట్లా అన్నది అర్థం కావడం లేదు. మరోవైపు జగన్‌ ప్రభుత్వం కమిషనర్‌గా నియమించిన జస్టిస్‌ కనగరాజ్‌ కూడా హైకోర్టు తీర్పుతో పదవిని కోల్పోయారు. దీంతో కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండడం, రాజ్యాంగబద్ధమైన పదవి ఖాళీగా ఉండకూడదన్న నియమాలను అనుసరించి.. వీరిద్దరూ కాకుండా మూడో వ్యక్తిని కమిషనర్‌గా నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మన్మోహన్‌సింగ్‌ను కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి కసరత్తు మొదలైందని సచివాలయ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంఽధించి పలు న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. 

పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 200 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించాలి. అయితే హైకోర్టు ఈ అంశంలో జగన్‌ ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టినందున ఆ సెక్షన్‌ కింద నియమితులైన రమేశ్‌కుమార్‌ నియామకం కూడా చెల్లదని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు గనుక హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తే.. తాజా నియామక ప్రక్రియ మొదలుపెట్టి మన్మోహన్‌సింగ్‌తో కమిషనర్‌ పదవిని భర్తీచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆర్డినెన్స్‌ను, తద్వారా జరిగిన జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో.. పాత చట్టం ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంది. అంటే ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ఆపై స్థాయిలో పనిచేసిన వారినే నియమించాలి.

మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక సీఎస్‌ కేడర్‌లో రిటైరైనందున ఆయన్ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా హైకోర్టు ఓ తీర్పు వెలువరించి.. నిర్దుష్టంగా ఇన్ని రోజుల్లో అమలు చేయాలని చెప్పకపోతే.. అమలుకు 2 నెలల వ్యవధి ఉంటుందని అడ్వకేట్‌ జనరల్‌ చెబుతున్నారు. అంటే అప్పటి వరకు ఈ వాదం నడుస్తూనే ఉంటుందన్న మాట. అయితే, రాజ్యాంగబద్ధమైన పదవి ఖాళీగా ఉండకూడదు. స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలని ఒక వర్గం వాదన. అయితే  పంచాయతీరాజ్‌ చట్టంలో అలాంటి ఏర్పాట్లు లేవు. అందువల్ల కమిషనర్‌ పోస్టు ఖాళీ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేలా చట్టాన్ని సవరించి.. మరో ఆర్డినెన్స్‌ జారీచేసి.. దాని ప్రకారం మన్మోహన్‌ను నియమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.